
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే.. భారత మార్కెట్లో తన 911 పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. తాజాగా ఈ రేంజ్‌లో మరో రెండు అధునాతన కార్లను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘911 కార్రెరా ఎస్’ పేరిట విడుదలైన విలాసవంతమైన స్పోర్ట్స్ కారు ధర రూ.1.82 కోట్లు కాగా.. ‘911 కార్రెరా ఎస్ కాబ్రియోలెట్’ పేరుతో విడుదలైన మరో కారు ధర రూ.1.99 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. వెనుక ఇంజిన్ కలిగిన ఈ మోడల్ కార్లు అధునాతనంగా రూపుదిద్దుకుని మార్కెట్లోకి ప్రవేశించినట్లు తెలిపింది.
ఈ సందర్భంగా పోర్షే ఇండియా డైరెక్టర్ పవన్ శెట్టి మాట్లాడుతూ.. ‘మొదటి తరం మాదిరిగానే 911 స్పోర్ట్స్ కార్లు కూడా యువతరం కోసం రూపుదిద్దుకున్నాయి. ఈ కార్ల ఎంట్రీతో మా కంపెనీ చిహ్నం మరింత చొచ్చుకుపోనుంది. మునుపటికంటే శక్తివంతమైన, సమర్థవంతమైన నూతన కార్లు రూపొందాయి. 450 హెచ్‌పీతో అందుబాటులోకి వచ్చాయి’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment