రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ ఓపెనింగ్
కొంతకాలంగా వరుస ఫెయిల్యూర్స్‌తో కష్టాల్లో పడ్డ స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కొత్త సినిమాను ప్రారంభించాడు. మాస్ మాహారాజ్ రవితేజ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాను ఈ రోజు (గురువారం) పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. గతంలో శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన వెంకీ, దుబాయ్ శీను సినిమాలు మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అందుకు తగ్గట్టుగా ఈ సినిమాలో రవితేజ త్రిపాత్రాభినయం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రవితేజ సరసన అను ఇమ్మాన్యూల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీత మందిస్తుండగా కామెడీ స్టార్ సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment