
ముంబై: అంతర్జాతీయ దిగ్గజ స్పోర్ట్స్ కార్ల తయారీ కంపెనీ ‘పోర్షే’.. తన 911 పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. ఇది తాజాగా ‘911 జీటీ3’ కారును భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ప్రారంభ ధర రూ.2.31 కోట్లుగా (ఎక్స్‌షోరూమ్ ఇండియా) ఉంది. 4 లీటర్– 6 సిలిండర్ ఇంజిన్‌తో రూపొందిన ఈ టూ–సీటర్ మోడల్.. 7 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.
‘భారత్‌లో స్పోర్ట్స్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 911 జీటీ3 కారును ఆవిష్కరిస్తున్నాం. ఇది రేస్‌ట్రాక్, రోడ్డుకు మధ్య ఉన్న అంతరాన్ని చెరిపేస్తుందని భావిస్తున్నాం’ అని పోర్షే ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న పోర్షే సెంటర్లలో 911 జీటీ3 మోడల్ లభిస్తుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment