'సరిపోదా' అయిపోయింది.. కొత్తది మొదలుపెట్టిన నాని | Nani Hit 3 Movie Shooting Update Latest | Sakshi
Sakshi News home page

Hit 3 Movie: కొత్త మూవీ షురూ చేసిన హీరో నాని

Published Fri, Sep 13 2024 7:56 PM | Last Updated on Fri, Sep 13 2024 7:56 PM

Nani Hit 3 Movie Shooting Update Latest

'సరిపోదా శనివారం' సినిమాతో మొన్నీ మధ్యే హీరో నాని.. ప్రేక్షకుల్ని పలకరించాడు. ఇది ఇంకా థియేటర్లలో ఉండగానే కొత్త మూవీ మొదలుపెట్టేశాడు. శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న 'హిట్ 3' రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్‌లో శుక్రవారం మొదలైపోయింది. నానిపై సన్నివేశాల్ని చిత్రీకరించారు.

(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)

విశ్వక్ సేన్, అడివి శేష్.. తొలి రెండు భాగాల్లో హీరోలుగా నటించారు. ఇక మూడో పార్ట్‌లో అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ పోలీస్‌గా నాని కనిపించబోతున్నాడు. రీసెంట్‌గా నాని పాత్ర ఎలా ఉంటుందో తెలియజెప్పేలా చిన్న వీడియో రిలీజ్ చేశారు. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా తర్వాత నాని.. తనతో 'దసరా' సినిమా తీసిన శ్రీకాంత్ ఓదెలతో మరోసారి కలిసి పనిచేయబోతున్నాడు. ఇది ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఉండబోతుంది. వచ్చే ఏడాది ప్రధమార్థంలో ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలవుతుంది.

(ఇదీ చదవండి: నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో అజిత్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement