
‘సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్.. వేడుక చూద్దాం’ వంటి కుటుంబ కథా చిత్రాలతో మంచి విజయాలు అందుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నేల టిక్కెట్టు’. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మాళవిక శర్మ కథానాయిక. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాని మే 24న విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా రామ్ తాళ్లూరి మాట్లాడుతూ– ‘‘సకుటుంబ సపరివార సమేతంగా చూసేలా తెరకెక్కుతోన్న చిత్రమిది. రవితేజ ఎనర్జీ లెవల్స్‌కి తగ్గట్టుగా ఉంటూనే, కల్యాణ్ కృష్ణ శైలిలో ఉంటుంది. దాదాపు 80% షూటింగ్ పూర్తయింది. మరో మూడు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. వేసవికి సినిమా విడుదల చేయనున్నాం. ‘ఫిదా’ ఫేమ్ శక్తికాంత్ చక్కటి సంగీతం అందించారు’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ముఖేష్, సమర్పణ: సాయిరిషిక.
Comments
Please login to add a commentAdd a comment