
హీరో నాని అంటే పక్కంటి కుర్రాడి తరహా పాత్రలతో బాగా ఫేమ్ తెచ్చుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాస్ సినిమాలు చేస్తూ తనలో డిఫరెంట్ యాంగిల్ పరిచయం చేస్తూ వస్తున్నాడు. దసరా, సరిపోదా శనివారం చిత్రాలు.. ఆ తరహా ప్రయత్నాలే. ఇప్పుడు వాటిని మించిపోయేలా బ్రూటల్ మాస్ చూపించబోతున్నాడు.
నాని ప్రస్తుతం 'హిట్ 3' చేస్తున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ఇదివరకే రెండు మూవీస్ వచ్చాయి. విశ్వక్ సేన్, అడివి శేష్ హీరోలుగా నటించిన ఈ చిత్రాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథలతో వీటిని తెరకెక్కించారు. వీటిని నిర్మించిన నాని.. మూడో భాగాన్ని నిర్మిస్తూ హీరోగా నటించాడు. ఇతడి పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సంక్రాంతి' హిట్ సినిమా.. డేట్ ఫిక్సయిందా?)
'హిట్ 3' సినిమా చాలా వయలెంట్ గా ఉంటుదని నాని కొన్నాళ్ల క్రితమే చెప్పాడు. అందుకు తగ్గట్లే టీజర్ ఉంది. లాఠి పట్టుకుంటే రెచ్చిపోయే అర్జున్ సర్కార్ అనే పోలీస్ గా కనిపించాడు. వైట్ కోట్ తో ఓ వ్యక్తిని చంపే సీన్ అయితే భయం కలిగించింది.
టీజరే ఇలా ఉందంటే సినిమా ఇంకెలా ఉండబోతుందో అర్థమైపోతుంది. మే 1న థియేటర్లలోకి రాబోతుంది. శైలేష్ కొలను దర్శకుడు కాగా.. మిక్కీ జే మేయర్ సంగీతమందించాడు. 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
Comments
Please login to add a commentAdd a comment