
సాక్షి, హైదరాబాద్ : చాలా గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన ప్రముఖ టాలీవుడ్ నటుడు రవితేజ. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వస్తుండగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సినిమాలో ఓ కుటుంబాన్ని ప్రేమించే కొడుకుగా కనిపించడంతోపాటు తన జోలికి వచ్చినవారిని రఫ్పాడించే లుక్‌లో రవితేజ అదరగొట్టారు. ముఖ్యంగా 'యూనిఫాంలో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు.. యూనిఫాం తీసేస్తే దానమ్మ దానమ్మ రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు' అంటూ ఆయన పోలీసుగా రౌడీలకు ఇచ్చే వార్నింగ్, ఎమోషన్ చూస్తుంటే ఇటు కుటుంబ ప్రేక్షకులతోపాటు మాస్ చిత్రాలను అమితంగా ప్రేమించే వారికి కూడా మంచి విందు భోజనంగా ఈ సినిమాను తీసుకొచ్చారనిపిస్తుంది. దాంతోపాటు రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసిందే. విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వక్కంతం వంశీ కథను అందించారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment