మెగా హీరో అతిథి పాత్రపై క్లారిటీ..! | Anil ravipudi about sai dharamtej guest role | Sakshi
Sakshi News home page

మెగా హీరో అతిథి పాత్రపై క్లారిటీ..!

Published Fri, Oct 13 2017 1:11 PM | Last Updated on Fri, Oct 13 2017 1:11 PM

Sai Dharam Tej Ravi teja

చాలా రోజుల తరువాత మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజా ది గ్రేట్. పటాస్ ఫేం అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్  అవుతోంది. రవితేజ అంధుడిగా నటిస్తున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందింది. రవితేజ మార్క్ కామెడీతో పాటు మాస్ యాక్షన్, కామెడీ అలరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.

అయితే కొద్ది రోజులుగా ఈ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ అతిథి పాత్రలో నటించాడన్న ప్రచారం జరుగుతోంది. రాజా ది గ్రేట్ యూనిట్ తో సాయి కలిసి దిగిన సెల్పీలు సోషల్ మీడియాలో దర్శనమివ్వటంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అయితే తాజాగా ఈ విషయంపై దర్శకుడు అనీల్ క్లారిటీ ఇచ్చారు. తమ సినిమాలో రాశీఖన్నా మాత్రమే గెస్ట్ రోల్ చేశారన్న అనీల్, సాయి సరధాగా సెట్ కు వచ్చారే గాని తమ సినిమాలో నటించలేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement