'టచ్ చేసి చూడు' అంటున్న రవితేజ
మాస్ మహరాజ్ రవితేజ సినిమా కోసం అభిమానులు సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. బెంగాల్ టైగర్ సినిమాతో డీసెంట్ హిట్ సాధించిన రవితేజ, ఆ తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందన్న తరుణంలో ఆగిపోవటంతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు.
ఈ గ్యాప్లో వరల్డ్ టూర్ కు వెళ్లొచ్చిన మాస్ హీరో.. ఫైనల్గా కొత్త సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశాడు. ఇన్నాళ్లు రూమర్స్ గానే ఉన్న వార్తలపై క్లారిటీ ఇస్తూ కొత్త సినిమా పోస్టర్ను కూడా రిలీజ్ చేశాడు. టచ్ చేసి చూడు అనే టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాకు విక్రమ్ సిరకొండ దర్శకుడు. నల్లమలుపు బుజ్జి, వల్లభనేని వంశీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 26న రవితేజ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్లో రవితేజకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు ఫిబ్రవరిలో షూటింగ్ మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.