కల్యాణ్‌కృష్ణ
‘‘నేల టిక్కెట్టు’ టైటిల్ అని పెట్టినప్పటికీ సినిమా మాత్రం అన్ని సెక్షన్ ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుంది. బాల్కనీ ఆడియన్స్ లాజిక్స్ పట్టించుకుంటారు. ఈ సీన్ ఇలా కాకుండా అలా తీసుంటే బావుండు అనే విషయాన్ని ఆలోచిస్తారు. కానీ నేల టిక్కెట్టు ఆడియన్స్ మాత్రం ఇవేమీ ఆలోచించకుండా మూవీను ఎంజాయ్ చేస్తారు. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక్కో సినిమాను రెండుసార్లు చూసేవాణ్ణి. బాల్కనీలో ఒకసారి, నేల టిక్కెట్టులో ఒకసారి’’ అన్నారు కల్యాణ్‌కృష్ణ కురసాల. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్ కృష్ణ విలేకరులతో పలు విశేషాలు పంచుకున్నారు.
► మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నేల టిక్కెట్టు’. రవితేజ సినిమా అంటే ఆడియన్స్ కచ్చితంగా కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఈ సినిమాలోనూ 70 శాతం కామెడీ ఉంటుంది. ఆవారాగా తిరిగే కుర్రాడిగా రవితేజ క్యారెక్టర్ ఉంటుంది. అతని క్యారెక్టర్‌కు రెండు షేడ్స్ ఉంటాయి. కామెడీ యాంగిల్ ఒకటి. ఫైర్ యాంగిల్ మరోటి. చుట్టూ జనం, మధ్యలో మనం ఉండాలి అనే మనస్తత్వం ఉన్న క్యారెక్టర్ అతనిది.
► రామ్ తాళ్లూరిగారికి ప్రొడక్షన్ ఫస్ట్ టైమ్ అయినా ఎక్కడా అలా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్నవారిలా హ్యాండిల్ చేశారు. రవితేజగారి స్పీడ్, ప్రొడక్షన్ వాళ్ల సహకారం వల్ల పెద్ద క్యాస్టింగ్ ఉన్న సినిమాను కూడా అనుకున్న టైమ్‌కు కంప్లీట్ చేయగలిగాం.
► మాళవికా శర్మ మంచి క్యారెక్టర్ ప్లే చేశారు. శక్తికాంత్ కార్తీక్ క్వాలిటీ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ సినిమా వర్కింగ్ ప్రాసెస్‌లో రవితేజ గారి దగ్గర సిన్సియారిటీ నేర్చుకున్నాను. పని పట్ల ఆయనకు ఉన్న రెస్పెక్ట్ చాలా గ్రేట్. ఇవాళ ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనిని కచ్చితంగా ఆ రోజే కంప్లీట్ చేస్తారు. స్క్రీన్ మీద ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. .
► ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాలను ఎక్కువగా ఇష్టపడతాను. అలాంటి సినిమాలే తీయడానికి ఇష్టపడతాను. ‘రంగస్థలం’, మహానటి’ సినిమాలు ప్రయోగాలు కాదు. రియలిస్టిక్‌గా, కన్విక్షన్‌తో చెప్పిన పాయింట్స్.
► ఎక్స్‌పెరిమెంట్స్ కాకుండా కన్విక్షన్‌తో కథ చెప్పాలనుకుంటాను.
► సీనియర్ సిటిజన్స్‌కి చాలామంది రెస్పెక్ట్ ఇవ్వరు. ఆ విషయాన్ని ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌గా చూపించాను. వాళ్లను రెస్పెక్ట్ చేయాలి. నిలువెత్తు అనుభవం అనే డైలాగ్ కూడా రాసుకున్నా.
► తర్వాతి ప్రాజెక్ట్ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్ ‘బంగార్రాజు’ అనుకుంటున్నాను. స్టోరీ కంప్లీట్ అవ్వగానే నాగార్జునగారిని కలుస్తాను. జులై, ఆగస్టులో మొదలుపెడదాం అనే ఆలోచనలో ఉన్నాను’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment