‘‘బై చాన్స్ రైటర్ అయ్యాను. నిజానికి దర్శకత్వమే ఆసక్తి. వీవీ వినాయక్‌గారు తీసిన ‘ఠాగూర్’ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. డైరెక్టర్‌గా నా ఫస్ట్ సినిమా ‘టచ్ చేసి చూడు’ పట్ల ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాను’’ అన్నారు విక్రమ్ సిరికొండ. రవితేజ హీరోగా ఆయన దర్శకత్వంలో లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై బేబీ భవ్య సమర్పణలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. వచ్చే నెల మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో విక్రమ్ సిరికొండ చెప్పిన విశేషాలు...
∙నిజం చెప్పే అబద్ధం సినిమా అని ఒక మహానుభావుడు అన్నారు. నా సినిమా చెప్పే నిజం బ్యాలెన్సింగ్ లైఫ్. ఒక డెడికేటెడ్ డ్యూటీ మైండెడ్ పోలీసాíఫీసర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ఛాలెంజెస్‌ను బ్యాలెన్స్ చేయడం కోసం చేసే యుద్ధమే ఈ ‘టచ్ చేసి చూడు’. యాక్షన్, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా ఉంది. రవితేజది డ్యూయెల్ రోల్ కాదు. డిఫరెంట్ టైమ్ అండ్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. పోలీసాఫీసర్‌గా రవితేజ చేసిన గత సినిమాలతో పోల్చినప్పుడు ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కొంచెం ఎమోషనల్‌గా కూడా ఉంటుంది. మోడ్రన్ టెక్నాలజీని యూజ్ చేస్తూ నేరస్తులను ఎలా గుర్తించాడు? అనే సీన్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
∙ఈ సినిమా కథ వక్కంతం వంశీది. నిర్మాత బుజ్జిగారు చెబితే, కథ విన్నాను. నచ్చింది. హీరో రవితేజ అని తెలిసింది. ఆల్రెడీ రవితేజతో ‘మిరపకాయ్’ సినిమా చేశా. వంశీ కథను నాకు అనుకూలంగా చేంజ్ చేసుకున్నాను. వంశీ కూడా హెల్ప్ చేశాడు. ఇందులో హీరోయిన్స్ రాశీఖన్నా, సీరత్ కపూర్ క్యారెక్టర్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. ప్రీతమ్ అండ్ జామ్ 8 మంచి సంగీతం ఇచ్చాడు. రీ–రికార్డింగ్ మణిశర్మగారు చేస్తున్నారు.
∙మాది హైదరాబాద్. బెంగళూరులో కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఫిల్మ్ కోర్స్ ఢిల్లీలో చేశాను.
∙ఠాగూర్, సాంబ, బన్నీ చిత్రాలకు డైరెక్షన్ విభాగంలో వర్క్ చేశాను. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ సినిమాతో రైటర్‌గా మారా.
రైటర్ అయినా నా డైరెక్షన్ అటువైపే
Published Sat, Jan 20 2018 12:45 AM | Last Updated on Sat, Jan 20 2018 12:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment