
ఫ్రమ్ ఏ టూ సి... ఏ సెంటరైనా రవితేజకు ఫ్యాన్స్ ఉన్నారు. జస్ట్ రెండే సినిమాల (సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం)తో యూత్, ఫ్యామిలీస్‌కి దగ్గరయ్యారు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. మాస్ హీరో రవితేజతో ఈ యంగ్ డైరెక్టర్ చేస్తోన్న సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవికా శర్మ కథానాయిక.
‘‘రెగ్యులర్ షూట్‌ను స్టార్ట్ చేశాం. సక్సెస్‌లో ఉన్న రవితేజ, కల్యాణ్ కృష్ణ కాంబినేషన్‌లో మా బ్యానర్‌పై సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సినిమా గురించి ఆల్రెడీ ఇండస్ట్రీలో బజ్ స్టార్ట్ అయ్యింది. ముకేశ్ కెమెరామెన్‌గా వర్క్ చేస్తున్నారు’’ అన్నారు రామ్ తాళ్లూరి. ఫస్ట్ డే షూటింగ్ స్పాట్‌లో యూనిట్ మెంబర్స్‌తో రవితేజ సరదాగా సెల్ఫీ దిగి, సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment