టచ్‌ చేస్తే... ఫైటే! | `Touch Chesi Chudu` aims for Sankranthi release | Sakshi
Sakshi News home page

టచ్‌ చేస్తే... ఫైటే!

Published Sat, Nov 25 2017 12:50 AM | Last Updated on Sat, Nov 25 2017 12:50 AM

`Touch Chesi Chudu` aims for Sankranthi release - Sakshi

దమ్ముంటే టచ్‌ చేసి చూడు అని సవాల్‌ విసిరారు రవితేజ. ఆ సవాల్‌కి రౌడీలు భయపడలేదు. టచ్‌ చేయాలని డిసైడ్‌ అయ్యారు. అంతే... రవితేజ రఫ్పాడించారు. ఫైనల్‌గా అతని టచ్‌కి దొరక్కుండా రౌడీలు ఎస్కేప్‌. విక్రమ్‌ సిరికొండ దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా రూపొందుతున్న ‘టచ్‌ చేసి చూడు’ కోసం యాక్షన్‌ సీక్వెన్స్‌ తీస్తున్నారు. పైన చెప్పినట్లే జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో రాశీ ఖన్నా, సీరత్‌ కపూర్‌ కథానాయికలు. రాశీ ఖన్నా డ్యాన్స్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఫ్రెడ్డీ దార్వాల ప్రతినాయక పాత్ర చేస్తున్నారు.

రీసెంట్‌గా హీరో, హీరోయిన్లపై సాంగ్‌ తీసిన ఈ చిత్రం యూనిట్‌  ఇప్పుడు రవితేజ, ఫ్రెడ్డీలపై కీలక సీన్స్‌తో పాటు, కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లను షూట్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అంటే... ప్రస్తుతం టచ్‌ చేస్తే ఫైట్‌ అన్నమాట. ‘‘టచ్‌ చేసి చూడు షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చాను’’ అని పేర్కొన్నారు ఫ్రెడ్డీ. రవితేజ స్టైల్‌లో సాగే పక్కా కమర్షియల్‌ మూవీ ఇది అని సమాచారం. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ వినికిడి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement