ఈ శుక్రవారం నేల టిక్కెట్టు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న రవితేజ తన నెక్ట్స్ సినిమాకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాను ప్రారంభించారు రవితేజ. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అయితే ముందుగా ఈ సినిమాను అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తుందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. మరో హీరోయిన్‌గా శృతిహాసన్ పేరును పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
అయితే ఇతర చిత్రాలతో పాటు కుటుంబ సమస్యల కారణంగా అను ఇమ్మాన్యూల్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు కూడా ధృవికరించారు. దాదాపు 50 రోజుల పాటు అమెరికాలో షూటింగ్ చేయాల్సి ఉండటంతో డేట్లు సర్ధుబాటు చేయలేకే అను తప్పుకుంటున్నట్టుగా చిత్రయూనిట్ తెలిపారు. దీంతో అను స్థానంలో గోవాబ్యూటీ ఇలియానాను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది.
Due to non availability of dates for our long USA schedule of 50 days, Anu Emmanuel will not be working in our film #AmarAkbarAnthony.
— Mythri Movie Makers (@MythriOfficial) 19 May 2018
Unfortunately I won’t be a part of #AmarAkbarAnthony due to date clash between #SailajaReddyAlludu
— Anu Emmanuel (@ItsAnuEmmanuel) 19 May 2018
I wish the team of #AmarAkbarAnthony all the best 🙏🏼😊 https://t.co/knQr32bZaw
Comments
Please login to add a commentAdd a comment