కోలీవుడ్ సూపర్ స్టార్ ఎస్‌జే సూర్య తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం చిత్రంలో కీలక పాత్రలో మెప్పించారు. ఈ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌లోనూ కీ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సరిపోదా శనివారం మూవీ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా నటుడు ఎస్‌జే సూర్య చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాకు సూపర్ హిట్ అందించిన చిత్రబృందానికి ధన్యవాదాలు తెలిపారు. నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగు ప్రేక్షకులకు నా గుండెల నుంచి ధన్యవాదాలు అంటూ తెలుగులో రాసుకొచ్చారు. అదేవిధంగా సక్సెస్ ప్రెస్ మీట్‌కు హాజరు కాకపోవడంపై సారీ చెప్పారు. బిజీ షూటింగ్ షెడ్యూల్ వల్లే హాజరు కాలేకపోయానని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
Telugu prayakshalaku , dir #VivekAthreya gari ki , Natural star @NameisNani gariki , @DVVMovies dhanaya gariki gundal nunchi Dhanyawadalu 🙏🙏🙏 for this great opportunity & accepting this actor with immense love sjsuryah 🥰🙏 sorry couldn’t attend press meet due to unavoidable…
— S J Suryah (@iam_SJSuryah) August 31, 2024
Comments
Please login to add a commentAdd a comment