
మాళవిక శర్మ
జనరల్‌గా ఓ సినిమా విడుదలయ్యాకే తర్వాతి సినిమాలకు అవకాశం వస్తుంటుంది. ఏ కొందరి కథానాయికలకో తొలి సినిమా విడుదలవక ముందే తర్వాతి చిత్రాల్లో నటించే చాన్స్ వస్తుంది. ఇలాంటి అవకాశమే మాళవిక శర్మని వరించిందని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా ‘నేల టిక్కెట్టు’ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రవితేజకి జోడీగా నటిస్తున్నారు మాళవిక. తెలుగులో ఆమెకి ఇదే తొలి చిత్రం.
ఆ సినిమా చిత్రీకరణలో ఉండగానే రామ్ హీరోగా రూపొందనున్న సినిమాలో కథానాయికగా చాన్స్ దక్కించుకున్నారట ఈ బ్యూటీ. ‘గరుడవేగ’ వంటి హిట్ చిత్రం తర్వాత ప్రవీణ్ సత్తారు ఓ అడ్వెంచరస్ సినిమా చేయనున్నారు. ఇందులో రామ్ హీరో. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రంలో తొలుత కాజల్ అగర్వాల్ నటించనున్నారనే వార్తలు హల్‌చల్ చేశాయి. తాజాగా మాళవిక శర్మ పేరు తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment