న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ స్కోడా తాజాగా కుషాక్ మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇండియా 2.0 ప్రాజెక్ట్ కింద రూపొందించిన ఈ తొలి మోడల్ ద్వారా కంపెనీ మిడ్ సైజ్ ఎస్‌యూవీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. వేరియంట్‌నుబట్టి ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.10.5 లక్షల నుంచి రూ.17.6 లక్షల వరకు ఉంది. 1 లీటర్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్లతో 6 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్‌తోపాటు 7 స్పీడ్ డీఎస్‌జీ ట్రాన్స్‌మిషన్ రకాలతో వాహనం తయారైంది. హిల్ హోల్డ్ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటర్ సిస్టమ్, ఆరు వరకు ఎయిర్‌బ్యాగ్స్ వంటివి అదనపు హంగులు. జూలై 12 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది 30,000, వచ్చే సంవత్సరం 60,000 యూనిట్ల అమ్మకం లక్ష్యంగా చేసకున్నట్టు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ జాక్ హోలిస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment