సీరత్ కపూర్
‘‘నా తొలి చిత్రం ‘రన్ రాజా రన్’ మంచి హిట్. అంత మంచి సక్సెస్‌ఫుల్ సినిమా చేశానని నేను రియలైజ్ కాలేకపోయా. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు కూడా అంతే. అవి నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడతాయని చూడలేదు. ‘ఒక్క క్షణం’ సినిమాలాగా ‘టచ్ చేసి చూడు’ నా కెరీర్‌కి హెల్ప్ అవుతుందనుకుంటున్నా’’ అని సీరత్ కపూర్ అన్నారు. రవితేజ హీరోగా, రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం సీరత్ కపూర్ చెప్పిన విశేషాలు.
► ‘టచ్ చేసి చూడు’లో నా పాత్ర రొటీన్‌గా కాకుండా వైవిధ్యంగా ఉంటుంది. హీరోని డామినేట్ చేస్తుంటా. సినిమా మొత్తం ఉండను. ఇంటర్వెల్ తర్వాత వస్తా. నాకు, రాశీఖన్నాకు కాంబినేషన్ సీన్స్ లేవు. నేనింకా పూర్తి సినిమా చూడలేదు. అందుకే కథాంశం ఏంటని క్లారిటీగా చెప్పలేను. రవితేజగారు పోలీసాఫీసర్‌గా కనిపిస్తారు.
► రవితేజగారు వంటి పెద్ద హీరోతో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఆయన చాలా సింపుల్. సెట్స్‌లో సరదాగా ఉంటారు. ఇండస్ట్రీలో ఇన్నేళ్లు అలా ఉండటం మామూలు విషయంకాదు. ఎప్పుడూ ఎనర్జీగా, లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
► ‘రన్ రాజా రన్’ సక్సెస్ తర్వాత నా సినిమాలు కొన్ని సరిగ్గా ఆడలేదు. అందుకు పెద్దగా బాధపడను. ‘రాజుగారి గది–2’ నుంచి మంచి సినిమాలు చేస్తున్నాను. ‘టచ్ చేసి చూడు’లో నేను సెకండ్ హీరోయిన్‌ని కాదు. ఓ ముఖ్యమైన పాత్ర చేశా. అయినా.. ఫస్ట్ హీరోయిన్.. సెకండ్ హీరోయిన్ అని ఆలోచించను. పాత్రలోని ప్రాముఖ్యత చూసి, నచ్చితే చేస్తా.
► సురేశ్ ప్రొడక్షన్‌లో రానాతో ఓ సినిమా, ‘గుంటూరు టాకీస్’ ఫేమ్ సిద్ధు హీరోగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా. వీటితో పాటు మరో సినిమా ఒప్పుకున్నా. త్వరలో పూర్తి వివరాలు చెబుతా.
Comments
Please login to add a commentAdd a comment