'సినిమాలు చెడగొట్టేసినియ్' | Gentleman Theatrical trailer Out | Sakshi
Sakshi News home page

'సినిమాలు చెడగొట్టేసినియ్'

Published Mon, May 23 2016 12:05 PM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

'సినిమాలు చెడగొట్టేసినియ్'

'సినిమాలు చెడగొట్టేసినియ్'

నేచురల్ స్టార్ నాని తాజా సినిమా 'జెంటిల్‌మన్' థియేటర్ ట్రైలర్‌ విడుదలైంది. దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ శైలికి భిన్నంగా ఉత్కంఠ రేకెత్తించేలా ట్రైలర్ ఉంది. హీరో నాని తనదైన శైలిలో వినోదం పంచడంతో పాటు ఫైట్స్ కూడా చేశాడు. ప్రచార చిత్రంలోని డైలాగులు సినిమాపై మరింత ఆసక్తి పెంచుతున్నాయి.

సినిమాలు చెడగొట్టేసినియ్, వయొలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడొస్తాయో కదా అని నాని చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. 'నీలో ఈ కోణం కూడా ఉందా, నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు' అని హీరోయిన్ తో చెప్పించి మరింత ఆసక్తి పెంచారు. 'ఫాసింగ్ యువర్ సీట్ బెల్ట్' అని నానితో చెప్పించి ట్రైలర్ ముగించారు. మణిశర్మ మ్యూజిక్ ఆకట్టుకుంది.

ప్రచార చిత్రం ఆదిరిపోయిందని పలువురు కామెంట్ చేశారు. 'జెంటిల్‌మన్' థియేటర్ ట్రైలర్‌ ఫుల్ మస్తుగా ఉందని వెన్నెల కిశోర్ ట్వీట్ చేశాడు. రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో నాని సరసన సురభి, నివేదా థామస్ హీరోయిన్లుగా నటించారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement