న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న చెక్ కంపెనీ స్కోడా.. భారత మార్కెట్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎన్యాక్ ఐవీ మోడల్‌ను ప్రవేశపెట్టనుంది. పూర్తిగా తయారైన కారును దిగుమతి చేసుకుంటామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పెటర్ సాక్ తెలిపారు. అమ్మకాలు పెరిగిన తర్వాత దేశీయంగా తయారీ చేపడతామన్నారు. ‘కంపెనీకి టాప్–3 మార్కెట్లలో భారత్ ఒకటి. యూరప్ వెలుపల అతిపెద్ద మార్కెట్ కూడాను.
మరిన్ని ఇంటర్నల్ కంబషన్ ఇంజన్ వాహనాలతోపాటు ఈవీలను సైతం భారత్‌కు పరిచ యం చేస్తాం. గతేడాది దేశంలో 57,721 యూ నిట్లు విక్రయించాం. 2021తో పోలిస్తే రెండింతలకుపైగా వృద్ధి సాధించాం. 2023లో రెండంకెల వృద్ధి నమోదు చేస్తాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment