theatrical trailer
-
'నీతో' థియేట్రికల్ ట్రైలర్.. విడుదల చేసిన సీతారామం డైరెక్టర్
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నీతో'. ఈ సినిమాకు బాలు శర్మ దర్శకత్వం వహించగా.. పృథ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇటీవల సక్సెస్ అయిన సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. 'మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ.. ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తు రాదు" లాంటి డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించింది చిత్ర బృందం. ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చగా.. సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 30వ థియేటర్లలో సందడి చేయనుంది. -
నా భర్తను నేనే చంపేశాను.!
సాక్షి, హైదరాబాద్: సత్యదేవ్, తెలుగమ్మాయి ఇషా రెబ్బా జంటగా నటించిన తాజా చిత్రం ‘రాగల 24 గంటల్లో’ థియేట్రికల్ ఆకట్టుకుంటోంది. శ్రీ నవహాస్ క్రియేషన్స్, శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్ బానర్స్ పై ఢమరుకం ఫేమ్ శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో నవ నిర్మాత శ్రీనివాస్ కానూరు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్ర యూనిట్ మంగళవారం విడుదల చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం తాజా ట్రైలర్ కొంచెం ఇంట్రస్టింగ్‌గాను..అంతే థ్రిల్లింగ్‌నూ ఆసక్తి రేపుతోంది. ఇషా రెబ్బా నటనలో మరో మెట్టు ఎక్కినట్టు కనిపిస్తోంది. కాగా శ్రీరాం, గణేష్ వెంకట్రామన్, ముస్కాన్ సేథీ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ నవంబర్ 15న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
అది ఫిల్మ్ స్కూల్.. ఇది వర్క్‌షాప్
‘‘దర్శకులు శేఖర్ కమ్ములగారి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో నాగరాజు క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ నన్ను కొందరు నాగరాజు అనే పిలుస్తున్నారు’’ అన్నారు సుధాకర్ కోమాకుల. హరినాథ్ బాబు. బి దర్శకత్వంలో సుధాకర్ కోమాకుల, నిత్యా శెట్టి జంటగా డి. శ్రీకాంత్ నిర్మించిన చిత్రం ‘నువ్వు తోపురా’. జేమ్స్ వాట్ సహ–నిర్మాత. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మాది వైజాగ్. పీజీ పూర్తి చేశాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమా తర్వాత ‘ఉందిలే మంచి కాలం, కుందనపు బొమ్మ’ సినిమాల్లో నటించాను. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల స్పందన లభించలేదు. ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న ‘నువ్వు తోపురా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఇందులో సరూర్‌నగర్ సూర్య అనే క్యారెక్టర్ చేశాను. మంచి పెయిన్ ఉన్న క్యారెక్టర్. గల్లీల్లో అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడు అమెరికా వెళ్తాడు. అక్కడ ఎలాంటి అనుభవాలు, పరిస్థితులు ఎదుర్కొన్నాడు? వాటి వల్ల అతనిలో వచ్చిన మార్పు ఏంటి? అన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే హీరోకి, అతని తల్లికి మధ్య సన్నివేశాలు భావోద్వేగభరితంగా ఉంటాయి. ఈ సినిమా దర్శకుడు హరినాథ్‌తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఇంతకుముందు రెండు కథలు విన్నాను కానీ మా కాంబినేషన్లో సినిమా కుదర్లేదు. ఇప్పటికి కుదిరింది. అమెరికాలో దాదాపు రెండు నెలలు షూటింగ్ చేశాం. డి. శ్రీకాంత్, జేమ్స్‌వాట్ దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నారు. ఈ సినిమాకు నేను క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా వర్క్ చేశాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటీపుల్’ ఫిల్మ్ స్కూల్లా అనిపిస్తే.. ఈ సినిమా వర్క్షాప్లా అనిపించింది. ఆడియన్స్‌తో ‘నువ్వు తోపురా’ అనిపించుకోవాలన్నదే హీరో తపన. అలాగే ఈ సినిమాలో ఓ సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంది’’ అని అన్నారు. ఇంకా సుధాకర్ మాట్లాడుతూ– ‘‘మంగళగిరిలో మా టీమ్ రోడ్డు ప్రమాదానికి గురవడం నాకు చాలా బాధ కలిగించింది. కారు నడిపింది నేను కాదు. ఈ దురదృష్టకర సంఘటనలో మరణించిన లక్ష్మీ కుటుంబానికి ఐదులక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించాలని టీమ్ నిర్ణయించింది’’ అ ని చెప్పుకొచ్చారు. -
‘అంతరిక్షం 9000 KMPH’ ట్రైలర్ లాంచ్
-
‘గెలవాలంటే ఏం చేయాలని మాత్రమే ఆలోచించాలి’
ఫిదా, తొలిప్రేమ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఘాజీ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాలో వ్యోమగామిగా నటిస్తున్నాడు. ‘అంతరిక్షం 9000 KMPH’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది డిసెంబర్ 21న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమా టైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మిరా అనే శాటిలైట్ దారి తప్పటంతో ప్రపంచంలోని కంమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు అంతరిక్షంలో ఆఫీసర్ దేవ్ చేసిన సాహసమే ఈ సినిమా కథ అని తెలుస్తోంది. తెలుగులో తొలి స్పేస్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆస్ట్రోనాట్‌గా కనిపించేందుకు వరుణ్ తేజ్ ప్రత్యేకంగా జీరో గ్రావిటీలో శిక్షణ తీసుకున్నారు. స్పేస్ షటిల్‌తో పాటు ఓ ఉపగ్రహం, ఇస్రో వాతావరణాన్ని ప్రత్యేకంగా సెట్ వేశారు. వరుణ్ సరసన అదితి రావ్ హైదరీ, లావణ్య త్రిపాఠిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను రాజీవ్ రెడ్డి, క్రిష్(దర్శకుడు) సంయుక్తంగా నిర్మించారు. -
జూన్ 25న ‘గోల్డ్’ ట్రైలర్
బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘గోల్డ్’. 1946 ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీలో గోల్డ్ మెడల్ అందించిన కోచ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గోల్డ్ టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా టీజర్‌లోని డైలాగ్స్ సినిమా మీద అంచనాలు పెంచేస్తున్నాయి. రీమా కగ్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మౌనీ రాయ్, కునాల్ కపూర్, అమిత్ సద్, వినీత్ కుమార్‌సింగ్‌లు ఇతర కీలక పాత్రలు నటిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈసినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ఈ నె 25న రిలీజ్ చేయనున్నారు. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్ ట్రైలర్ మరింత ఆసక్తికరంగా ఉంటుందని హామీ ఇస్తోంది. The dream that united our nation, The dream that began in 1936, The dream that took 12 years to become a reality. Get ready to witness... #GoldTrailer releasing on the 25th of June pic.twitter.com/6xdoSVFmwO — Akshay Kumar (@akshaykumar) 19 June 2018 -
రౌడీల దుమ్ముదులుపుతున్న రవితేజ..
సాక్షి, హైదరాబాద్ : చాలా గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్ చిత్రంతో మంచి ఫామ్‌లోకి వచ్చిన ప్రముఖ టాలీవుడ్ నటుడు రవితేజ. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం టచ్ చేసి చూడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్సాన్స్ వస్తుండగా గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఓ కుటుంబాన్ని ప్రేమించే కొడుకుగా కనిపించడంతోపాటు తన జోలికి వచ్చినవారిని రఫ్పాడించే లుక్‌లో రవితేజ అదరగొట్టారు. ముఖ్యంగా 'యూనిఫాంలో ఉంటే గన్‌లో ఆరే బుల్లెట్లు.. యూనిఫాం తీసేస్తే దానమ్మ దానమ్మ రాయితో చంపుతానో రాడ్‌తో చంపుతానో నాకే తెలియదు' అంటూ ఆయన పోలీసుగా రౌడీలకు ఇచ్చే వార్నింగ్, ఎమోషన్ చూస్తుంటే ఇటు కుటుంబ ప్రేక్షకులతోపాటు మాస్ చిత్రాలను అమితంగా ప్రేమించే వారికి కూడా మంచి విందు భోజనంగా ఈ సినిమాను తీసుకొచ్చారనిపిస్తుంది. దాంతోపాటు రవితేజ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో కూడా మనకు తెలిసిందే. విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా వక్కంతం వంశీ కథను అందించారు. రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. -
‘టచ్ చేసి చూడు’ థియేట్రికల్ ట్రైలర్
-
'ఛలో' స్టిల్స్
-
'యుద్ధం గెలిచామా లేదా అన్నదే ముఖ్యం'
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం జవాన్. రచయిత బీవీయస్ రవి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రయిలర్ ను గురువారం రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు యూత్ ఆడియన్స్ దృష్టి లో పెట్టుకొని సినిమాలు చేసిన సాయి.. ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ దేశ ద్రోహిని ఎదుర్కొనేందుకు సిద్ధమయిన యువకుడు తన ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడితే ఎలా రియాక్ట్ అయ్యాడు ఎలా రక్షించుకున్నాడు అనే కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్ పై కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నరు. ప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న జవాన్ డిసెంబర్ 1న రిలీజ్ కు రెడీ అవుతోంది. -
‘రేయ్ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’
హైదరాబాద్ : ‘ఆత్మను అస్త్రములు, శస్త్రములు చేధింపజాలవు, నీరు తడుపజాలదు, అగ్ని దహింపజాలదు, వాయువు ఆర్పివేయు సామర్థనీయముకాదు’ అంటూ ఆత్మలక్షణాలను చెబుతూ రాజుగారి గది 2 ట్రైలర్ వచ్చేసింది. బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో అక్కినేని నాగార్జున చిత్ర యూనిట్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. మరోసారి ఓంకార్ ఈ చిత్రంలో తనదైన మార్క్‌ను చూపించినట్లు తెలుస్తోంది. ’రేయ్.. మన రిసార్టులో దెయ్యం’ ఉందిరా అంటూ వెన్నెల కిషోర్ ఫ్రెండ్స్ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చి చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఉత్కంఠను రేపింది. ఇక యువసామ్రాట్ అక్కినేని నాగార్జున ఎంట్రీ అదిరింది. ఓ యజ్ఞం జరిపిస్తూ ఆత్మ సమస్య నుంచి బయటపడేసే ఓ మెంటలిస్టుగా ఆయన ఈ సినిమాలో కనిపించనున్నారు. రుద్రాక్ష మాలతో జపం చేస్తూ కళ్లు మూసుకొని ఆత్మ శోధన చేస్తూ కనిపించిన తీరు బాగుంది. ‘ఒకమ్మాయి ఆత్మ పగతో ఉంది, అది ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది’ అనే డైలాగ్ చెప్పిన నాగార్జున ఈ సినిమాలో నేరుగా ఆత్మతో మాట్లాడగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని అనిపిస్తుంది. మొత్తానికి హారర్, సస్పెన్స్, విజువలవండర్గా ఈ సినిమా కనిపించబోతున్నట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమైపోయింది. సినిమా ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు అక్టోబర్ 13వరకు ఆగాల్సిందే మరి. -
‘మహానుభావుడు’ థియేట్రికల్ ట్రైలర్..
-
‘మహానుభావుడు’ థియేట్రికల్ ట్రైలర్..
హైదరాబాద్: శతమానం భవతి విజయంతో హ్యాపీగా ఉన్న యంగ్ హీరో శర్వానంద్ మరో హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సోమవారం రిలీజ్ అయిన శర్వానంద్ అప్‌కమింగ్ మూవీ మహానుభావుడు అఫీషియల్ థియేట్రికల్ ట్రైలర్ ఇదే అంచనాలను అభిమానులు వ్యక్తం చేశారు. దసరా బరిలో గట్టి పోటీ ఇస్తుందని, తమన్ సంగీతం కూడా ఈ సినిమాకు మంచి ఎసెట్ కానుందని భావిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బేనర్ పై రూపుదిద్దుకున్న కమర్షియల్ ఎంటర్ టైనర్ మహానుభావుడు. శర్వానంద్, మెహరీన్ జంటగా నటిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, జబర్దస్త్ వేణు, నాజర్ ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. ఓసీడీ అనే డిజార్డర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కించారు దర్శకుడు మారుతి. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. -
ఒక్కడు మిగిలాడు సినిమా స్టిల్స్
-
మనోజ్ 'ఒక్కడు మిగిలాడు'
'స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి!' అంటూ పవర్ఫుల్ డైలాగ్‌తో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అదరగొడుతున్నారు. ఆయన నటించిన చిత్రం 'ఒక్కడు మిగిలాడు' థియెట్రికల్ ట్రైలర్‌ను శనివారం ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్న మనోజ్. 'భారతదేశంలో ఇంకా స్వతంత్ర పోరాటం జరుగుతూ ఉంటే అల్లూరి, భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఏమని పిలిచుకునేవారు?. తీవ్రవాదులనా? లేక దేశ భక్తులనా?' అనే ఉద్విగ్నభరిత వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో మనోజ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అందులో ఒక పాత్రలో ఎల్టీటీఈ ప్రభాకరన్‌గా మనోజ్ నటించినట్లు తెలుస్తోంది. శ్రీలంకలో తమిళులు అనుభవించిన మానసిక క్షోభను ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 'ప్రపంచదేశాలు మనల్ని తీవ్రవాదులు అంటున్నాయి. స్వేచ్చ కోసం సాయుధ పోరాటం తీవ్రవాదమైతే.. మనం తీవ్రవాదులమే' అనే మరో డైలాగ్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రానికి అజయ్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తుండగా, లక్ష్మీకాంత్, ఎస్ఎన్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడికి, తీవ్రవాదికీ మధ్య తేడా చెప్పగలిగేది ఒక్కటే! మనం చూసే దృష్టి! Here comes #OkkaduMigiladuTrailer.A revolt for respect! pic.twitter.com/Y8znpJAwtK — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 19 August 2017 -
మనోజ్ 'ఒక్కడు మిగిలాడు'
-
'ప్రపోజ్ చేస్తే రెజెక్ట్ చేశా'
-
'ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశా'
ఇంటర్నెట్ ప్రత్యేకం: 'ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశా.. ఇలా ఎంతమంది అమ్మాయిలతో..' ఇవి రాజ్‌తరుణ్-హెబ్బా పటేల్‌లు నటిస్తున్న అంధగాడు సినిమాలోని కొన్ని డైలాగ్స్. ఈ సినిమా థియెట్రికల్ ట్రైలర్‌ను శనివారం టీం విడుదల చేసింది. ట్రైలర్‌ను బట్టి రాజ్‌తరుణ్ ఈ సినిమాలో ఎఫ్ఎం రేడియోలో ఆర్జేగా చేస్తున్నట్లు తెలుస్తోంది. కామెడీ పంచ్‌లతో.. యూత్‌ను ఆకట్టుకునే సీన్స్‌తో ట్రైలర్‌ను అందంగా మలిచారు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. -
'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం'
తండ్రి పాత్రలో జగపతిబాబు.. అతడి ప్రత్యర్థి పాత్రలో, పాత పగలతో బుసలు కొట్టే మిర్చి సంపత్. వీళ్లిద్దరి పిల్లలు నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్. తన మనవరాలికి ఆకాశంలోంచి దిగొచ్చే రాజకుమారుడే కావాలనుకునే ఒక నాయనమ్మ.. వీళ్లందరి కాంబినేషన్ కలిపితే ''రారండోయ్ వేడుక చూద్దాం.'' ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ శనివారం విడుదలైంది. చైతూ సరసన రకుల్ తొలిసారిగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ''మంచితనం, మొండితనం, పిచ్చితనం, పెంకితనం.. అన్నీ కలిపి మిక్సీలో వేసి కొడితే నువ్వు..'' అంటుంది నాగచైతన్య క్యారెక్టర్. సరదాగా మాట్లాడుకుందామని పిలిస్తే తనతో మాట్లాడకుండా నాన్న అంటాడేంటి, అతడికి తనకంటే నాన్నే ఎక్కువా అనుకునే రకుల్.. ''నాన్న ఎక్కువా ఏంటి... ఎక్కువే!'' అన్న సమాధానం. వీటన్నింటి మధ్య జరిగే ఒక చిన్నపాటి ఘర్షణ. చివరకు నాగచైతన్య కనుక్కున్న అతిపెద్ద విషయం ఏమిటంటే.. 'అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం'!! మధ్యలో ఆటవిడుపు కోసం చైతూ స్నేహితుడి పాత్ర పోషించే వెన్నెల కిషోర్ చెప్పే సిద్ధాంతం. ''ఎ రిలేషన్షిప్ బిట్వీన్ అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఈజ్ లైక్ పులి అండ్ కుందేలు.. పులి కుందేలుకి ఎదురెళ్లినా దానికే రిస్కు, పులికి కుందేలు ఎదురొచ్చినా దానికే రిస్కు'' అనే ఓ ఫిలాసఫీని కిషోర్ తనదైన స్టైల్లో చెబుతాడు. ఈ మధ్యలో మిర్చి సంపత్‌కు, జగపతిబాబుకు మధ్య ఫ్లాష్‌బ్యాక్‌లో ఉన్న వైరం బయట పడుతుంది. ''నేను మోసం అనే నమ్ముతున్నా.. చంపడమో, చావడమో'' అంటాడు సంపత్. తనకు చైతూయే కావాలని రకుల్ తన తండ్రిని అడుగుతుంటే.. అతడు మాత్రం 'వద్దన్నానా' అని ఓ రేంజిలో చెబుతాడు. భ్రమరాంబ (రకుల్ పాత్ర పేరు)ను పెళ్లి చేసుకోబోయేది తానేనంటూ ముఖం మీద గాయాలతో చైతూ చెప్పడంతో రెండు నిమిషాల ట్రైలర్ ముగుస్తుంది. ఒకవైపు కుటుంబ కథా చిత్రం లాగ కనిపిస్తూనే.. తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటుతో కూడిన బరువైన సన్నివేశాలు, సంపత్-జగపతి బాబు ఫ్లాష్‌బ్యాక్ వైరం, ఫైటింగులు వీటన్నింటితో కలిపి సినిమాలో ఏదో ఉందని అని జనాలతో అనిపించే ప్రయత్నం ట్రైలర్లో కనిపించింది. ఇక వేడుక చూసేందుకు మనం కూడా సిద్ధం కావాల్సిందే మరి. And here it is #RarandoiVedukaChudam theatrical trailer https://t.co/g6BIHjAtro — chaitanya akkineni (@chay_akkineni) 13 May 2017 -
మనోజ్ కెరీర్లో మైల్స్టోన్
మంచు మనోజ్ హీరోగా ఎస్.కె. సత్య దర్శకత్వంలో శ్రీ వరుణ్ అట్లూరి నిర్మించిన ‘గుంటూరోడు’ థియేట్రికల్ ట్రైలర్‌ని మోహన్‌బాబు విడుదల చేశారు. ‘‘ట్రైలర్లో ప్రతి ఫేమ్ అద్భుతంగా ఉంది. దర్శకుడు సత్య చక్కగా తెరకెక్కించారు. మనోజ్ కెరీర్లో ఈ సినిమా ఓ మైల్‌స్టోన్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నా’’ అని మోహన్‌బాబు చెప్పారు. ‘‘ఈ నెలాఖరున ఆడియో, ఫిబ్రవరి 10న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి. ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ప్రభుతేజ, సంగీతం: శ్రీ వసంత్. -
ఖైదీ ట్రైలర్ వచ్చేసింది...
-
ఖైదీ ట్రైలర్ వచ్చేసింది...
ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ చానల్లో పెట్టారు. చిరంజీవి మార్కు డైలాగులు, డాన్సులు, ఫైట్లన్నింటినీ ఈ 1.46 నిమిషాల థియేట్రికల్ ట్రైలర్లో పొందుపరిచారు. 'కష్టం వస్తుందో.. కార్పొరేట్ సిస్టం వస్తుందో రమ్మను', 'పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఒంట్లో ఉంటది.. వెయిటింగ్' లాంటి డైలాగులను తనదైన శైలిలో చిరంజీవి చెప్పడం చూసి అభిమానులు ముచ్చట పడుతున్నారు. చిరు డైలాగులు, డాన్సులతో పాటు రత్నవేల్ ఫొటోగ్రఫీ అత్యున్నత స్థాయిలో కనిపిస్తోంది. ముందుగా చిరంజీవిని వెనకనుంచి, తర్వాత సైడ్ నుంచి చూపించి.. ఆ వెంటనే డాన్సులు, ఫారిన్ లొకేషన్లు చూపించారు. అర నిమిషం దాటిన తర్వాత ఫైటింగులు మొదలవుతాయి. విలన్‌గా నటించిన తరుణ్ అరోరాను కూడా హీరోపాత్రకు దీటుగానే చూపించినట్లు కనిపిస్తోంది. -
శతమానం భవతి ట్రైలర్ విడుదల
-
అమ్మాయి ప్రతీకారం!
‘‘భిన్నమైన కథలు, కథనాలతో రూపొందుతున్న ‘దృశ్యం’లాంటి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ చిత్రదర్శకు రాలు శ్రీప్రియ నుంచి వస్తున్న మరో విభిన్నమైన చిత్రమిది. ఇప్పటివరకూ చేయని పాత్రను ఇందులో చేశాను’’ అన్నారు సీనియర్ నరేశ్. నిత్యామీనన్, క్రిష్ జె.సత్తార్, నరేశ్ ముఖ్య తారలుగా శ్రీప్రియ దర్శకత్వంలో వీఆర్ క్రిష్ణ యం. నిర్మిం చిన చిత్రం ‘ఘటన’. శుక్రవారం థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. వీఆర్ క్రిష్ణ మాట్లాడుతూ - ‘‘ఓ అమ్మాయి తనకు జరిగిన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చు కుందనేది కథ. ఆగస్టు 31న ప్లాటినమ్ డిస్క్ వేడుక, సెప్టెంబర్‌లో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
'బాహుబలి-2' ట్రైలర్ ఎప్పుడంటే...!
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పకుండా ట్విస్టు ఇచ్చాడు రాజమౌళి. ఆ ట్విస్టు ఏమిటో తెలుసుకోవాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ 28 వరకు వేచిచూడాల్సిందే. 'బాహుబలి-2' హిందీ వర్షెన్ 2017, ఏప్రిల్ 28న విడుదలవుతున్నట్టు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'బాహుబలి-2' థియెట్రికల్ ట్రైలర్ జనవరిలో విడుదలయ్యే అవకాశముందని దగ్గుబాటి రాణా తెలిపాడు. ప్రస్తుతం 'బాహుబలి-2' షూటింగ్లో బిజీగా ఉన్న రాణా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ 'మేం వేగంగా సినిమా పనులను పూర్తిచేస్తున్నాం. కొద్ది రోజుల్లో ఇవి పూర్తికానున్నాయి. ఈ ఏడాది చివర్లో లేదా జనవరిలో ఫస్ట్ ప్రోమో విడుదలయ్యే అవకాశముంది. ఇది టీజర్ లేక థియెట్రికల్ ట్రైలరా అన్నది నాకు తెలియదు. కానీ కచ్చితంగా జనవరిలో ఇది విడుదల కానుంది' అని 'భల్లాలదేవ' రాణా తెలిపాడు. ప్రపంచవ్యాప్తంగా ప్రశంలందుకున్న 'బాహుబలి' పార్ట్-1ను మించేస్థాయిలో పార్-2ను తీర్చిదిద్దేందుకు దర్శకుడు రాజమౌళి బృందం శ్రమిస్తోంది. కేవలం క్లైమాక్స్ కోసమే రూ. 30 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. 'ఎక్స్ మెన్', '300' వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ఆర్టిస్టులు క్లైమాక్స్ కోసం రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది.