నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. పేరుకి తగ్గట్లే అప్డేట్స్ అన్నీ ఒక్కో శనివారం రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇందులో విలన్‌గా నటిస్తున్న ఎస్‌జే సూర్య పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. టీజర్ కానీ టీజర్ అని చెప్పుకొచ్చారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది?
(ఇదీ చదవండి: 'యానిమల్' బ్యూటీ కొత్త సినిమా ఎలా ఉందంటే?)
ప్రతి శనివారం.. హీరో రకరకాలుగా ప్రవర్తించడం అనే స్టోరీతో తీసిన సినిమా 'సరిపోదా శనివారం'. నాని, ప్రియాంక మోహన్ హీరోహీరోయిన్ కాగా.. తమిళ నటుడు ఎస్‌జే సూర్య ప్రతినాయకుడు. కృూరమైన పోలీస్ అధికారిగా చేస్తున్నట్లు తాజాగా రిలీజ్ చేసిన వీడియోతో క్లారిటీ వచ్చేసింది.
నాని-ప్రియాంక శ్రీకృష్ణుడు-సత్యభామగా.. ఎస్‌జే సూర్య నరకాసురుడు అని చెప్పడం లాంటి రిఫరెన్సులు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. టీజర్ కాని టీజర్ అంటూనే ఆసక్తి రేకెత్తించారు. ఆగస్టు 29న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కానుంది.
(ఇదీ చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు సినిమా.. ఎందులో ఉందంటే?)
Comments
Please login to add a commentAdd a comment