హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ ఈ ఏడాది భారత్‌లో విడుదల చేయనున్న చిన్న ఎస్‌యూవీకి ఎక్స్‌టర్‌గా నామకరణం చేసింది. ఈ మేరకు టీజర్‌ను విడుదల చేసింది. జూలైలో ఉత్పత్తి ప్రారంభం కానుంది. ఆగస్ట్ నుంచి మార్కెట్లో అడుగు పెట్టనుందని సమాచారం.
దక్షిణ కొరియాతోపాటు పలు దేశాల్లో అమ్ముడవుతున్న ఏఐ3 (క్యాస్పర్) మోడల్‌కు స్వల్ప మార్పులతో ఇక్కడ ప్రవేశపెట్టనున్నారు. ఈ వాహనం భారత్ కోసం తయారు చేస్తున్నారు. భవిష్యత్‌లో పొరుగున ఉన్న దేశాలకూ ఎగుమతి చేస్తారు. గ్రాండ్ ఐ10 నియోస్ ప్లాట్‌ఫామ్‌పై దీనిని అభివృద్ధి చేస్తున్నారు. 1.0 లీటర్ టీ–జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజన్, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లతో తయారు కానుంది.
Comments
Please login to add a commentAdd a comment