
న్యూఢిల్లీ: వినియోగదారులకు సేవలు అందించే విషయంలో ఎంజీ ఇండియా వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచినట్టు జేడీ పవర్ తెలిపింది. ఇండియా కస్టమర్ సర్వీసెస్ ఇండెక్స్ అధ్యయనాన్ని నీల్సన్ ఐక్యూ భాగస్వామ్యంతో జేడీ పవర్ నిర్వహించింది.
సర్వీస్ అభ్యర్థనల ధ్రువీకరణ, సర్వీస్‌కు ముందు, సర్వీస్‌కు తర్వాత కస్టమర్ల అభిప్రాయం, ఎప్పటికప్పుడు సర్వీస్‌కు సంబంధించి తాజా సమాచారం అందించే విషయంలో ఎంజీ ఇండియా సేవల పట్ల ఎక్కువ మంది కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంజీ ఇండియా 25 ఇండెక్స్ పాయింట్లు (మొత్తం 1,000 పాయింట్ల స్కేల్‌పై) పెంచుకుంది.
సర్వీసు నాణ్యత బాగుందని 80 శాతం మంది కస్టమర్లు చెప్పారు. ఇండెక్స్‌లో ఎంజీ ఇండియా అత్యధికంగా 860 స్కోర్ సంపాదించింది. హోండా 852, టయోటా 852 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment