రాజా ది 'గ్రేట్ డీల్' | Raja the great satellite Digital and Hindhi Rights | Sakshi
Sakshi News home page

రాజా ది 'గ్రేట్ డీల్'

Published Sun, Sep 24 2017 3:22 PM | Last Updated on Sun, Sep 24 2017 7:14 PM

Raja the great satellite Digital and Hindhi Rights

లాంగ్ గ్యాప్ తరువాత మాస్ మహరాజ్ రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజా ది గ్రేట్. రవితేజ అంధుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్ గా నటిస్తోంది. పటాస్, సుప్రీమ్ సినిమాలతో వరుస విజయాలు సాధించిన అనీల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

అనీల్ ట్రాక్ రికార్డ్ కు రవితేజ మాస్ ఇమేజ్ తొడవ్వడంతో రాజా ది గ్రేట్ సినిమా రైట్స్ కు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసిన చిత్రయూనిట్, శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూడు రైట్స్ కలిపి 18 కోట్లు పలికినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రవితేజ సినిమాల డబ్బింగ్ వర్షన్ లకు ఉత్తరాదిలో మంచి డిమాండ్ ఉండటం కూడా ఈ సినిమాకు కలిసొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement