‘బెంగాల్ టైగర్’ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకోవడానికి, ఇప్పుడు వరుస సినిమాలు చేయడానికి ప్రత్యేక కారణాలు లేవు. అప్పుడంటే కుదరలేదు. ఇప్పుడు అన్నీ కుదిరి వరుస చిత్రాలు చేస్తున్నాను. శ్రీనువైట్లతో చేస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమా రీమేకే అయినా, కథలో దాదాపు 70% మార్పులు చేశాం. ఈ చిత్రంలో మా అబ్బాయి మహాధన్ నటించాల్సి ఉంది. కానీ, పరీక్షలు ఉండటంతో చేయలేకపోయాడు.
‘‘నేల టిక్కెట్టు’ చిత్రంలో నాది అనాథ పాత్ర. ప్రతి మనిషిలోనూ ఏదో ఒక బంధాన్ని వెతుక్కునే మనిషిలా కనిపిస్తా. ఎప్పుడూ జనాల మధ్యలోనే ఉండాలనేది సినిమాలో నా ఫిలాసఫీ. ఈ టైటిల్ ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తే తెలుస్తుంది’’ అని రవితేజ అన్నారు. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రవితేజ పంచుకున్న విశేషాలు.
– ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా కంటే ముందే కల్యాణ్ కృష్ణ ‘నేల టిక్కెట్టు’ కథ నాకు చెప్పాడు. అయితే.. అప్పటికి నాకు వేరే కమిట్‌మెంట్స్ ఉండటంతో కుదరలేదు. ఈలోపు కల్యాణ్ ‘సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుకచూద్దాం’ సినిమాలు చేశాడు. మా కాంబినేషన్‌లో సినిమా ఇప్పటికి కుదిరింది.
– ఈ చిత్రం ట్రైలర్‌లో సీనియర్ సిటిజన్‌కి సంబంధించి ‘ముసలితనం అంటే చేతకానితనం కాదురా.. నిలువెత్తు అనుభవం’ అనే డైలాగ్ చాలామందికి తెగ నచ్చేసింది. కథలో ఆ పాయింట్ నన్ను బాగా టచ్ చేసింది. దీంతో పాటు మంచి ఫన్, హీరోయిన్‌తో లవ్ ట్రాక్.. వంటి అంశాలు చాలా ఉంటాయి. పేరెంట్స్‌ని పట్టించుకోని వాళ్లు ఎందుకు బతుకుతారో కూడా నాకు
అర్థం కాదు.
– ‘నేల టిక్కెట్టు’ టైటిల్ మాస్ అప్పీల్ కోసం పెట్టినది కాదు. సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ రిఫ్లెక్ట్ అయ్యే టైటిల్ అది. సొంత మనుషులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నవాళ్లని తన వాళ్లలా ఫీలవడం, వారికోసం తపించడం అనేది సినిమాలో చాలా పెద్ద ఎమోషన్. ఈ పాయింట్ చుట్టూ సినిమా తిరుగుతుంది. ఈ సినిమాలోని కంటెంట్ నేల టిక్కెట్టు ఆడియన్సే కాదు.. బాల్కనీ ఆడియన్స్ కూడా విజిల్స్ వేసేలా ఉంటుంది.
– ఈ చిత్రంలో కొంచెం రివెంజ్ డ్రామా కూడా ఉంటుంది. కల్యాణ్ సినిమాల్లో క్లాస్, మాస్ టచ్ రెండూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అంతే. కంప్లీట్‌గా కల్యాణ్ మార్క్ ఎలివేట్ అవుతుంది. కథ మరీ కొత్తది కాకపోయినా ప్రతి క్యారెక్టర్‌ని డిఫెరెంట్‌గా ప్రజెంట్ చేశాడు. ఈ సినిమాలో జగపతిబాబుగారి పాత్ర చాలా బాగుంటుంది.
– రామ్ తాళ్లూరిగారు నిజాయితీగా, పాజిటివ్‌గా ఉంటారు. పైకి ఒకలా బయట ఇంకోలా అస్సలు ఉండరు. అక్కడే మా ఇద్దరికీ సింక్ అయింది. ఆయన డబ్బు సంపాదిద్దామని ఈ సినిమా తీయలేదు. ఆల్రెడీ ఆయన వద్ద డబ్బుంది. సినిమా అంటే ప్యాషన్‌తోనే ఈ చిత్రం తీశారు. ఆయనతో ఒక సినిమా కాదు చాలా సినిమాలు చేయాలని ఉంది. ఆయన ప్రొడక్షన్‌లో ఇంకో సినిమా చేస్తున్నా.
– శక్తికాంత్ మ్యూజిక్ నాకు చాలా నచ్చేసింది. తను కంపోజ్ చేసిన ‘ఫిదా’ సినిమా సాంగ్స్ కూడా నాకు ఇష్టం. ఈ సినిమాకూ మంచి పాటలిచ్చాడు.
– అనూ ఇమ్మాన్యుయేల్ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాతో పాటు నాగచైతన్యతో ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా కూడా చేస్తోంది. మా సినిమాకి ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సి ఉంది. దానివల్ల ఆ సినిమాకు ఇబ్బంది కలుగుతుందని మా చిత్రం నుంచి తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment