సెకండ్‌ చాన్స్‌! | Malvika Sharma in Sai Dharam Tej Next | Sakshi
Sakshi News home page

సెకండ్‌ చాన్స్‌!

Published Tue, May 28 2019 9:54 AM | Last Updated on Tue, May 28 2019 9:54 AM

Malvika Sharma in Sai Dharam Tej Next - Sakshi

రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టిక్కెట్టు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటీ మాళవిక శర్మ. తొలి సినిమా డిజాస్టర్‌ కావటంతో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సోషల్‌ మీడియాలో టైం పాస్‌ చేస్తున్న మాళవికకు ఇన్ని రోజుల తరువాత సెకండ్‌ చాన్స్‌ వచ్చినట్టుగా తెలుస్తోంది.

చిత్రలహరి సినిమాతో పరవాలేదనిపించుకున్న మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌, మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించనున్నారు. తొలి సినిమా ఫ్లాప్ కావటంతో ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నారు మాళవిక. గీతా ఆర్ట్స్‌ 2, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement