రాజా ది గ్రేట్ సినిమాతో ఘనవిజయం సాధించిన రవితేజ, మరోసారి తన ఎనర్జీకి తగ్గ పాత్రలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న టచ్ చేసి చూడు సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు రవితేజ. రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.