నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో | Tamil Actor Ajith Kumar Buys Porsche Car Worth 4 Crores | Sakshi
Sakshi News home page

Ajith Kumar: ఆగస్టులో రూ.9 కోట్ల కారు.. ఇప్పుడేమో ఏకంగా

Sep 13 2024 7:27 PM | Updated on Sep 13 2024 8:22 PM

Tamil Actor Ajith Kumar Buys Porsche Car Worth 4 Crores

ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటుంది. అలా తమిళ స్టార్ హీరో అజిత్‌కి కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఓవైపు సినిమాలు చేస్తుంటాడు. ఖాళీ దొరికితే చాలు బైక్ రైడింగ్, రేసింగ్ లాంటివి చేసేస్తుంటాడు. మొన్నీ మధ్య ఆగస్టులో రూ.9 కోట్ల విలువ చేసే ఫెర్రారీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పుడు కూడా మరో కాస్ట్ లీ కారు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అజిత్ భార్య, మాజీ నటి షాలినీ బయటపెట్టింది.

అజిత్ లేటెస్ట్‌గా ఫోర్స్ కంపెనీకి చెందిన జీటీ3 ఆర్ఎస్ (GT3 RS) కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్‌లో దీని ధర మూడన్నర కోట్ల రూపాయలకు పైనే ఉంది. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దీని ధర రూ.4 కోట్లు దాటేస్తుంది. అయితే ఇలా నెలల వ్యవధిలో కోట్లు విలువ చేసే కార్లు సొంతం చేసుకున్న హీరో.. అవంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశాడు.

(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!)

ఈ కార్లు కాకుండా అజిత్ దగ్గర బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ కే 1300 ఎస్, ఏప్రిలా కాపోనార్డ్ 1200, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 145 లాంటి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. అలానే ఫెర్రారీ 458 ఇటాలియా, బీఎమ్ వన్ 740 లీ, హోండా ఎకార్డ్ వీ6 కార్లు కూడా ఉన్నాయి.

ప్రస్తుతం 'విడా మయూర్చి' అనే సినిమా చేస్తున్న అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement