
రవితేజ, మాళవికాశర్మ
భారతదేశంలోని మొట్టమొదటి స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో రవితేజ, మాళవికాశర్మ ఆట, పాటతో బిజీగా ఉన్నారు. ఇంతకీ ఆ పార్కు ఎక్కడుంది? రవితేజ, మాళవిక అక్కడేం చేస్తున్నారనేగా మీ డౌట్? హైదరాబాద్‌లోని గండిపేటలో ఆ పార్కు ఉంది. అక్కడే మూడు రోజులుగా ఆట, పాటలతో సందడి చేస్తున్నారు. ఇదంతా ‘నేల టిక్కెట్టు’ చిత్రం కోసమే. రవితేజ, మాళవికాశర్మ జంటగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’.
క్లాస్, మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా పాటల చిత్రీకరణ స్కైజోన్ ట్రాంపోలిన్ పార్కులో నృత్య దర్శకుడు రాజు సుందరం నేతృత్వంలో జరుగుతోంది. షూటింగ్ శరవేగంగా పూర్తి చేసి, మే 24న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు. జగపతిబాబు, బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, సుబ్బరాజు, అలీ, పోసాని కృష్ణమురళి, అన్నపూర్ణమ్మ, ప్రియదర్శి, పృథ్వీ, సురేఖా వాణి, ప్రవీణ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సంగీతం: శక్తికాంత్ కార్తీక్, కెమెరా: ముఖేష్.
Comments
Please login to add a commentAdd a comment