'కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు' | nani gentleman movie Teaser released | Sakshi
Sakshi News home page

'కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు'

Published Thu, May 12 2016 7:42 PM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

'కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు'

'కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు'

హైదరాబాద్: నాని హీరోగా నటించిన 'జెంటిల్‌మన్' అఫీషియల్ టీజర్ విడుదలైంది. నాని డిఫరెంట్ లుక్ తో కన్పిస్తున్నాడు. యాక్షన్, డాన్స్ సీన్లతో ఇరగదీసినట్టు టీజర్ లో చూపించారు. హీరోయిన్ తో 'కనిపించేంత మంచి వాడు మాత్రం కాదు' అంటూ డైలాగ్ చెప్పించారు. ఈ సినిమాలో నాని హీరోనా, విలనా అంటూ మరింత ఆసక్తి రేకిత్తించారు. అయితే, టాలీవుడ్ భల్లాల దేవుడు రానా మాత్రం.. ''నువ్వు కనిపించే కన్నా చాలా మంచివాడివి. సూపర్బ్ వన్. ఆల్ ద బెస్ట్'' అంటూ ట్వీట్ చేశాడు.

రొమాంటిక్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాలో నాని సరసన సురభి, నివేదా థామస్ నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కథ: డేవిడ్ నాథన్, కెమేరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, కో-డెరైక్టర్: కోట సురేశ్‌కుమార్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement