Porsche
-
ఖరీదైన కారు చెత్త కుప్పలో... అసలు సంగతి తెలిసి విస్తుపోతున్న జనం
ప్రియురాలు అలిగితే ప్రియుడు గ్రహించి అలక తీర్చాలి. అది రూల్.అయితే పెళ్ళికి ముందు ఈ అలకలు ముద్దు..ముద్దుగా బాగానే ఉంటాయి. భార్యాభర్తలుగా మారిన తరువాతే అలకలు కాస్త చిరాకులు, పరాకులుగా, వివాదంగా మారిపోతాయి. అందుకే ‘‘అలుక సరదా మీకూ అదే వేడుక మాకూ..కడకు మురిపించి గెలిచేది మీరేలే’’ అంటూ కోప్పకుండానే తనమనసులోని మాట చెప్పేశాడు సినీకవి ఆరుద్ర. అలాగే అలిగిన భార్యను ఎలాగైనా బుజ్జగించాలనుకున్నాడో భర్త. తన ప్రేమసముద్రంలో లేచిన ప్రణయకలహానికి చెక్ పెట్టాలనుకున్నాడు. కానీ సీన్ సితార్ అయింది!అలిగిన తన భార్యకు వాలెంటైన్స్ రోజున ఖరీదైన బహుమతి ఇవ్వాలనుకున్నాడు. ఎలాగైన ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు. బాగా ఆలోచిస్తే ఆమెకు కార్లంటే పిచ్చ ప్రేమ అని గుర్తొచ్చింది. అంతే క్షణం ఆలోచించకుండా లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ప్రేమికుల రోజున 27 లక్షల రూపాయల విలువ చేసే ఎస్‌యూవీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. అయితే అది ఆమెకు నచ్చలేదు. తిరస్కరించింది. దీంతో భర్తగారు బాగా హర్ట్ అయ్యాడు. వెంటనే లక్షల విలువైన కారును చెత్తకుప్పలో పడేశాడు. ఇంతకీ అంత ఖరీదైన కారు ఆమెకు ఎందుకు నచ్చలేదో తెలిస్తే.. ‘‘మొదట మగవారు వేస్తారు వేషాలు పెళ్ళి కాగానే చేస్తారు మోసాలు’’ అనిపించక మానదు.రష్యా స్థానిక మీడియా కథనాల ప్రకారం..రష్యా రాజధాని మాస్కో సమీపంలో మైటిష్చి పట్టణంలో ఓ జంటకు ఈ మధ్య విభేదాలొచ్చాయి. తగాదాలతో దూరంగా ఉంటున్నారు. దీంతో భార్యను ప్రసన్నం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మరో పయత్నం చేశాడు. ఖరీదైన పోర్షేకారును కొనుగోలు చేశాడు. అయితే యాక్సిడెంట్లో స్వల్పంగా డ్యామేజీ అయినా కారది. అలాంటి దానికి రెడ్ రిబ్బన్ కట్టేసి మేనేజ్ చేద్దామనుకున్నాడు. ‘సీతతో అదంత వీజీ కాదన్నట్టు’ ఆమె ఈ విషయాన్ని ఇట్టే పసిగట్టేసింది. పైగా కార్ల లవర్ కదా అందుకే దాంట్లోని లోపాన్ని చటుక్కున గుర్తించింది. హన్నన్నా.. ఇంతటి అవమానమా? అంటూ మండిపడింది. అందుకే మరి ఛీ... పొమ్మంది. ఇక ఏం చేయాలో తెలియక ఖరీదైన ఆ పోర్షేకారును తీసుకుపోయి పెద్ద చెత్తకుప్పలో పడేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇది వైరల్‌గా మారింది. అసలా కారును చెత్తలో ఎలా పడేశాడు? కంటైనర్‌లో ఈ కారు ఎలా పట్టింది అనేది నెటిజన్లు మధ్య చర్చకు దారి తీసింది. దాదాపు రెండు వారాలుగా, పోర్స్చే కారు ఆ ప్రదేశంలోనే ఉండిపోవడంతో ఇది స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది. ఫోటోలకు ఎగబడ్డారు. దీంతో ఆ ప్రదేశం టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయిందట. -
HYD: బంజారాహిల్స్‌లో పోర్షే కారు బీభత్సం
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో గురువారం అర్ధరాత్రి పోర్షే కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి కేబీఆర్ పార్కు ప్రహరీ గోడను ఢీకొట్టింది. కేబీఆర్ పార్క్ ఫుట్ పాత్ దాటి ప్రహరీ గోడ గ్రిల్‌ను ధ్వంసం చేసి చెట్టును ఢీకొట్టి కారు ఆగిపోయింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తొలగించారు. ర్యాష్ డ్రైవింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం -
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
1974 మందికి మాత్రమే ఈ కారు: దీని రేటెంతో తెలుసా?
పోర్స్చే 911 టర్బో 50 ఇయర్స్ ఇప్పుడు భారతదేశంలో అమ్మకానికి వచ్చేసింది. దీని ధర రూ. 4.05 కోట్లు (ఎక్స్ షోరూమ్). పేరుకు తగినట్లుగా ఈ కారు 50వ యానివెర్సరీ సందర్భంగా అందుబాటులోకి వచ్చింది. దీనిని కేవలం 1974 మందికి మాత్రమే విక్రయించనున్నట్లు సమాచారం. ఇది లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి, కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో విక్రయించడానికి సిద్ధమైంది.కొత్త పోర్స్చే టర్బో 50 ఇయర్స్ అనేది టర్బో ఎస్ కంటే రూ.7 లక్షలు ఎక్కువ. ఇది కేవలం టూ డోర్స్ మోడల్. చూడగానే ఆకట్టుకునే డిజైన్ కలిగిన ఈ కారు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డయల్‌లు పొందుతుంది. బయట, లోపల భాగాలూ చాలా వరకు ఒకేరంగులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: రోజుకు రూ.45 లక్షల జీతం.. అగ్రరాజ్యంలో తెలుగు తేజంపోర్స్చే టర్బో 50 ఇయర్స్ 3.7 లీటర్ ట్విన్ టర్బో ప్లాట్ సిక్స్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 650 హార్స్ పవర్, 800 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.7 సెకన్లలో ఇది 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 330 కిమీ వరకు ఉంది. ఈ కారు 1974లో ప్రారంభించిన ఒరిజినల్ 930 టర్బో కంటే రెండు రేట్లు ఎక్కువ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. -
నెల వ్యవధిలో మరో లగ్జరీ కారు కొన్న స్టార్ హీరో
ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో విపరీతమైన ఇష్టం ఉంటుంది. అలా తమిళ స్టార్ హీరో అజిత్‌కి కార్లు, బైక్స్ అంటే పిచ్చి. ఓవైపు సినిమాలు చేస్తుంటాడు. ఖాళీ దొరికితే చాలు బైక్ రైడింగ్, రేసింగ్ లాంటివి చేసేస్తుంటాడు. మొన్నీ మధ్య ఆగస్టులో రూ.9 కోట్ల విలువ చేసే ఫెర్రారీ కారు కొనుగోలు చేశాడు. ఇప్పుడు కూడా మరో కాస్ట్ లీ కారు సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని అజిత్ భార్య, మాజీ నటి షాలినీ బయటపెట్టింది.అజిత్ లేటెస్ట్గా ఫోర్స్ కంపెనీకి చెందిన జీటీ3 ఆర్ఎస్ (GT3 RS) కారుని కొనుగోలు చేశాడు. మార్కెట్లో దీని ధర మూడన్నర కోట్ల రూపాయలకు పైనే ఉంది. మిగతా ఖర్చులన్నీ కలిపి చూసుకుంటే దీని ధర రూ.4 కోట్లు దాటేస్తుంది. అయితే ఇలా నెలల వ్యవధిలో కోట్లు విలువ చేసే కార్లు సొంతం చేసుకున్న హీరో.. అవంటే తనకు ఎంత ఇష్టమో చెప్పకనే చెప్పేశాడు.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరోలు.. కార్తీని చూసి కాస్త నేర్చుకోండి!)ఈ కార్లు కాకుండా అజిత్ దగ్గర బీఎండబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బీఎండబ్ల్యూ కే 1300 ఎస్, ఏప్రిలా కాపోనార్డ్ 1200, కవసాకీ నింజా జెడ్ ఎక్స్ 145 లాంటి స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి. అలానే ఫెర్రారీ 458 ఇటాలియా, బీఎమ్ వన్ 740 లీ, హోండా ఎకార్డ్ వీ6 కార్లు కూడా ఉన్నాయి.ప్రస్తుతం 'విడా మయూర్చి' అనే సినిమా చేస్తున్న అజిత్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే మరో మూవీ చేస్తున్నాడు. ఈ రెండు కూడా సంక్రాంతి టైంలో రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఒకేరోజు ఓటీటీల్లోకి వచ్చేసిన 20 మూవీస్.. ఇవి డోంట్ మిస్) View this post on Instagram A post shared by Shalini Ajith Kumar (@shaliniajithkumar2022)Exclusive Pics of THALA AJITH With Porsche GT3RS 🏎️💨Man And the Machine.,🚨🚧 #VidaaMuyarchi | #Ajithkumar pic.twitter.com/sydMXebHaD— AJITHKUMAR FANS CLUB (@ThalaAjith_FC) September 13, 2024 -
కోట్ల విలువైన కారు కొనుగోలు చేసిన సలార్ నటుడు!
సలార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఇటీవల బడే మియాన్ చోటే మియాన్లో చిత్రంలో కనిపించారు. అంతకుముందు మలయాళంలో తెరకెక్కించిన ఆడు జీవితం(ది గోట్ లైఫ్) చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్గా నటించింది. దుబాయ్‌లో ఓ వ్యక్తి నిజజీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది.తాజాగా హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఖరీదైన కారు కొనుగోలు చేశారు. సరికొత్త పోర్షే మోడల్ కారును కొన్నారు. ఈ లగ్జరీ కారు విలువ దాదాపు రూ.3 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోర్షే ఇండియా బ్రాండ్ ప్రతినిధులతో పృథ్వీరాజ్ మాట్లాడుతున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అతనితో పాటు భార్య సుప్రియా మీనన్ కూడా ఉన్నారు. కాగా.. పృథ్వీరాజ్ ఇప్పటికే లంబోర్గిని, పోర్స్చే, టాటా సఫారి, మినీ కూపర్ లాంటి మోడల్ కార్లు కలిగి ఉన్నారు. ప్రస్తుతం పృథ్వీరాజ్ ఎల్2: ఎంపురాన్ షూట్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో నటించడమే కాకుండా లూసిఫర్‌కి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్లో జరుగుతుండగా.. కేరళ, న్యూఢిల్లీ, లడఖ్, యూఎస్ఏ, యూకే లొకేషన్లలో కూడా చిత్రీకరించారు. View this post on Instagram A post shared by Porsche India (@porsche_in) -
పుణె పోర్షే కారు ఘటన.. మైనర్‌ను వెంటనే విడుదల చేయండి: హైకోర్టు
ముంబై: పుణె పోర్షే ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు యువ ఇంజనీర్ల మరణానికి కారణమైన నిందితుడు మైనర్ బాలుడిని నిర్బంధం నుంచి వెంటనే విడుదల చేయాలని బాంబే హైకోర్టు మంగళవారం ఆదేశించింది.ప్రభుత్వ అబ్జర్వేషన్ హోమ్ నుంచి విడుదల చేయాలంటూ బాలుడి అత్త వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై జస్టిస్ భారతి, జస్టిస్ మజుషా దేశ్‌పాండే ధర్మాసనం నేడు తీర్పు వెలువరించింది. బాలుడి రిమాండ్ ఆర్డర్ చట్టవిరుద్ధమని పేర్కొంటూ దానిని కోర్టు పక్కన పెట్టింది.కేసును కప్పిపుచ్చుకునేందుకు బాలుడి తల్లిదండ్రులు, తాత ప్రయత్నించి అరెస్టు అయిన నేపథ్యంలో మైనర్ ప్రస్తుతం అతని అత్త సంరక్షణలో ఉంటాడని ధర్మాసనం పేర్కొంది. కాగా ఈ కేసులో నిందితుడికి త్వరితగతిన బెయిల్ మంజూరు చేయడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో జువైనల్ జస్టిస్ బోర్డు బాలుడికి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.అసలేం జరిగిందంటే..కాగా మహారాష్ట్రలోని పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు.అదే సమయంలోసాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు.అయితే ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్‌స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. 15 గంటల్లోనే బెయిల్ మంజూరుచేయడం తీవ్ర విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు.పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్‌ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. -
‘పుణె పోర్షే కారు’ ప్రమాదం: పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం
ముంబై: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసులపై బాంబే హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రమాద సమయంలో కారు నడిపిన మైనర్‌కు ఒకసారి బెయిల్ ఇచ్చి మళ్లీ కస్టడీలోకి తీసుకోవడం ఏంటని బాంబే హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. బెయిల్ మంజూరు తర్వాత కూడా మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌లో ఉంచడంపై అతడి సమీప బంధువు ఫైల్ చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం(జూన్21) విచారించింది. పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ భారతి డాంగ్రే, జస్టిస్ మంజూష దేశ్‌పాండేలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.‘కారు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు. ఇది దురదృష్టకరమే. అయితే కారు నడిపిన మైనర్ కూడా ఒక రకంగా బాధితుడే. ఏ నిబంధన కింద బెయిల్తర్వాత అతడిని పోలీసులు తిరిగి కస్టడీలోకి తీసుకుంటారు. ఇది నిర్బంధం కిందకు రాదా. కనీసం పోలీసులు బెయిల్ రద్దు పిటిషన్ కూడా వేయలేదు. కేవలం బెయిల్ ఆర్డర్ సవరించాలని పిటిషన్ వేశారు.దానిపైనే తీర్పు ఇస్తూ మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. ఏ రకమైన రిమాండ్ ఇది. ఒక వ్యక్తికి బెయిల్ ఇచ్చి మళ్లీ ఏ నిబంధనల ప్రకారం కస్టడీలోకి తీసుకున్నారు’అని బెంచ్ ప్రశ్నించింది.అయితే మైనర్ బెయిల్ ఆర్డర్ మార్చి అతడిని అబ్జర్వేషన్ హోమ్‌కు పంపడం సరైనదే అని ప్రాసిక్యూషన్ వాదించింది. దీంతో ఈ పిటిషన్‌పై తీర్పును కోర్టు మంగళవారానికి రిజర్వు చేసింది. కాగా, మే 19వ తేదీ తెల్లవారుజామున పుణెలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లను వేగంగా వచ్చిన పోర్షే కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ ఇంజినీర్లు మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన మైనర్‌కు జువైనైల్ బోర్డు తొలుత బెయిల్ ఇచ్చింది. అయితే దేశవ్యాప్తంగా బెయిల్‌పై తీవ్ర నిరసన రావడంతో తర్వాత మైనర్‌ను అబ్జర్వేషన్ హోమ్‌కు పంపిస్తూ ఆదేశాల్లో మార్పు చేశారు. -
పుణే ఘటనలో అదిరిపోయే ట్విస్ట్
ముంబై: మహారాష్ట్ర పుణెలో ఓ టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరి మృతికి కారణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలన చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో ఈ కేసు రోజుకొక మలుపు తిరుగుతూ.. రోజుకొక అరెస్ట్‌తో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టీనేజర్‌ను తప్పించేందుకు అతని కుటుంబం చేసిన ప్రయత్నాలు విస్తుగొల్పుతున్నాయి. తాజాగా ఈ కేసులో టీనేజర్ తల్లిని కూడా అరెస్ట్ చేశారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. విచారణ కోసం పిలిచిన ఆమెను.. శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించారు పోలీసులు. బ్లడ్ టెస్ట్ సమయంలో నిందితుడి రక్త నమూనాలు బదులుగా తనవి ఇచ్చినందుకే ఆమెను అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. ప్రమాదం సమయంలో తన కుమారుడు తాగలేదని నిరూపించేందుకు ఆమె తన రక్తనమూనాలు ఇచ్చినట్లు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన రోజు ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ తావ్డే, నిందితుడి తండ్రి ఫోన్లో మాట్లాడుకున్నారని.. నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు భారీ నగదుతో డీల్ కుదిరిందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ క్రమంలోనే టీనేజర్ తల్లి శాంపిళ్లను బ్లడ్ టెస్ట్‌కు ఇచ్చినట్లు తేలింది. రక్త నమూనాలు ఇచ్చిన తర్వాత ఆమె ఆచూకీ లేకుండా పోయారు. అలాగే కొద్దిరోజుల క్రితం ఒక వీడియో సందేశం విడుదల చేసిన ఆమె.. తన కుమారుడిని రక్షించాలంటూ కన్నీరుపెట్టుకోవడం గమనార్హం. సాక్ష్యాలను తారుమారు చేసినందుకు, శాంపిల్స్‌ను మార్చిన ఆరోపణలపై ఈ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈరోజు కోర్టుముందు ప్రవేశపెట్టనున్నారు. పుణే పోర్షే కారు కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి, తాత కూడా అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసును తనమీద వేసుకోమని తమ డ్రైవర్‌ను ఒప్పించేందుకు యత్నించారని, అతడు అంగీకరించకపోవడంతో కిడ్నాప్ చేసి ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వారిద్దరి అరెస్టుకు కారణమయ్యాయి. నేరాన్ని కప్పిపుచ్చేందుకు ఆ కుటుంబం పలువురు అధికారుల్ని ప్రలోభపెట్టేందుకు యత్నించడమూ దర్యాప్తులో వెలుగు చూసింది. -
పుణె పోర్షే ఘటన.. ఇన్నేసి ట్విస్ట్‌లా?
పుణె పోర్షే కారు ప్రమాదం.. ట్విస్ట్‌ల మీద ట్వి స్ట్‌లతో థ్రిల్లర్ కథను తలపిస్తోంది. రోజురోజుకీ కొత్త కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తప్ప తాగి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు మరణించడానికి కారణమైంది 17 ఏళ్ల మైనర్ అయితే.. అతన్ని కాపాడటానికి మైనర్ తండ్రి, తల్లి, తాత, పోలీసులు, డాక్టర్లు.. ఇలా ప్రతి ఒక్కరు పైసాకు కొమ్ముకాసి సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించడం చూస్తుంటే విస్మయానికి గురికాక తప్పదు.పుణెలో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు(17 ఏళ్లు).. 12వ తరగతి ఫలితాలు రావడంతో మే 18న రాత్రి మిత్రులతో కలిసి మద్యం తాగి పార్టీ చేసుకున్నాడు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో మత్తులో తూలుతూనే ఇద్దరు మిత్రులను తీసుకొని తన తండ్రికి చెందిన రూ. 2.5 కోట్ల ఖరీదైన పోర్షె కారులో ఇంటికి బయల్దేరాడు.అదే సమయంలోసాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన అనీష్, అశ్విని అనే ఇద్దరు యువతీ, యువకుడు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో టెక్కీలు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని పోర్షె కారు నడుపుతున్న మైనర్.. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఢీకొంది. ప్రమాద తీవ్రతకు అనీష్, అశ్విని కొన్ని అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు. ఆ మార్గంలో వెళ్తున్న పలువురు వ్యక్తులు కారులోని యువకులను పట్టుకున్నారు. నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని యర్వాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బాలుడిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రోటోకాల్ పాటించలేదు. ప్రమాదానికి కారణమైన మైనర్‌ను పోలీస్ స్టేషన్లో ఏసీపీ కుర్చీలో కూర్చొబెట్టి రాచమర్యాదలు చేయడం చూసి అక్కడే ఉన్న కొందరు ఆశ్చర్యపోయారు. పిజ్జాలను తెప్పించి నిందితులకు ఇచ్చారు. నిందితుడి ఆల్కాహాల్ శాతాన్ని పరీక్షించేందుకు సమయానికి రక్త పరీక్ష చేయడంలో పోలీసులు జాప్యం వహించారు. అనంతరం ప్రభుత్వ ఆధ్యర్యంలో నడిచే సాసూన్ ఆసుపత్రిలోనూ మైనర్ బ్లడ్ శాంపిల్సను తారుమారు చేశారు. మైనర్ తండ్రి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి రూ.3 లక్షలకు బేరం కుదుర్చుకొని రక్త నమూనాలను మార్చేశాురు. ప్రమాదం జరిగిన తర్వాత కూడా బాలుడికి తాగడానికి నీరు ఇచ్చారు. ఇది ఆల్కహాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ కేసు విషయంలో ఏదో జరుగుతోందని అనుమానించిన ఉన్నతాధికారులు బాలుడి రక్తనమూనాలు మరోసారి సేకరించి జిల్లా ఆస్పత్రికి పంపారు. ఈ ఫలితాల ఆధారంగానే సాసూన్ ఆస్పత్రిలో జరిగిన మోసం బయటపడింది. దీంతో ఇద్దరు వైద్యులు, వార్డ్‌బాయ్‌ను కూడా సస్పెండ్ చేశారు. అలాగే రక్తనామూనాలను తర్వగా సేకరించడంలో జాప్యం వహించిన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాలుడికి తక్షణమే బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి దన్వాడేపై విచారణ మొదలైంది.ప్రమాదానికి కారణమైన బాలుడిని రక్షించేందుకు పోలీస్‌స్టేషన్ నుంచి జువైనల్ జస్టిస్ బోర్డు వరకూ అడుగడుగునా ప్రయత్నాలు జరిగాయి. ప్రమాదం జరిగిన మర్నాడు నిందితుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపర్చగా.. అక్కడ న్యాయమూర్తి ఎల్ఎన్ దన్వాడే నిందితుడికి తక్షణమే బెయిల్ మంజూరు చేశారు. రోడ్డు ప్రమాదాలు-పరిష్కారాలపై 300 పదాలతో వ్యాసం రాయమన్నారు. 15 రోజులు ట్రాఫిక్ పోలీసుల వద్ద పనిచేయడం వంటి నిబంధనలు విధించారు ఈ బెయిల్ నిబంధనలు చూసి జనాలు నివ్వెరపోయారు. నిందితుడికి వ్యతిరేకంగా ఆందోళనలు జరగడం, ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడికి పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. తక్షణమే నిందితుడి తండ్రి, మద్యం విక్రయించిన రెస్టారంట్ల యజమానులపై రెండో ఎఫ్ఐఆర్ నమోదైంది. 22వ తేదీన బాలుడి బెయిల్‌ను రద్దు చేసి అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. పరారైన నిందితుడి తండ్రిని ఔరంగాబాద్‌లో అరెస్టు చేశారు. మరోవైపు డ్రైవర్‌ను ఈ కేసులో బలవంతంగా ఇరికించేందుకు యత్నించాడన్న ఆరోపణలపై నిందితుడి తాతను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని ఏకంగా డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రకటించారు. -
పూణే ప్రమాదంలో కీలక పరిణామం!.. తెరపైకి ఎమ్మెల్యే కుమారుడు
పూణే: పూణే పోర్షే కారు ప్రమాదం కేసులో ఇప్పటికే పలు సంచనాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తాజాగా మరో ఆరోపణ తెరపైకి వచ్చింది. ఈ కారు ప్రమాదంలో నిందితులను తప్పించే అంశంలో ఓ ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉందని మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ నేత ఆరోపించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.కాగా, మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పూణే పోర్షే కారు ప్రమాదంలో ఎమ్మెల్యే కొడుకు ప్రమేయం కూడా ఉంది. ఆయనే తెర వెనుక చక్రం తిప్పారు. నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. ఇదంతా సదరు ఎమ్మెల్యే ద్వారానే జరిగిందంటూ కామెంట్స్ చేశారు. ఇక, పబ్‌లో నిందితుడు మద్యం సేవిస్తున్నప్పుడు అతడిలో మరో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను కూడా బయటకు వెల్లడించాలన్నారు. వారికి ఏదైనా పొలిటికల్ సపోర్టు ఉందా? అని ప్రశ్నించారు. ఇక, ఈ కేసు విషయంలో ప్రభుత్వ తీరును తీవ్ర తప్పుబడుతూ సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కూడా కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పుణెలో కారు ప్రమాదంలో మరో విషయం బయటకు వచ్చింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో అంశాన్ని గుర్తించారు. ఈ కేసులో భాగంగా రూ.3 లక్షలకు కక్కుర్తిపడి వైద్యులే నిందితుడి రక్తం నమూనాలు మార్చేశారని గుర్తించారు. ఈ మొత్తాన్ని తెచ్చిన ఆసుపత్రి ప్యూన్‌ను అరెస్టు చేశారు.అయితే, ప్రమాదం జరిగిన రోజు డాక్టర్ తావ్రే, నిందితుడి తండ్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా నిందితుడి రక్తనమూనాలను మార్చేస్తే భారీ మొత్తం ఇచ్చేలా డీల్ కుదిరిందని పోలీసులు నిర్ధారించారు. నిందితుడైన బాలుడి రక్త నమూనాలకు బదులు వేరే నమూనాలను ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారు. ఈ మేరకు వారి డీల్ కుదిరింది. కాగా, వైద్య పరీక్షల్లో ఆల్కహాల్ ఆనవాళ్లు బయటపడకూడదనే ఇలా చేశారని పోలీసులు తెలిపారు.ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది..కాగా, పటోలే వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఆసిఫ్ భామ్లా స్పందించారు. ఈ సందర్భంగా భామ్లా మాట్లాడుతూ.. ఈ కేసులో వైద్యులు ఏదైనా అవకతవకలకు పాల్పడినా లేక ఏదైనా తప్పు జరిగినా ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఒక ఎమ్యేల్యే పోలీసు స్టేషన్‌కు వెళ్లినంత మాత్రాన ఏదో జరిగిపోయిందని ప్రతిపక్షాలు తప్పడు ప్రచారం చేస్తున్నాయి. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోంది. ఎవరూ ప్రభుత్వాన్ని నిందించాల్సిన అవసరం లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు. -
పుణె పోర్షే కేసు : తాత అరెస్ట్
ముంబై: మహారాష్ట్ర పుణె కారు ప్రమాదం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. ఘటనకు కారకుడైన టీనేజర్ తాత సురేంద్ర అగర్వాల్‌ను అత్యంత నాటకీయ పరిణామాల నడుమ పోలీసులు ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచారణ కోసం సురేంద్రను విచారణకు పిలిచారు పుణే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు.. రాత్రి వరకు ప్రశ్నించారు. అయితే.. డ్రైవర్ గంగారాంను ఇరికించే ప్రయత్నం సురేంద్ర చేసిందేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. గంగారాంను బెదిరించి.. ప్రమాద సమయంలో కారు తానే నడిపినట్లు పోలీసుల వద్ద చెప్పాలని ఒత్తిడి చేసింది సురేంద్ర అని విచారణలో తేలింది. దీంతో.. కొత్త కేసు నమోదు చేసుకున్న పుణే క్రైమ్ బ్రాంచ్.. ఇవాళ వేకువ ఝామున 3గం. టైంలో సురేంద్రను ఆయన నివాసంలోనే అరెస్ట్ చేసింది. కాగా, ఈ కేసులో ఇది మూడో ఎఫ్ఐఆర్.ఓ టీనేజర్(17) ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మే 19వ తేదీన జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసులో కీలక నిందితుడైన మైనర్‌కు 15 గంటల్లోనే జువైనల్ జస్టిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. దీంతో పోలీసులు మరోసారి జువైనల్ జస్టిస్ బోర్డును ఆశ్రయించి, ఆదేశాలను పునఃపరిశీంచాలని కోరారు. ఈ క్రమంలోనే బెయిల్ రద్దు చేసిన న్యాయస్థానం అతడిని వచ్చే నెల 5 వరకు అబ్జర్వేషన్ హోంలో ఉంచాలని ఆదేశించింది. ప్రమాదానికి కొద్ది సేపటి ముందు ఆ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లి మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్‌ను బలంగా ఢీకొట్టాడు. దీంతో బండిపై ఉన్న ఇద్దరు టెకీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో నిందితుడి తండ్రి, రెండు బార్ల యజమానులను సైతం పోలీసులు అరెస్టు చేశారు.అయితే ఈ కేసులో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగాలపై ఇద్దరు అధికారులపైనా సస్పెన్షన్ వేటు పడింది. ప్రొటోకాల్ ప్రకారం ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారులకు చేరవేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతే కేసును పుణె క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటన తీవ్ర దుమారం రేపింది. -
పుణె పోర్షే కారు ప్రమాదం.. ఇద్దరు పోలీసుల సస్పెన్షన్
పుణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పుణె పోర్షే కారు ప్రమాద ఘటనలో శుక్రవారం(మే24) ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. ప్రమాదం గురించి వైర్‌లైస్ కంట్రోల్‌రూమ్‌కు సమాచారం ఇవ్వలేదన్న కారణంగా పోలీస్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేశారు.కారును రియల్టర్ విశాల్ అగర్వాల్ కుమారుడు నడపలేదన్నట్లుగా చిత్రీకరించేందుకు సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నం జరిగిందని పుణె పోలీసు కమిషనర్ చెప్పారు. ‘మా వద్ద సీసీ టీవీ ఫుటేజ్ ఉంది. కారు నడిపిన మైనర్ ప్రమాదానికి ముందు మందుతాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కేసులో సెక్షన్ 304 వర్తిస్తుందనడానికి కావాల్సిన అన్ని ఆధారాలున్నాయి’అని తెలిపారు. పోర్షే కారు ప్రమాదంలో అనీష్, అశ్వినీ అనే ఇద్దరు 24 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. -
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
మైనర్లను డ్రైవింగ్‌కు ఎందుకు అనుమతించకూడదనేదానికి పూణె పోర్షే ప్రమాదం కొందరికి విషాదకరమైన ఉదాహరణ. తప్పతాగి, పోర్స్చే కారును 200 కి.మీ వేగంతో నడిపిన యువకుడు రెండు కుటుంబాల్లో అంతు లేని అగాధాన్ని మిగిల్చాడు. చెట్టంత ఎదిగిన బిడ్డలు తిరిగి రాని లోకాలకువెళ్లిపోయారన్న షాక్‌నుంచి తేరుకోలేకపోతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. పుణేలో ఆదివారం తెల్లవారుజామున హై-ఎండ్ కారు పోర్సే కారుమితిమీరిన వేగంతో దూసుకొచ్చి ముందు ఉన్న బైక్‌ను వేగంగా ఢీ కొట్టింది. కారు ఢీ కొనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు ఎగిరిపడి స్పాట్లోనే చనిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో చనిపోయిన వారిని మధ్యప్రదేశ్‌కు చెందిన అనిష్ అవధియా , అశ్విని కోస్తా అనే ఇద్దరు 24 ఏళ్ల ఇంజనీర్లుగా గుర్తించారు.అశ్విని 20 అడుగుల ఎత్తుకు ఎగిరి బలంగా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.జబల్పూర్లో నివసించే అశ్విని తల్లి మమత ఇప్పటికీ షాక్‌లో ఉన్నారు. ‘‘కూతురికి పెళ్లి చేసి పల్లకీలో అత్తారింటికి పంపించాలను కున్నాం.. ఇలా పాడె ఎక్కించాల్సివస్తుందని ఊహించలేదు’’ అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది.మా పాప అశ్వినికి న్యాయం జరగాలి. మైనర్ , అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలి. వారు అతన్ని సరిగ్గా పెంచలేదు. వారు అతనికి కారు ఇవ్వకూడదు," అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు జువెనైల్ జస్టిస్ బోర్డ్ విధించిన శిక్షపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. (300 పదాల వ్యాసం రాయడం, 15 రోజుల పాటు ట్రాఫిక్ నిబంధనలను అధ్యయనం చేయడం మద్యపానం అలవాటుపై మానసిక చికిత్స కోసం కౌన్సెలింగ్‌కు హాజరు కావడం వంటి షరతులు)"ఇది ఒక జోక్? అతను ఏ వ్యాసం వ్రాస్తాడు? అశ్విని చాలా టాలెంటెడ్ గర్ల్.. కోటిమందిలో ఒకరు ఆమెకు. చాలా కలలు కనింది’’ అంటూ" కన్నీళ్లు పెట్టుకున్నారు. తను చాలా స్మార్ట్, ఇండిపెండెంట్, అన్ని రంగాల్లో ముందుండేది..వచ్చే నెలలో మా నాన్నగారి పుట్టినరోజుకి రావాలని ప్లాన్ చేశాం.. ఆయనకు రిటైర్మెంట్ పార్టీ కూడా ఆమె ప్లాన్ చేసిందంటూ అశ్విని సోదరుడు సంప్రీత్ వాపోయాడు.“నా కొడుకుని చంపేసాడు.. ఇప్పుడు నా కొడుకుని ఎప్పటికీ కలవలేను.. ఆ అబ్బాయి హత్యచేశాడు. వాణ్ని సరిగ్గా పెంచి ఉంటే ఈ రోజు నా కొడుకు జీవించి ఉండేవాడు” అనిష్ అవధియా తల్లి సవితా అవధియా గర్భశోకమిది. అనీష్ ఎంబీఏ చేయాలనుకుంటున్నాడని, చాలా హ్యపీ, సరదాగాఉండే వాడంటూ కొడుకును తలచుకుని గుండెపగిలేలా రోదించారామె. ఇటీవల యానివర్సరీకి ఇంటికొచ్చాడు. మళ్లీ వస్తాను..గిప్ట్ తెస్తా అన్నాడు అంటూ గుర్తు చేసుకున్నారు.“అపరాధికి శిక్ష పడుతుంది.. కానీ ఇప్పుడు మా బిడ్డను ఎలా తిరిగి తీసుకొస్తారు, ప్రమాదం జరగడానికి రెండు రోజుల ముందు తన తల్లితో మాట్లాడి, త్వరలో వస్తానని చెప్పాడు. కుటుంబానికి పెద్ద ఆసరాగా ఉన్నాడు. పూణేలో ఉన్న నా చిన్న కొడుకును ఇప్పుడు ఎవరు చూసుకుంటారు?" కుటుంబ బాధ్యతలను భుజానకెత్తుకునే బాధ్యతాయుతమైన కొడుకు దూరమైపోయాడంటూ అనీష్ తండ్రి ఓం అవధియా కంట తడిపెట్టారు. -
లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సరికొత్త లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఆటోమొబైల్స్ అంటే తనకున్న ప్రేమకు నిదర్శనంగా చే గ్యారేజీలో సరికొత్త పోర్స్చే 911 GT3 RS వచ్చి చేరింది. దీని విలువ దాదాపు 3.5 కోట్ల రూపాయలు. ఇదే ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. View this post on Instagram A post shared by Porsche Centre Chennai (@porschecentrechennai)పోర్స్చే సెంటర్ చెన్నై తన ఇన్‌స్టాగ్రామ్‌లో సూపర్‌కార్‌తో ఉన్న నాగ చైతన్య ఫోటోలను షేర్ చేసింది. ఈ కారును చైతన్యకు విజయవంతంగా డెలివరీ చేసినట్లు ప్రకటించింది. అలా తన కొత్త స్టార్ కస్టమర్‌కు స్వాగతం పలికేందుకు సోషల్ మీడియా ద్వారా స్వాగతం పలికింది. దీంతో ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నేచురల్ ఆస్పిరేటెడ్ నాలుగు లీటర్ల ఆరు-సిలిండర్ ఇంజన్‌తోవస్తున్న ఈ కారు 7-స్పీడ్ DCT సహాయంతో 518బీహెచ్పీ పవర్‌ను, 468 గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. గంటకు 296 కిమీ వేగంతో దూసుకుపోతుంది.నాగ చైతన్యకు ఇప్పటికే ఒక ఫెరారీ 488 GTB, రెండు సూపర్ బైక్‌లు, ఒక MV అగస్టా F4 , BMW R నైన్ టితో సహా ఇతర కార్లు ఉన్నాయి. వర్క్ ఫ్రంట్‌లో, నాగ చైతన్య రాబోయే యాక్షన్ డ్రామా 'తండేల్'లో నటిస్తున్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. -
'జైలర్' మరో హీరో అనిరుధ్‌కి కొత్త కారు గిఫ్ట్
'జైలర్'లో హీరో సూపర్‌స్టార్ రజనీకాంత్. అదే మరో హీరో ఎవరు అంటే దాదాపు ప్రతిఒక్కరూ చెప్పే పేరు అనిరుధ్. ఈ మూవీని పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మరో రేంజుకి తీసుకెళ్లాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు అతడి పనికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. నిర్మాత కళానిధి మారన్.. అదిరిపోయే బహుమతులు ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. (ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ ఫారెన్ టూర్.. కారణం అదేనా?) చాలా రోజుల నుంచి సరైన హిట్ లేక అల్లాడిపోయిన రజనీకాంత్‌కు 'జైలర్' రూపంలో బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. ఈ సినిమా స్టోరీ పరంగా కొత్తగా లేనప్పటికీ.. రజనీ స్టైల్, స్వాగ్ తోపాటు అనిరుధ్ మ్యూజిక్ బాగా ఎక్కేసింది. దీంతో మూవీ సూపర్ హిట్ అయిపోయింది. ప్రస్తుతం రూ.700 కోట్ల మేర వసూళ్లు దక్కినట్లు తెలుస్తోంది. మూవీ ఈ రేంజులో హిట్ కావడంతో పాటు ఈ స్థాయిలో లాభాలొచ్చేసరికి నిర్మాత కళానిధి మారన్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కొన్నిరోజుల ముందు హీరో రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కి ఖరీదైన కార్లతోపాటు చెక్ ని బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు అనిరుధ్ కి కూడా ఓ చెక్ ప్లస్ కాస్ట్ లీ పోర్స్ కారుని బహుమతిగా ఇచ్చారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే అమెజాన్ ప్రైమ్‌లో సెప్టెంబరు 7 నుంచి 'జైలర్' స్ట్రీమింగ్ కానుంది. (ఇదీ చదవండి: 'బిగ్ బాస్' భయపడ్డాడా? ఏకంగా ఆ విషయంలో!) -
దినేష్ ఠక్కర్ గ్యారేజిలో మరో సూపర్ కారు.. ధర ఎన్ని కోట్లంటే?
గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలో అన్యదేశ్య కార్ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు, క్రికెటర్లు విదేశాల నుంచి తమకు ఇష్టమైన కార్లను దిగుమతి చేసుకుంటారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఏంజెల్ వన్ చైర్మన్ 'దినేష్ ఠక్కర్' తన గ్యారేజిలో అత్యంత ఖరీదైన లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల ఈయన సరికొత్త స్పోర్ట్స్ కారు పోర్స్చే 911 GT3 టూరింగ్ డెలివరీ తీసుకున్నాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అత్యంత స్టైలిష్ సూపర్ కార్ బ్రాండ్ అయిన పోర్స్చే కంపెనీకి చెందిన '911 GT3 టూరింగ్' కారుని ఇటీవల కొనుగోలు చేసాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేశారు. రూ. 2.75 కోట్ల ఎక్స్-షోరూమ్ వద్ద లభించే ఈ కారు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంది. ఈ స్పోర్ట్స్ కారు 4.0 లీటర్ ఫ్లాట్ 6 ఇంజన్‌తో 502 పీఎస్ పవర్ అండ్ 470 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పర్ఫామెన్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదీ చదవండి: కోట్ల సంపదను కాదని సన్యాసం పుచ్చుకున్న వజ్రాల వ్యాపారి ఫ్యామిలీ.. ఎందుకో తెలిస్తే.. పోర్స్చే 911 GT3 టూరింగ్ మాత్రమే కాకుండా ఈయన గ్యారేజిలో లంబోర్ఘిని ఉరుస్ (రూ. 4.17 కోట్లు), ఫెరారీ 488 పిస్తా, లంబోర్ఘిని హురాకాన్ పెర్ఫార్మంటే (రూ. 4 కోట్లు), మెర్సిడెస్ AMG జీటీ బ్లాక్ సిరీస్ (రూ. 5.5 కోట్లు), పోర్స్చే 911 జీటీ3 ఆర్ఎస్, మెర్సిడెస్-AMG G63, మినీ కూపర్ ఉన్నాయి. అంతే కాకూండా భారతదేశపు మొట్టమొదటి పోర్షే టేకాన్ టర్బో S ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. View this post on Instagram A post shared by Dinesh Thakkar (@dineshdthakkar) -
రూ.కోటి పోర్షే లగ్జరీ కారు కొన్నాడు.. చిల్లర చూసి సిబ్బందికి ఫీజులు ఎగిరిపోయాయ్
Porsche 718 Boxster : ఇది సోషల్ మీడియా యుగం. ఏది చేసినా వినూత్నంగా చేయాలి. ఆ పని నలుగురిని ఆకట్టుకునేలా ఉండాలి. అలా అని అందరూ చేసే పని చేయకూడదు. ఇదిగో ఇలా ఆలోచించే వారి ధోరణి ఎక్కువైపోయింది. ఆ కోవకే చెందుతాడు ఈ యువకుడు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడని ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు కాయిన్స్‌ను చెల్లించి తమకు కావాల్సిన వస్తువుల్ని కొనుగోలు చేస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ యువకుడు కోటిరూపాయల లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. ఇందుకోసం కోటి రూపాయి కాయినట్లను చెల్లించడం ఆసక్తికరంగా మారింది. క్రేజీ ఎక్స్‌వైజెడ్ అనే యూట్యూబర్ రూ.1 నాణేలను చెల్లించి రూ.1 కోటి విలువైన పోర్షే 718 బాక్స్స్టర్ను కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఆయూట్యూబర్ ఏం చేశాడో తెలుసా? తన ఇంటి వద్దే కాయిన్స్‌ను మూటలుగా కట్టి ఓ కారు షోరూం వద్దకు వెళ్తాడు. అక్కడ షోరూం సిబ్బందితో తాను ఫోర్షే కారు కొనుగులో చేయాలని అనుకుంటున్నాను. ఆ కారు గురించి మొత్తం వివరాలు తెలుసుకుంటాడు. అనంతరం షోరూం బయట ఉన్న తన కార్లో ఉన్న కాయిన్స్ మూటల్ని తెచ్చి షోరూం సిబ్బందికి అందిస్తాడు. దీంతో కంగుతిన్న షోరూం యాజమాన్యం చేసేది లేక కాయిన్స్‌ను రాశులుగా పోసి లెక్కిస్తారు. కొన్ని గంటల పాటు లెక్కించిన అంనతరం.. పోర్షే కారును ఆ యూట్యూబర్‌కు అందిస్తారు. ఈ తతంగాన్ని సదరు యూట్యూబర్ వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. యూట్యూబర్ కొనుగోలు చేసిన పోర్షే 718 బాక్స్‌స్టర్ కూపే జర్మన్ ఆటోమేకర్. మనదేశంలో విక్రయించే లగ్జరీ కార్లలో ఇదొకటి. బాక్స్స్టర్తో పాటు, 718 బ్యాడ్జ్ 718 కేమాన్, 718 కేమాన్ ఎడిషన్, 718 బాక్స్‌స్టర్ స్టైల్ ఎడిషన్, 718 కేమాన్ ఎస్, 718 బాక్స్‌స్టర్ ఎస్, 718 కేమాన్ జీటీఎస్ 4.0,718 బాక్స్‌స్టర్ జీటీఎస్ 4.0 వంటి వేరియంట్లలో లభిస్తుంది. పోర్షే 718 బాక్స్‌స్టర్ కన్వర్టిబుల్ రూఫ్‌టాప్‌తో వస్తుంది. 4-సిలిండర్ 2.0-లీటర్ ఇంజన్‌ను డిజైన్ చేయబడింది. పూర్తి సామర్థ్యంతో, ఇంజిన్ 220 కేడబ్ల్యూ శక్తిని 380 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కారు వేగం 5.1 సెకన్లలో 0-100 కేఎంపీహెచ్ నుండి వేగంగా వెళ్లగలదు. -
లగ్జరీ కార్ల పిచ్చి! సూపర్ స్పోర్ట్స్‌కారు కొన్న బాలీవుడ్ యాక్టర్, వీడియో
Ram Kapoor owns Porsche 911 Turbo S (992): ప్రముఖ టెలివిజన్ నటుడు రామ్ కపూర్, "బడే అచ్చే లాగ్తే హై" 'కసమ్ సే' లాంటి పాపులర్ టీవీ సీరియళ్లతోపాటు అనేక బాలీవుడ్ సినిమాలలో నటనతో తనకంటూ ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకున్నాడు. రామ్‌కు లగ్జరీ కార్లు అంటే పిచ్చి. ముఖ్యంగా పోర్షే కార్లంటే చాలా ఇష్టం. అందుకే ఇటీవల తన గ్యారేజ్‌లో మూడో కారును జోడించాడు. టాప్ వేరియంట్ స్పోర్ట్స్ కారు 992 టర్బో S కారును కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు రూ. 3.6 కోట్లు. తాజాగా ముంబై రోడ్లపై కపూర్ తన కొత్త కారుతో షికారు చేయడం మీడియా కంటపడింది.ఇప్పటికే రెండు పోర్షే కార్లను సొంతం చేసుకున్న రామ్, తాజాగా మరో పోర్షే కారును అదీ టాప్ఎండ్ వేరియంట్‌ను కొనుగోలు చేయడం విశేషం. రామ్ కపూర్ భార్య గౌతమి కపూర్ కూడా నటి పోర్షే 911 టర్బో S (992) విశేషాలు అత్యంత అధునాతన మోడల్ 911 టర్బో S వేరియంట్, 560 PS గరిష్ట పపవర్ ను, 700 Nm నుండి భారీ 750 Nm టార్క్ వస్తుంది. ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ ఫీచర్‌తో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ PDK ట్రాన్స్మిషన్ ఇందులో ఉన్నాయి. ఇది కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. ఇవేకాదు 2021లో, రామ్ కపూర్ రూ. 2 కోట్ల విలువైన పోర్షే 911 కారెరా ఎస్‌ని కొనుగోలు చేశారు. ఇంకా రూ. 4.5 కోట్ల విలువైన ఫెరారీ పోర్టోఫినో ఎం , పోర్టోఫినో M పవర్,మెర్సిడెస్-AMG G63 లాంటి లగ్జరీ కార్లు రామ్ కపూర్ సొంతం. వీటితోపాటు బీఎండబ్ల్యూ ఆర్ 18, ఇండియన్ రోడ్‌మాస్టర్ డార్క్ హార్స్ , బీఎండబ్ల్యూ K 1600 B సూపర్ బైక్స్ కూడా ఉన్నాయి. -
రూ.2 కోట్ల స్పోర్ట్స్ కారు.. క్షణాల్లో కాలి బూడిదైంది..
న్యూఢిల్లీ: గురుగ్రామ్‌లో షాకింగ్ ఘటన జరిగింది. రూ.2 కోట్లకు పైగా విలువ చేసే పోర్షె లగ్జరీ స్పోర్ట్స్ కారు చెట్టును ఢీకొట్టి కాలి బూడిదైంది. క్షణాల్లోనే అగ్నికి ఆహుతైంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. మన్కీరత్ సింగ్(35) అనే వ్యక్తి గురువారం తెల్లవారుజామున ఈ కారులో వెళ్తున్నాడు. ఈ సమయంలో అదపుతప్పి రోడ్డుపక్కన చెట్టును ఢీకొట్టాడు. దీంతో ఇంజిన్‌లో నుంచి మంటలు చెలరేగాయి. మన్కీరత్ ఎలాగోలా కాలిన గాయాలతో బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అయితే కారుమాత్రం కాలిబుడిదైంది. వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టడంతో కారు భాగాలు 100 మీటర్ల దూరం వరకు వెళ్లిపడ్డాయి. చక్రాలు ఊడిపోయాయి. ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయే క్రమంలో మన్కీరత్ సింగ్ కారుపై నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టినట్లు తెలుస్తోంది. అతను గోల్ఫ్ కోర్స్ రోడ్డులోని సెక్టార్ 56 నుంచి సికందేర్పూర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: వామ్మో.. అర్ధరాత్రి ఇదేం పని.. బైక్‌లో పెట్రోల్ తీసి నిప్పంటించిన మహిళ.. -
జొమాటో సీఈఓ అద్భుతమైన కార్ల ప్రపంచం - చూద్దాం రండి!
దీపిందర్ గోయల్ (Deepinder Goyals) అనగానే అందరికి జొమాటో గుర్తొస్తుంది. భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అందరూ మెచ్చే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లలో జొమాటో ఒకటిగా నిలిచింది. పంజాబ్ రాష్ట్రంలో ఒక సాధారణ ఉపాధ్యాయ దంపతులకు జన్మించిన గోయల్ ఈ రోజు రూ. 2వేల కోట్లకంటే ఎక్కువ సంపాదించాడు. కోటీశ్వరుడైన దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఫెరారీ రోమా జొమాటో ప్రధాన కార్యాలయం సమీపంలోని రోడ్ల మీద తరచుగా దీపిందర్ గోయల్ తన ఫెరారీ రోమా కారులో కనిపిస్తూ ఉంటాడు. ఈ కారు రెడ్ కలర్లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చిత్రమేమంటే జొమాటో యాప్ కూడా ఇదే కలర్లో ఉండటం గమనార్హం. ఈ కారు ధర సుమారు రూ. 4.3 కోట్లు (ఆన్-రోడ్ ప్రైస్). ఫెరారీ రోమా 3.9 లీటర్ ట్విన్టర్బో వి8 ఇంజన్ కలిగి 690 బిహెచ్పి పవర్, 760 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 8 స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన 911 టర్బో ఎస్ కూడా దీపిందర్ గోయల్ ఉపయోగించే కార్లలో ఒకటి. దీని ధర రూ. 3.13 కోట్లు. ఈ కారు కేవలం 8.9 సెకన్లలో గంటకు 200 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఇంజిన్ 650 hp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. (ఇదీ చదవండి: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ - ఈ ధరతో ఒక కారు కొనేయొచ్చు!) లంబోర్ఘిని ఉరుస్ మన దేశంలో ఎక్కువ మంది సెలబ్రిటీల వద్ద ఉన్న లగ్జరీ కార్లలో లంబోర్ఘిని ఉరుస్ ఒకటి. ఈ కారుని దీపిందర్ గోయల్ కూడా కొనుగోలు చేశారు. దీని ధర రూ. 4.18 కోట్లు. ఇందులో 4.0-లీటర్, ట్విన్-టర్బో వి8 ఇంజిన్ ఉంటుంది. ఇది 650 hp పవర్, 850 Nm టార్క్ అందిస్తుంది. కేవలం 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమవుతుంది. పోర్స్చే కారెరా ఎస్ పోర్స్చే కంపెనీకి చెందిన కారెరా ఎస్ దీపిందర్ గోయల్ వద్ద ఉన్న సూపర్ కార్లలో ఒకటి. దీని ధర రూ. 1.88 కోట్లు. ఇందులోని 3.0 లీటర్ ప్లాట్ సిక్స్ సిలిండర్ బాక్సర్ పెట్రోల్ ఇంజిన్ 450 bhp పవర్, 530 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది డిజైన్, ఫీచర్స్ పరంగా చాలా ఉత్తమంగా ఉండటమే కాకుండా పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. (ఇదీ చదవండి: అపర కుబేరులు జిమ్‌లో ఉంటే ఇలాగే ఉంటారా? ఫోటోలు చూడండి!) ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
పోర్షేకు షాక్.. కస్టమర్ దెబ్బకు రూ. 18 లక్షలు ఫైన్ - ఎందుకంటే?
వాహనాల కొనుగోలు విషయంలో గానీ, వాహనాల తయారీ విషయంలో గానీ ఏదైనా సమస్య అనిపిస్తే, దానికి సంబంధిత సంస్థలు బాధ్యత వహించకపోతే మీరు కంజ్యూమర్ కోర్టుని సంప్రదించి నష్టపరిహారం పొందవచ్చు. ఇలాంటి సంఘటనలు గతంలో చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు కూడా అలాంటి మరో ఇన్సిడెంట్ తెరపైకి వచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) గురుగ్రామ్‌లోని పోర్షే అవుట్లెట్కు భారీ జరిమానా విధించింది. ఒక వినియోగదారుడు తనకు విక్రయించిన కారుని తయారు చేసిన సంవత్సరం తప్పుగా ఉందని పిర్యాదు చేసిన కారణంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. 2013లో తయారు చేసిన పోర్షే కారు 2014లో తయారు చేసిన కారుగా విక్రయించారని, అంతే కాకుండా సర్వీసులో లోపం ఉన్నట్లు జస్టిస్ రామ్ సూరత్ రామ్ మౌర్య కోర్టుకు విన్నవించారు. వినియోగదారుడు ప్రవీణ్ కుమార్ మిట్టల్ పోర్షే ఇండియా, గురుగ్రామ్‌లోని పోర్స్చే సెంటర్‌కు వ్యతిరేకంగా ఫిటిషన్ వేయడంతో ఈ చర్చ జరిగింది. (ఇదీ చదవండి: హ్యుందాయ్ 'ఎక్స్టర్' ఫస్ట్ లుక్ - చూసారా!) తయారు చేసిన సంవత్సరం గురించి అబద్ధం చెబుతూ రూ. 80 లక్షలకు కేయాన్‌ను విక్రయించినట్లు కస్టమర్ ఆరోపించారు. అయితే అదే తరహాలో కొత్త కారు ఇవ్వాలని, తాను ఖర్చు చేసిన ఇతర ఖర్చులతో పాటు పూర్తి కారు ధరలను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) ఫిర్యాదుదారుని దుర్మార్గపు ఉద్దేశ్యాలతో ఆరోపించే ఆరోపణలను పోర్స్చే తిరస్కరించింది. తయారీ సంవత్సరం గురించి అతనికి బాగా తెలుసు. కాబట్టే దానికి తగిన తగ్గింపు కూడా పొందినట్లు పేర్కొంది. ఇరువర్గాలు తమ పత్రాలను కోర్టులో సమర్పించారు. మిట్టల్ సమర్పణలు సమాచార హక్కు చట్టం (ఆర్టిఐ) కింద పబ్లిక్ అథారిటీ ద్వారా సేకరించడం వల్ల వాటి ప్రామాణికతను కోర్టు సమర్థించింది. చివరకు రూ. 18 లక్షలకు పైగా ఉన్న వడ్డీతో కలిపి అతనికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని పోర్షేను ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారుడికి లిటిగేషన్ ఖర్చుగా రూ. 25,000 చెల్లించాలని ఆదేశించింది. కల్పిత పత్రాల విషయమై అవసరమైతే తగిన చర్యలు తీసుకునేందుకు ఆ ప్రాంత పరిధిలోని పోలీసులచే విచారణ జరిపించాలని కూడా కమిషన్ ఆదేశించింది. -
ఒక్క చూపుతో మనసు దోచే పోర్స్చే కొత్త కార్లు - ధర & వివరాలు
దేశీయ విఫణిలో 'పోర్స్చే ఇండియా' ఎట్టకేలకు రెండు లేటెస్ట్ కార్లను విడుదల చేసింది. అవి కయెన్ ఫేస్‌లిఫ్ట్, కయెన్ కూపే ఫేస్‌లిఫ్ట్. కంపెనీ విడుదల చేసిన ఈ కార్ల ధరలు, డిజైన్, ఫీచర్స్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం. ధరలు: దేశీయ మార్కెట్లో విడుదలైన పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 1.36 కోట్లు కాగా, కయెన్ కూపే ఫేస్‌లిఫ్ట్ ధర రూ. 1.42 కోట్లు. అయితే డెలివరీలు 2023 జులై నెలలో ప్రారంభమవుతాయి. డిజైన్: ఒక్క చూపుతోనే ఆకర్షించే పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి రిఫ్రెష్డ్ ఫ్రంట్ ఫాసియాతో రీడిజైన్ పొందింది. ఇందులోని హెడ్‌లైట్, అల్లాయ్ వీల్స్ వంటివి మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. వెనుక భాగంలో టెయిల్ ల్యాంప్‌లను కనెక్ట్ చేసే లైట్‌బార్ ఉంటుంది. ఇంటీరియర్ ఫీచర్స్: పోర్స్చే కెయెన్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్‌లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ డిజైన్ చూడవచ్చు. ఇందులో 12.6 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మధ్యలో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ప్రయాణీకుల కోసం 10.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఉన్నాయి. అంతే కాకుండా కొత్త స్టీరింగ్ వీల్, డాష్ మౌంటెడ్ డ్రైవ్ సెలెక్టర్, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ కూడా ఇందులో ఉన్నాయి. ఇంజిన్ & పవర్‌ట్రెయిన్: నిజానికి మార్కెట్లో ప్రస్తుతం కయెన్, కయెన్ కూపే బేస్ మోడల్‌లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి 3.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ V6 పెట్రోల్ ఇంజన్‌తో 353 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ పొందుతుంది. అయితే త్వరలో విడుదలకానున్న ఈ మోడల్ ఈ-హైబ్రిడ్ వేరియంట్స్ అదే ఇంజిన్ కలిగి ఉన్నప్పటికీ e-మోటార్‌తో కలిసి 470 హెచ్‌పి ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులోని 25.9kWh బ్యాటరీ 90 కిలోమీటర్ల పరిధిని మాత్రమే అందిస్తుంది. ఇది 11kW ఆన్-బోర్డ్ ఛార్జర్ ద్వారా సుమారు 2.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేసుకోగలదు. ప్రత్యర్థులు: భారతదేశంలో విడుదలైన కొత్త పోర్స్చే కయెన్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పటికే అమ్మకానికి ఉన్న మసెరటి లెవాంటే, రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ8 వంటి లగ్జరీ కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. -
కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్‌మేకర్ పోర్షే భలే చిక్కుల్లో పడింది. కంపెనీ అతిపెద్ద మార్కెట్ చైనాలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే అక్కడి చైనా డీలర్ ఒకరు 148,000 డాలర్ల(రూ. 1.21 కోట్లు) విలువ చేసే స్పోర్ట్స్ కారును కేవలం 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల కంటే కొంచెం ఎక్కువ) అంటూ తప్పుగా లిస్ట్ చేశారు. వాస్తవ ధరలో ఎనిమిదో వంతు తగ్గేసరికి లగ్జరీ కార్ లవర్స్ ముందస్తు బుకింగ్‌కు ఎగబడ్డారు. చివరికి విషయం తెలిసి ..ఇదెక్కడి చోద్యం రా మామా అంటూ ఉసూరుమన్నారట.! బ్లూమ్‌బెర్గ్ కథనం ప్రకారం ప్రముఖ 2023 పనామెరా మోడల్ విక్రయంలో ఉత్తర చైనా పట్టణంలోని యిన్చువాన్లోని పోర్షే డీలర్ ఇచ్చిన ఆన్లైన్ ప్రకటన కంపెనీని పరుగులు పెట్టించింది. అతి తక్కువ ధరకే తమ ఫ్యావరెట్ కారు అనేసరికి ఊరుకుంటారా? వందలాది మంది ఔత్సాహిక కొనుగోలుదారులు 911 యువాన్లను ముందుగానే చెల్లింపుతో కారును బుక్ చేసేశారు. ఈ బుకింగ్‌లు చూసి ఆశర్చర్యపోయిన కంపెనీ ఏం జరిగిందా? అని ఆరా తీస్తే అసలు విషయం బైటపడింది. దీంతో "లిస్టెడ్ రిటైల్ ధరలో తీవ్రమైన పొరపాటు జరిగింది" అని పోర్షే ప్రకటించాల్సి వచ్చింది. బుకింగ్‌లు చేసి, అడ్వాన్స్‌ను చెల్లించిన మిగతా వారందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. 48 గంటల్లోగా రీఫండ్ ఇస్తామని పేర్కొంది. దీంతో భంగపడిన కస్టమర్లు, ఇతర వినియోగదారులు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో పోర్షేను విపరీతంగా ట్రోల్ చేశారు. కాగా పోర్షే 2022 మొదటి అర్ధ భాగంలోనే చైనాలో 6.2 బిలియన్ డార్లు విలువైన సేల్స్ సాధించింది. 46,664 వాహనాలను విక్రయించింది. ప్రీమియం కార్ బ్రాండ్ పోర్షే ప్రపంచ విక్రయాలలో 30 శాతమట. -
లగ్జరీ కారు కొన్న కుమార్తెలు: గర్ల్ పవర్ అంటున్న మ్యూజిక్ డైరెక్టర్
సాక్షి, ముంబై: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కుమార్తెలు రతీజా రెహమాన్, రహీమా రెహమాన్ ఫాస్టెస్ట్, లగ్జరీ కారును కొనుగోలు చేశారు. పోర్షే టైకాన్ కారు కొన్న విషయాన్ని స్వయంగా రెహమాన్ ట్విటర్లో వెల్లడించారు. యువ నిర్మాతలు, కూల్ మెటావర్స్ ప్రాజెక్ట్ లీడర్స్ రతీజా, రహీమా (ఏఆర్ఆర్ స్టూడియోస్) కారు కొన్నందుకు ముఖ్యంగా కాలుష్య రహిత కార్‌ను ఎంచుకోవడంపై సోషల్ మీడియాలో సంతోషం ప్రకటించారు. అంతేకాదు ‘గర్ల్ పవర్’ అంటూ గర్వాన్ని ప్రకటించారు. “ARR స్టూడియోస్” పేరుతో ఉన్న ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును, పక్కనే ఖతీజా , రహీమా నిలబడి ఉన్న బ్యూటిఫుల్ పిక్‌ను షేర్ చేశారు. జర్మన్ స్పోర్ట్స్ కార్కు చెందిన, జెంటియన్ బ్లూ మెటాలిక్ కలర్లో మెరిసిపోతున్న పోర్షే టైకాన్ ధర రూ. 1.53 కోట్ల నుంచి రూ. 2.34 కోట్లు. ఉంటుంది. జర్మన్ స్పోర్ట్స్ కార్ తయారీదారు Taycan EV టాప్-స్పీడ్‌ను 260Kmphకి పరిమితం చేసింది.ఈ కారు కేవలం 2.8 సెకండ్ల వ్యవధిలోనే 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో పోర్షే టైకాన్ ఒకటి. ఈ ఖరీదైన లగ్జరీ స్పోర్ట్స్ కారుకు భారతదేశంలో డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు దీనిపై మనసు పారేసుకుంటున్నారు. 2021లో భారతదేశంలో పోర్షే టైకాన్‌ను లాంచ్ చేసింది. Taycan RWD, Taycan 4S, Taycan Turbo మరియు Taycan Turbo Sin ఉన్నాయి. Our young producers of #ARRstudios spearheading cool #Metaverse projects @RahmanKhatija #RaheemaRahman. Have chosen to go green with the #electriccar. Be the change you want to see. #bosswomen #girlpower #gogreen pic.twitter.com/i8TFUZULF9 — A.R.Rahman (@arrahman) November 23, 2022 -
పోర్స్చేకు చైనా భారీ షాక్!
ప్రముఖ పోర్స్చే టేకాన్ సంస్థకు చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ (ఎస్ఎంఆర్) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పోర్స్చేకు చెందిన 6,172 కార్లను రీకాల్ చేయాలని ఆదేశించింది. చైనాలో అమ్మకాలు జరిపిన పోర్స్చే 2020-21 సంవత్సరానికి చెందిన మోడల్ ఎలక్ట్రిక్ కార్లను రీకాల్ చేయాలని ఎస్ఎంఆర్ తెలిపింది.పోర్స్చే టేకాన్ డ్రైవింగ్ సీట్ వైరింగ్ సమస్యలతో పాటు సీట్ల సప్లిమెంటల్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (ఎస్ఆర్ఎస్) పని చేయడంలో విఫలమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. సీటు పనికిరాకుండా పోయినా లేదా ఎస్ఆర్ఎస్ పని చేయడం ఆగినా వెహికల్ క్రాష్ అవుతుందనే అనుమానం వ్యక్తం చేసింది. అందుకే ఆ కార్లను రీకాల్ చేయాలని తెలిపింది. దీంతో పోర్స్చే తన డీలర్ల వద్ద రీకాల్ చేసిన అన్ని వాహనాలపై సీట్ వైర్ హార్నెస్‌లను ఫ్రీగా చెక్ చేయాలని ఎస్ఆర్ఎస్ ఆదేశించినుంది. ఒక జీను పాడైపోయినా లేదా డిస్కనెక్ట్ అయిన సందర్భంలో, పోర్స్చే దానిని రిపేర్ చేస్తుంది. లేదంటే మార్చేస్తుంది. -
జోరుగా పోర్షె కార్ల అమ్మకాలు..ఎక్కువగా సేల్ అవుతున్న కార్లు ఇవే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పోర్ట్స్ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ పోర్ష.. ఈ ఏడాది జనవరి–మార్చిలో భారత్‌లో 188 కార్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 22 శాతం అధికం. 2013 తర్వాత ఒక త్రైమాసికంలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఎస్‌యూవీలైన కయెన్, మకాన్ విజయవంతంగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాయని కంపెనీ తెలిపింది. పోర్ష నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లు కూడా ఇవేనని వివరించింది. 2021 జనవరి–మార్చిలో కంపెనీ 62 శాతం వృద్ధి సాధించింది. -
ఈవీ మార్కెట్లోకి మరో లగ్జరీ కారు కంపెనీ
ప్రముఖ లగ్జరీ వాహన సంస్థ పోర్షే వచ్చే నెల నవంబర్ 12న టేకాన్ అనే ఎలక్ట్రిక్ కారును ప్రారంభించనుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 93.4 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. కంపెనీ టేకాన్ టర్బో, టర్బో ఎస్ మోడల్స్ కార్లను తీసుకురావాలని భావిస్తుంది. మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, ఆడీ తర్వాత మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. జర్మన్ బ్రాండ్ నవంబర్ 12న మాకన్ ఫేస్ లిఫ్ట్ కారుతో పాటు ఎలక్ట్రిక్ కారును తీసుకొని రానున్నట్లు తెలుస్తుంది. టేకాన్ టర్బో కారు 671 బిహెచ్ పీ పవర్, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు టర్బో ఎస్ 1,050 ఎన్ఎమ్ టార్క్, 750.5 బిహెచ్ పీ పవర్ ఉత్పత్తి చేయనుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే పోర్షే టేకాన్ టర్బో కారును ఒకసారి ఛార్జింగ్ చేస్తే 452 కిలోమీటర్ల రేంజ్, టర్బో ఎస్ 416 కిలోమీటర్ల రేంజ్ వెళ్లనున్నాయి. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం 230 కిమీ/గం. ఒకే ఒక గేర్ ఉన్న చాలా ఎలక్ట్రిక్ కార్ల మాదిరిగా కాకుండా టేకాన్ రెండు గేర్లను కలిగి ఉంది. ఒకటి తక్కువ వేగం కోసం మరొకటి అధిక వేగం కోసం. ఎలక్ట్రిక్ పోర్స్చే టేకాన్ ధర సుమారు రూ.2 కోట్లు(ఎక్స్ షోరూమ్) ఉండే అవకాశం ఉంది. (చదవండి: యాపిల్‌కు భారీ షాకిచ్చిన విద్యార్థులు..!) -
1.83 కోట్ల విలువైన కారు కొన్న బుల్లితెర నటుడు
Ram Kapoor New Car: ప్రముఖ బుల్లితెర నటుడు రామ్ కపూర్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. సుమారు 1.82 కోట్ల రూపాయలు వెచ్చించి ఖరీదైన పోర్షే 911 కరీరా ఎస్ మోడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చేసింది. సెంట్రల్ ముంబైలోని రామ్ కపూర్ నివాసానికి కారును పంపించామని, పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘అసలే వర్షాలు.. ముంబై రోడ్ల మీద ఈ కారు సాఫీగా సాగిపోతుందా? అయినా.. మన టీవీ ఆర్టిస్టులకు ఇంత పెద్ద మొత్తం పారితోషికంగా లభించడం నిజంగా పెద్ద విషయమే. అంతా ఏక్తా కపూర్ మహిమ’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కాగా న్యాయ్ సీరియల్‌తో 1997లో హిందీ బుల్లితెరపై అడుగుపెట్టిన రామ్ కపూర్... హీనా, సంఘర్ష్, కవిత వంటి డ్రామాలతో గుర్తింపు దక్కించుకున్నాడు. ఇక హిందీ టెలివిజన్ క్వీన్‌గా గుర్తింపు పొందిన ఏక్తా కపూర్ నిర్మించిన ఘర్ ఏక్ మందిర్‌తో అతడి కెరీర్ మలుపు తిరిగింది. ముఖ్యంగా కసం సే, బడే అచ్చే లగ్తే హై సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. తన నటనకు గానూ పలు అవార్డులు కూడా పొందాడు. ఇక ఏజెంట్ వినోద్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, హమ్‌షకల్స్, ఉడాన్, థప్పడ్ వంటి సినిమాల్లో రామ్ కపూర్ నటించాడు. కారు ధర, ముఖ్యమైన ఫీచర్లు: పోర్షే 911 కరీరా ఎస్ ధర- సుమారు 1.83 కోట్లు మైలేజ్- 11.24 కిలోమీటర్/లీటర్ ఇంజన్- 2981సీసీ ఆటోమేటిక్ డ్యుయల్ క్లచ్ పెట్రోల్ వర్షన్ 4 సీటర్ కెపాసిటీ -
2021 ప్రపంచ ఆటోమొబైల్ డే: టాప్-5 బెస్ట్ కార్స్
"కార్ల్ బెంజ్" తన మొదటి ఆటోమొబైల్ మూడు చక్రాల మోటర్వ్యాగన్ కోసం సుమారు 135 సంవత్సరాల క్రితం 1886 జనవరి 29న పేటెంట్ దాఖలు చేశారు. ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకత్వం వహించడంలో "కార్ల్ బెంజ్" కీలక పాత్ర పోషించినందున ఈ రోజును 'ప్రపంచ ఆటోమొబైల్ డే'గా జరుపుకుంటారు. ఆటోమొబైల్ చరిత్రలో ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు అని ఆటోమొబైల్ ప్రియులు నమ్ముతారు. ప్రపంచ ఆటోమొబైల్ డే సందర్భంగా ప్రస్తుతం మన దేశంలో ఉన్న టాప్-5 ఉత్తమ కార్లను మీకోసం అందిస్తున్నాము. (చదవండి: పాత కారు.. టాప్ గేరు!) ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఆడి ఆర్ఎస్ క్యూ8 కూపే ఎస్యూవీ జర్మన్ కార్ల తయారీ కంపెనీ. ప్రస్తుతం ఇది భారతదేశంలో కొనుగోలుకు సిద్ధంగా ఉంది. పనితీరు విషయానికి వస్తే- ఆడి ఆర్ఎస్ క్యూ 8 ఇంగోల్స్టాడ్ ఆధారిత కార్ల తయారీదారు నుంచి వచ్చిన అత్యంత శక్తివంతమైన ఎస్యూవీ. ఇది 592 బిహెచ్పి వి8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తేలికపాటి-హైబ్రిడ్ వ్యవస్థను కలిగి ఉంది. ఐకానిక్ నూర్బర్గింగ్ సర్క్యూట్ ను 7 నిమిషాల 42 సెకన్ల ల్యాప్ టైమ్‌తో తిరిగిన రికార్డు దీని పేరిట ఉంది. ఇది 0 నుంచి 100కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.8 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 250 కి.మీ/గం. లంబోర్ఘిని ఉరుస్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్‌యూవీని మూడేళ్ల క్రితమే భారత్‌లోకి తీసుకొచ్చారు. ఇప్పటికి దీనిని తీసుకోవాలంటే 8-9 నెలల ముందు బుక్ చేసుకోవాల్సిందే. అంత క్రెజ్ ఉంది దీనికి. ఇది ఇటాలియన్ కి చెందిన కంపెనీ. దీనిలో అత్యధిక శక్తినిచ్చే 4.0-లీటర్ ట్విన్ టర్బో వి 8 ఇంజిన్ ఉంది. ఇది 641 బిహెచ్పి, 850ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 3.6 సెకన్ల సమయం తీసుకుంటే 200 కిలోమీటర్ల వేగానికి చేరుకోవడానికి 12.8 సెకెన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం వచ్చేసి 305 కి.మీ/గం.(చదవండి: సరికొత్తగా అమెజాన్ లోగో) మసెరటి లెవాంటే లగ్జరీ కార్ల తయారీ కంపెనీ చరిత్రలో మసెరటి చాలా ప్రసిద్ధి చెందింది. ఇది ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీదారు కంపెనీ. మసెరటి తన మొదటి కారు A6ను 1947సంవత్సరంలో తయారుచేసింది. ఇండియా లగ్జరీ కార్ల పోర్ట్‌ఫోలియోలో ఇది కూడా కనిపిస్తుంది. మన దేశంలో 2018 జనవరిలో విక్రయించిన మొట్టమొదటి మసెరటి ఎస్యూవీ ఇది. ఈ ఎస్యూవీ 3.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 271 బిహెచ్పి పీక్ పవర్, 600ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లెవాంటే 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 6.9 సెకన్ల సమయం తీసుకుంటుంది. ఇది 230 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళుతుంది. పోర్స్చే 911 టర్బో ఎస్ పోర్స్చే నుంచి వచ్చిన అన్ని కార్ల కంటే 911 టర్బో ఎస్ అందరిని ఎక్కువగా ఆకర్షించింది. భారతదేశంలో ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ. 3.08 కోట్లు(ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది 3.8-లీటర్, 6-సిలిండర్, ట్విన్-టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. పోర్స్చే 911 641 బిహెచ్పి, 800 ఎన్ఎమ్ పవర్ ఫిగర్ వల్ల 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్కు అనుగుణంగా ఉంటుంది. ఈ స్పోర్ట్స్ కారు 2.7 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే 0 నుంచి 200 కిలోమీటర్లు చేరుకోవడానికి 8.9 సెకన్ల సమయం పడుతుంది. దీని గరిష్ట వేగం 330 కిలోమీటర్లు. రోల్స్ రాయిస్ ఘోస్ట్ రోల్స్ రాయిస్ గత సంవత్సరం భారతదేశంలో కొత్త ఘోస్ట్ యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్ ను ప్రవేశపెట్టింది. ఇది బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీదారుల కంపెనీ. దీని డెలివరీలు 2021 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఈ కారు 6.75-లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి 12 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ కారు మోటారు 563 బిహెచ్పి, 850 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రోల్స్ రాయిస్ కారులో సెల్ఫ్ లెవలింగ్ హై-వాల్యూమ్ ఎయిర్ సస్పెన్షన్ టెక్నాలజీతో పాటు ఆల్-వీల్-డ్రైవ్, ఆల్-వీల్ స్టీరింగ్‌ను అందించారు. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 250 కి.మీ. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోవడానికి 4.6 సెకన్ల సమయం తీసుకుంటుంది. -
ఇక మన రోడ్లపైనా ఎలక్ట్రిక్ కార్ల హవా
ముంబై, సాక్షి: ఇటీవల ప్రపంచ మార్కెట్లను వేడెక్కిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ దేశీయంగానూ ఊపందుకోనుంది. 2021లో పలు దిగ్గజ కంపెనీలు దేశీ మార్కెట్లో విభిన్న ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. దేశీయంగా ఎలక్ట్రిక్ కార్ల పోటీకి ఆడి, జాగ్వార్, టెస్లా తదితరాలు సై అంటున్నట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వెరసి గతంలో ఎన్నడూలేని విధంగా దేశీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పలు మోడళ్లు రంగ ప్రవేశం చేయనున్నట్లు తెలియజేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం 2,500 వాహనాల వరకూ దిగుమతి చేసుకునేందుకు అనుమతించడం మద్దతిస్తున్నట్లు చెప్పారు. దీంతో అత్యున్నత సాంకేతికతతో కూడిన ఆధునిక వాహనాలు దేశీ రహదారులపై పరుగులు తీసేందుకు సన్నద్ధమవుతున్నట్లు వివరించారు. ఆటో రంగ నిపుణులు వెల్లడించిన వివరాలు చూద్దాం.. ఆడి ఈ-ట్రాన్ ఆడి సంస్థ రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో ఈ-ట్రాన్ కీలక మోడల్. పూర్తి ఎలక్ట్రిఫికేషన్ దిశలో ఆడి తీసుకువస్తున్న ఈ-ట్రాన్ బ్రాండ్ దేశీయంగా విడుదలకానున్న తొలి విలాసవంత(హైఎండ్) కారుగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 17,641 వాహనాలు విక్రయమయ్యాయి. దేశీ మార్కెట్లో తొలిగా విడుదలైన మోడల్‌గా ప్రయోజనాలు పొందే వీలుంది. తొలి దశలో పూర్తిగా నిర్మితమైన వాహనం(సీబీయూ)గా తక్కువ సంఖ్యలోనే దిగుమతికానున్నాయి. అయితే రెండు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా విడివిడిగా యాక్సిల్స్‌ను నడిపించే శక్తితో వాహనం, అమ్మకాలు వేగాన్ని అందిపుచ్చుకోనున్నాయి. జనవరి చివర్లో విడుదలకానున్న ఈ-ట్రాన్ గరిష్టంగా 357 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. జాగ్వార్ 1-పేస్ 2019 వరల్డ్ కార్గా ఎంపికైన జాగ్వార్ 1-పేస్ వాహనాలు ఇటీవల పరిశీలనాత్మకంగా ముంబైలో సందడి చేస్తున్నాయి. యూఎస్ దిగ్గజం టెస్లా ఇంక్ సైతం రేసులోకి రానుండటంతో అతిత్వరలోనే కారు విడుదల తేదీ ఖరారయ్యే వీలుంది. 90 కిలోవాట్స్ లిథియం అయాన్ బ్యాటరీతో, 394 బీహెచ్పీ గరిష్ట శక్తిని అందుకోనుంది. టాప్ఎండ్ హెచ్ఎస్ఈ మోడల్ ద్వారా దేశీయంగా తయారవుతున్న రెండో ఎలక్ట్రిక్ లగ్జరీ కారుగా నిలవనుంది. గరిష్టంగా 470 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. అంచనా ధర రూ. 1.5-2 కోట్లు. (జీప్ స్పీడ్‌కు ఫియట్ క్రిస్లర్ సై) టెస్లా మోడల్-3 యూఎస్ కంపెనీ టెస్లా రూపొందించిన ఎలక్ట్రిక్ కారు మోడల్-3 దేశీయంగా విడుదలకానున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశాక ఆసక్తి బాగా పెరిగింది. గ్లోబల్ ఆటో రంగంలో సంచలనాలకు నెలవుగా నిలుస్తున్న మోడల్-3 ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో వేగవంత విక్రయాలను సాధిస్తోంది. టెస్లా ఇంక్ తయారీలో అత్యధిక అమ్మకాలు సాధిస్తున్న ఈ వాహనం ఎంట్రీలెవల్ విభాగంలో పోటీకి దిగనుంది. 5 సెకన్లలోపే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల మోడల్-3 గరిష్టంగా 420 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. డాష్‌బోర్డుకు అనుసంధానించిన ల్యాప్‌టాప్ మోడల్ 15 అంగుళాల టచ్ స్క్రీన్‌తో రానుంది. ఏప్రిల్ తదుపరి మార్కెట్లో విడుదలకావచ్చు. అంచనా ధర: రూ. 60 లక్షలు. (ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్?) పోర్ష్ టేకెన్ కంపెనీకున్న దశాబ్దాల ఇంజినీరింగ్ సామర్థ్యాలతో నాలుగు డోర్లు కలిగిన ఎలక్ట్రిక్ కారును టేకెన్ బ్రాండుతో పోర్ష్ రూపొందించింది. కోవిడ్-19 కారణంగా విడుదల ఆలస్యమైన టేకెన్ ఫిబ్రవరిలో దేశీ మార్కెట్లలో ప్రవేశించే వీలుంది. పోర్ష్ నుంచి వస్తున్న తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ కారు ఇది. ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో అత్యంత శక్తికలిగిన కారు కూడా. 79.2 కిలోవాట్స్ బ్యాటరీ, 600 బీహెచ్పీ శక్తితో రూపొందింది. గరిష్టంగా 500 కిలోమీటర్లు ప్రయాణించగలదని అంచనా. 3.5 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగం అందుకోగలదు. 800 వోల్డ్ ఫాస్ట్ చార్జింగ్ ద్వారా 20 నిముషాల్లోనే 80 శాతం చార్జింగ్కు వీలున్నట్లు కంపెనీ చెబుతోంది. అంచనా ధర: రూ. 2.2-2.5 కోట్లు వోల్వో ఎక్స్‌సీ40 రీచార్జ్ స్వీడిష్ దిగ్గజం వోల్వో రూపొందించిన పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ 40 రీచార్జ్. వోల్వో తయారీ ఎస్60 మోడల్ విడుదల తదుపరి మార్కెట్లో ప్రవేశించనుంది. ట్విన్ మోటార్లు కలిగిన రీచార్జ్ 408 బీహెచ్పీ పవర్‌ను కలిగి ఉంది. 78 కిలోవాట్ల బ్యాటరీతో వెలువడనుంది. ఏసీ లేదా 150 కిలోవాట్స్ డీసీ ఫాస్ట్ చార్జర్ ద్వారా చార్జ్ చేసుకోవచ్చు. తొలిసారి ఆండ్రాయిడ్ ఆధారిత ఎంటర్టైన్మెంట్ సిస్టమ్‌ను వోల్వో ఏర్పాటు చేసింది. గరిష్టంగా 400 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశముంది. అంచనా ధర: రూ. 50 లక్షలు. టాటా ఆల్ట్రోజ్ఈవీ ఓవైపు ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో విలాసవంత మోడళ్ల హవా ప్రారంభంకానున్నప్పటికీ మరోపక్క దేశీ ఆటో రంగ దిగ్గజం టాటా మోటార్స్ అందుబాటు ధరల్లో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై దృష్టిపెట్టి సాగుతోంది. దేశంలోనే చౌక ఎలక్ట్రిక్ కారుగా టాటా నెక్సాన్ ఈవీను తీసుకువచ్చిన కంపెనీ ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఆల్ట్రోజ్ ఈవీని రూపొందించింది. అందుబాటు ధరల ఈ కార్ల వినియోగదారులు టాటా మోటార్స్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న చార్జింగ్ నెట్వర్క్ ద్వారా లబ్ది పొందేందుకూ వీలుంటుంది. గరిష్టంగా 300 కిలోమీటర్లు ప్రయాణించే వీలుంది. ఫిబ్రవరిలో మార్కెట్లో ప్రవేశించవచ్చు. అంచనా ధర: రూ. 14 లక్షలు. -
ఉద్యోగులకు బంపర్ బోనస్.. అయితే..
బెర్లిన్: ఈ ఏడాది ప్రారంభంలో అందించిన బోనస్ నుంచి కొద్ది మొత్తం కోవిడ్-19(కరోనా వైరస్)పై పోరుకు విరాళంగా ప్రకటించాలని ప్రముఖ కార్ల తయారీ సంస్థ పోర్షే తన ఉద్యోగులకు విజ్ఞప్తి చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో లాభాలు ఆర్జించినందుకు గానూ ఈ జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం తన ఉద్యోగులకు బంపర్ బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే. సంస్థ విజయం సాధించడంలో తోడ్పాటు అందించిన వారందరికీ 9 వేల యూరోలు బోనస్(వ్యక్తిగత పెన్షన్ ప్రణాళిక కోసం 700 యూరోలు అదనం)గా ఇస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొంది. అయితే ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకున్న వేళ సాటి వారికి సహాయంగా నిలిచేందుకు విరాళాలు అందించాలని సంస్థ ఉద్యోగులను కోరింది. ఇక పోర్షే బోర్డు వ్యక్తిగతంగా 5 మిలియన్ యూరోలు దానం చేసిందని... దీనిని సామాజిక కార్యక్రమాల కోసం వినియోగిస్తుందని తెలిపింది. ఇలా ప్రతీ ఒక్కరూ స్వచ్చంగా ముందుకు వచ్చి మహమ్మారిపై పోరులో ముందుండాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.‘‘మనమంతా కలిసికట్టుగా పనిచేసినందు వల్లే విజయాలు సాధించాం. ఇందులో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. ప్రతీ ఒక్కరికి బోనస్ లభిస్తుంది. అయితే ఈసారి ఆ మొత్తాన్ని సంఘీభావం తెలిపేందుకు ఉపయోగిద్దాం’’అంటూ కంపెనీ ఉన్నత పదవిలో ఉన్న ఆలివర్ బ్లూమ్ ఉద్యోగులను చైతన్యవంతం చేశారు. కాగా కరోనా ధాటికి ఆటోమొబైల్ సహా అన్ని రంగాలు కుదేలవుతున్న విషయం తెలిసిందే.(కరోనాతో ఏవియేషన్ కుదేలు..) -
పోర్షే కయన్ కూపే @ 1.32 కోట్లు
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. ‘కయన్ కూపే’ మోడల్‌ను శుక్రవారం భారత మార్కెట్లోకి విడుదలచేసింది. కేవలం 6 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగిన ఈ మోడల్లో రెండు వేరియంట్లు ఉన్నాయి. వీటిలో కయన్ కూపే ధర రూ. 1.32 కోట్లు కాగా, కయన్ టర్బో కూపే ధర రూ. 1.98 కోట్లు. ఈ నూతన మోడల్లో మూడు లీటర్ల వీ6 టర్బో ఇంజిన్ అమర్చగా, అవుట్‌పుట్ 340 హెచ్‌పీగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. సన్‌రూఫ్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగలిన సీట్లు, 7–అంగుళాల డిస్ప్లే, 12.3–అంగుళాల హెచ్డీ టచ్‌స్క్రీన్, 22 ఇంచ్ జీటీ డిజైన్ వీల్స్ నూతన మోడల్లో స్పెసిఫికేషన్లుగా వివరించింది. -
పోర్ష్ మకన్ కొత్త వేరియంట్
న్యూఢిల్లీ: లగ్జరీ స్పోర్ట్స్ కార్ల కంపెనీ పోర్ష్ కంపెనీ కాంపాక్ట్ ఎస్యూవీ, మకన్లో కొత్త వేరియంట్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధరలు రూ.69.98లక్షల(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయని అని పోర్ష్ ఇండియా తెలిపింది. భారత్‌లో అత్యధికంగా విజయవంతమైన మోడల్ ఇదేనని, ఈ కొత్త వేరియంట్‌కు కూడా మంచి స్పందన లభించగలదని ఆశిస్తున్నామని పోర్ష్ ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి చెప్పారు. ఈ కారును 2–లీటర్ల టర్బోచార్జ్డ్ నాలుగు సిలిండర్ల ఇంజిన్‌తో రూపొందించామని, 252 హార్స్పవర్ శక్తిని ఈ ఇంజిన్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. గంటకు వంద కిలోమీటర్ల వేగాన్ని ఆరున్నర సెకన్లలోనే అందుకుంటుందని, గరిష్ట వేగం గంటకు 227 కి.మీ. అని పేర్కొన్నారు. ఈ మోడల్లో హై ఎండ్ వేరియంట్, మకన్ ఎస్‌ను కొత్త వీ6 ఇంజిన్‌తో రూపొందించామని, 354 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుందని వివరించారు. ఈ కారు ధర రూ.85.03 లక్షలని తెలిపారు. గత ఏడాది మొత్తం 348 కార్లను విక్రయించామని, ఈ ఏడాది కూడా అమ్మకాలు ఇదే రేంజ్లో ఉండగలవని పేర్కొన్నారు. 4 నిమిషాల్లోనే చార్జింగ్.. వచ్చే ఏడాది మే కల్లా ఎలక్ట్రిక్ కారు, టేకాన్‌ను భారత మార్కెట్లోకి తెస్తామని పవన్ శెట్టి తెలిపారు. ఇతర పోర్ష్ కార్ల మోడళ్లలాగే ఈ కారును కూడా పూర్తిగా తయారైన రూపంలోనే దిగుమతి చేసుకుంటామని చెప్పారు. ఈ కారు బ్యాటరీలను నాలుగు నిమిషాల్లోనే చార్జింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్లను చార్జింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడానికి భారత్‌లోని ఫైవ్–స్టార్ హోటళ్లతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు. కాగా ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి, చార్జర్లపై పన్ను రేట్లను 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడాన్ని ఆయన స్వాగతించారు. ఇది సానుకూల నిర్ణయమని పేర్కొన్నారు. -
పోర్షే ‘911 కార్రెరా ఎస్’@1.82 కోట్లు
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. భారత మార్కెట్లో తన 911 పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజాగా ఈ రేంజ్లో మరో రెండు అధునాతన కార్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘911 కార్రెరా ఎస్’ పేరిట విడుదలైన విలాసవంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ.1.82 కోట్లు కాగా.. ‘911 కార్రెరా ఎస్ కాబ్రియోలెట్’ పేరుతో విడుదలైన మరో కారు ధర రూ.1.99 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. వెనుక ఇంజిన్ కలిగిన ఈ మోడల్ కార్లు అధునాతనంగా రూపుదిద్దుకుని మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఈ సందర్భంగా పోర్షే ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి మాట్లాడుతూ.. ‘మొదటి తరం మాదిరిగానే 911 స్పోర్ట్స్ కార్లు కూడా యువతరం కోసం రూపుదిద్దుకున్నాయి. ఈ కార్ల ఎంట్రీతో మా కంపెనీ చిహ్నం మరింత చొచ్చుకుపోనుంది. మునుపటికంటే శక్తివంతమైన, సమర్థవంతమైన నూతన కార్లు రూపొందాయి. 450 హెచ్పీతో అందుబాటులోకి వచ్చాయి’ అన్నారు. -
దేశీ మార్కెట్లోకి రూ 1.19 కోట్ల పోర్షే కారు
సాక్షి, ముంబై : భారత మార్కెట్లో పోర్షే ఎస్యూవీ మోడల్ లేటెస్ట్ జనరేషన్ కయానే లాంఛ్ అయింది. కస్టమర్లు కయానే, కయానే ఈ హైబ్రిడ్, కయానే టర్బో వంటి మూడు మోడల్స్ నుంచి తమకు నచ్చిన మోడల్‌ను ఎంచుకోవచ్చు. ముంబైలోని సహారా స్టార్ హోటల్లో ప్రతిష్టాత్మక ఎస్యూవీను పోర్షే ఇండియా అట్టహాసంగా లాంఛ్ చేసింది. ఈ ప్రోడక్ట్ లాంఛ్ సందర్భంగా మూడు మోడల్స్‌నూ ప్రదర్శించారు. కొత్త కయానేలో అత్యాధునిక రియర్ యాక్సిల్ స్టీరింగ్, షార్పర్ డిజైన్, మెరుగైన ఛేసిస్ సిస్టమ్స్‌తో అద్భుత సామర్థ్యంతో లేటెస్ట్ ఫీచర్లను పొందుపరిచారు. ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టివిటీ ఫీచర్స్‌ను అదనంగా సమకూర్చారు. కయానే టర్బో కేవలం 3.9 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, వార్న్, బ్రేక్ అసిస్ట్ సిస్టమ్స్, క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్స్‌ను పొందుపరిచారు. భారత్‌లోని అన్ని పోర్షే షోరూమ్స్‌లో కయానే, కయానే ఈ హైబ్రిడ్, కయానే టర్బోలు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే ఈ కార్ల బుకింగ్ ప్రారంభం కాగా కయానే రూ 1.19 కోట్లు, కయానే ఈ హైబ్రిడ్ రూ 1.58 కోట్లు, కయానే టర్బో రూ 1.92 కోట్లు ధర పలుకుతోంది. -
పోర్షే ‘911 జీటీ3’@ రూ.2.31 కోట్లు
ముంబై: అంతర్జాతీయ దిగ్గజ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘పోర్షే’.. తన 911 పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇది తాజాగా ‘911 జీటీ3’ కారును భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.31 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్ ఇండియా) ఉంది. 4 లీటర్– 6 సిలిండర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ టూ–సీటర్ మోడల్.. 7 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ‘భారత్‌లో స్పోర్ట్స్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 911 జీటీ3 కారును ఆవిష్కరిస్తున్నాం. ఇది రేస్ట్రాక్, రోడ్డుకు మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేస్తుందని భావిస్తున్నాం’ అని పోర్షే ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న పోర్షే సెంటర్లలో 911 జీటీ3 మోడల్ లభిస్తుందని పేర్కొన్నారు. -
పోర్షే ‘మకాన్’ @77 లక్షలు!
మార్కెట్లోకి కొత్త వేరియంట్... ముంబై: పోర్షే కార్లను లగ్జరీకి పర్యాయ పదంగా చెప్పుకోవచ్చు. జర్మనీకి చెందిన ఈ లగ్జరీ స్పోర్ట్స కార్ల తయారీ కంపెనీ తాజాగా తన కాంపాక్ట్ ఎస్యూవీ ‘మకాన్’లో ‘ఆర్ 4’ అనే కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. అందుబాటు ధరలో కంపెనీ నుంచి వస్తోన్న కొత్త కారుగా ఇది వినియోగదారులకు చేరువకానుంది. దీని ధర రూ.76.84 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ముంబై) ఉంది. ‘మకాన్ ఆర్4’లో 7 స్పీడ్ పీడీకే డ్యూయెల్ క్లచ్ ట్రాన్సమిషన్, 2 లీటర్ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్, కొత్త జనరేషన్ పోర్షే కమ్యూనికేషన్ మేనేజ్మెంట్, వినూత్నమైన ఇంటీరియర్ ఫీచర్లు, అదిరిపోయే ఎక్స్టీరియర్ డిజైన్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఇది 0-100 కిలోమీటర్ల వేగాన్ని 6.7 సెకన్లలో అందుకుంటుందని తెలిపింది. కారు గరిష్ట వేగం గంటకు 229 కిలోమీటర్లుగా ఉంది. దేశంలోని పోర్షే డీలర్లు ఇప్పటికే రూ.10 లక్షల అడ్వాన్సతో ‘ఆర్ 4’ బుకింగ్సను ప్రారంభించారు. కాగా మకాన్ పోర్ట్‌ఫోలియోలో వస్తున్న నాల్గవ మోడల్ ఇది. -
'అతడి మరణానికి మేము కారణం కాదు'
లాస్ ఏంజెలెస్: 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' నటుడు పాల్ వాకర్ మరణానికి అతడే కారణమని ప్రముఖ కార్ల తయారీ సంస్థ 'పోర్షె' ఉత్తర అమెరికా విభాగం తెలిపింది. స్వయంకృతం వల్లె కారు ప్రమాదంలో అతడు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించింది. ఈ మేరకు గతవారం కోర్టుకు నివేదిక సమర్పించింది. పాల్ వాకర్ ప్రమాదానికి గురైన కారు 2005 కెరీరా జీటీ గురించి అతడికి క్షుణ్నంగా తెలుసునని పేర్కొంది. ఈ కారు వినియోగించడం వల్ల తలెత్తే అపాయం, ప్రమాదాల గురించి అతడికి పూర్తి అవగాహన ఉందని వెల్లడించింది. కారు గురించి అన్ని తెలుసుకుని స్వచ్ఛందంగా దాన్ని ఉపయోగించారని తెలిపింది. అతడి మరణానికి తాము ఏ రకంగానూ కారణం కాదని పోర్షె స్పష్టం చేసింది. తన తండ్రి మరణానికి పోర్షె కారణమని ఆరోపిస్తూ పాల్ వాకర్ కుమార్తె మీడో(16) రెండు నెలల క్రితం కోర్టులో దావా వేసింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి పోర్షె వివరణయిచ్చింది. 2013, నవంబర్ లో జరిగిన కారు ప్రమాదంలో పాల్ వాకర్, అతడి స్నేహితుడు రోజర్ రోడ్స్ మృతి చెందారు.