‘రాజా ది గ్రేట్‌’ కి సీక్వెల్‌.. మరోసారి మాయ చేయనున్న అనిల్‌ | Latest Buzz: Is Ravi Teja Team Up With Anil Ravipudi For Raja The Great Sequel | Sakshi
Sakshi News home page

Ravi Teja: ‘రాజా ది గ్రేట్‌’ కి సీక్వెల్‌.. మరోసారి మాయ చేయనున్న అనిల్‌

Published Sat, May 1 2021 4:09 PM | Last Updated on Sat, May 1 2021 6:07 PM

Latest Buzz: Is Ravi Teja Team Up With Anil Ravipudi For Raja The Great Sequel - Sakshi

మాస్‌ మహారాజ రవితేజ, యంగ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన సూపర్‌ హిట్‌ మూవీ ‘రాజా ది గ్రేట్‌’. 2017లో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఇందులో రవితేజని అంధుడిగా చూపించి మెప్పించాడు అనిల్‌ రావిపూడి. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో దీనికి సీక్వెల్‌ ఉంటుందని అనిల్‌ రావిపూడి ఓ సందర్భంలో చెప్పాడు. అయితే అది ఎప్పుడనేది కూడా చెప్పలేనని తెలిపారు.

తాజాగా దీనిపై ఓ న్యూస్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అనిల్ రావిపూడి 'రాజా ది గ్రేట్' సీక్వెల్‌కు కథ రెడీ చేస్తున్నాడట. ఇటీవల హీరో రవితేజకి అనిల్‌ రావిపూడి స్టోరీలైన్‌ వినిపించాడట. అది నచ్చడంతో పూర్తి స్కిప్టు రెడీ చేసుకోమని రవితేజ చెప్పాడట. దీంతో అనిల్‌ రావిపూడి స్క్రిప్ట్‌ రెడీ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా ఉదృతి తగ్గి, పరిస్థితులు అనుకూలిస్తే ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ చిత్రంలో నటిస్తున్నాడు. అనిల్ రావిపూడి వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌ 3’ మూవీ తీస్తున్నాడు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్‌ నిలిచిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement