
ఈ రోజు మన చేతిలో ఉన్న వంద నోటు నిన్న ఒకరిది. రేపు ఇంకొకరిది. డబ్బు వల్ల సుఖాలు, సౌకర్యాలు పొందొచ్చు. కానీ సంతోషం, తృప్తి, గౌరవం దొరకవు. కొనడానికి ఎవరి వద్దా అమ్మకానికి ఉండవు. ఇప్పుడిదంతా ఎందుకు అంటే ‘నేలటిక్కెట్టు’ సినిమా గురించి చెప్పడానికి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందుతున్న సినిమా ‘నేలటిక్కెట్టు’. ఈ సినిమా కోసం గురువారం హైదరాబాద్‌లో ఫైట్ సీన్స్‌ను చిత్రీకరించారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్ కంప్లీటయ్యాక ‘నాకు డబ్బే ముఖ్యం’ అని జగపతిబాబు అంటే, ‘డబ్బులో లేదు ఆనందం. మన వెనక ఉన్న జనం అభిమానంలో ఉంటుంది. వారి ప్రేమలో దొరుకుతుంది’’ అని చెబుతారట రవితేజ. ఆ నెక్ట్స్ ఏంటి? అనేది వెండితెరపై చూడాల్సిందే. ఇందులో మాళవికా శర్మ కథానాయిక. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని సమాచారం. బ్రహ్మానందం, జయప్రకాశ్, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి, అలీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాను మే 24న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment