
సీనియర్ హీరో రవితేజ కెరీర్ పెద్దగా ఆశాజనకంగా లేదు. వరుసగా టచ్ చేసి చూడు, నేల టిక్కెట్టు సినిమాలు నిరాశపరచటంతో తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు మాస్ మహరాజ్. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో నటిస్తున్న రవితేజ, తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు.
ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం సినిమాలతో ఆకట్టుకున్న విఐ ఆనంద్ దర్శకత్వంలో నటించేందుకు అంగీకరించాడు. ఈ సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో మాళవిక శర్మను హీరోయిన్‌గా ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్. ఈ భామ రవితేజ సరసన నటించిన నేల టిక్కెట్టు నిరాశపరిచినా మరోసారి మాళవికకు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు రవితేజ.
Comments
Please login to add a commentAdd a comment