Hyundai Venue Knight Edition హ్యుందాయ్ తన కస్టమర్ల కోసం స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. 23 కొత్త ఫీచర్లతో హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ దరను రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. టాప్ వేరియంట్ ఎడిషన్ ధర రూ. 13.48 లక్షలుగా ఉంటుంది. స్పెషల్ ఎడిషన్ SUV S(O) , SX వేరియంట్‌లకు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 1.2 l కప్పా పెట్రోల్ ఇంజన్ అమర్చింది. SX(O) వేరియంట్ కోసం 6MT, 7DCTతో 1.0 l T-GDi పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. వెన్యూ నైట్ ఎడిషన్ 4 మోనోటోన్ , 1 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, ఫియరీ రెడ్ అండ్ ఫియరీ రెడ్ విత్ అబిస్ బ్లాక్ కలర్స్‌లో కొత్త వెన్యూ నైట్ ఎడిషన్ లభ్యం.
హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ 23 ప్రత్యేక ఫీచర్లను అందిస్తోంది. ముఖ్యంగా బ్లాక్ పెయింటెడ్ ఫ్రంట్ గ్రిల్, హ్యుందాయ్ లోగో, బ్రాస్ కలర్ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ ఇన్‌సర్ట్‌లు, ఫ్రంట్ వీల్స్‌పై బ్రాంచ్ కలర్ ఇన్సర్ట్‌లు, బ్రాంచ్ రూఫ్ రైల్ ఇన్‌సర్ట్‌లు, డార్క్ క్రోమ్ రియర్ హ్యుందాయ్ లోగో,వెన్యూ ఎంబ్లం, నైట్ ఎంబ్లం, బ్లాక్ ఉన్నాయి. పెయింట్ చేయబడిన రూఫ్ రెయిల్‌లు, షార్క్-ఫిన్ యాంటెన్నా, ORVMలు, రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లు, బ్లాక్ పెయింటెడ్ అల్లాయ్ వీల్/వీల్ కవర్, బ్లాక్ ఫ్రంట్ అండ్ రియర్ స్కిడ్ ప్లేట్‌లతో పాటు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రధానంగా ఉన్నాయి.
వెన్యూ నైట్ ఎడిషన్ 82 bhp 1.2-లీటర్ పెట్రోల్ ఇంజీన్, 118 bhp 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ రెండింటితో అందుబాటులో ఉంది. స్టాండర్డ్ వెన్యూ , వెన్యూ ఎన్-లైన్ లా కాకుండా, టర్బో-పెట్రోల్ యూనిట్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో కొత్త ఎడిషన్ తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్‌లు iMTని పొందుతాయి. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇక ఇంటీరియర్‌ల విషయానికి వస్తే, హ్యుందాయ్ వెన్యూ నైట్ ఎడిషన్ బ్రాస్ కలర్ ఇన్‌సర్ట్‌లతో బ్లాక్ ఇంటీరియర్, బ్రాస్ కలర్ హైలైట్‌లతో ప్రత్యేకమైన బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ, డ్యుయల్ కెమెరాతో డాష్‌క్యామ్, స్పోర్టీ మెటల్ పెడల్స్, ECM IRVM , 3D డిజైనర్ మ్యాట్‌లను పొందుపర్చింది. టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, రెనాల్ట్ కిగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది.
Comments
Please login to add a commentAdd a comment