
టచ్ చేస్తే...!
వచ్చేశాడు... అభిమానులకు పుట్టినరోజు కానుకతో మాస్ మహారాజా రవితేజ వచ్చేశాడు. గత సినిమా కంటే మరింత సై్టలిష్‌గా, మాసీగా కొత్త సినిమా కబురుతో వచ్చేశాడు. రవితేజ హీరోగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించనున్న సినిమా ‘టచ్ చేసి చూడు’. విక్రమ్ సిరి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ సినిమా వివరాలను నేడు (జనవరి 26) రవితేజ పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘రవితేజ ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లు వక్కంతం వంశీ అద్భుతమైన కథ అందించారు.
ఫిబ్రవరి మొదటివారంలో చిత్రీకరణ మొదలుపెడతాం. చిరకాల మిత్రుడు రవితేజతో సినిమా నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు. విక్రమ్ సిరి మాట్లాడుతూ – ‘‘డిఫరెంట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. రవితేజ సరసన రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లుగా నటించనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, స్క్రీన్‌ప్లే: దీపక్‌రాజ్, మాటలు: శ్రీనివాస్‌రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి, మల్లు, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: రమణ, కెమేరా: ఎం. సుకుమార్, యాక్షన్: పీటర్ హెయిన్స్, సంగీతం: ప్రీతమ్స్ ఎ అండ్ ఆర్ వెంచర్ జామ్ 8.