Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అదిరిపోతున్న కొత్త వేరియంట్‌ | Hyundai launches updated Venue E plus with electric sunroof | Sakshi
Sakshi News home page

Hyundai Venue E+: ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అదిరిపోతున్న కొత్త వేరియంట్‌

Published Sat, Sep 7 2024 7:30 PM | Last Updated on Sat, Sep 7 2024 7:40 PM

Hyundai launches updated Venue E plus with electric sunroof

హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ అప్‌డేట్ చేసిన ‘వెన్యూ ఈప్లస్‌’ (Hyundai Venue E+) వేరియంట్‌ను  భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దీని ధర రూ. 8.23 ​​లక్షలతో ప్రారంభమవుతుంది. కొత్త వేరియంట్‌ జోడింపుతో ఈ లైనప్‌లో 
మొత్తం వెన్యూ వేరియంట్‌ల సంఖ్య పదికి చేరింది.

‘వెన్యూ ఈప్లస్‌’ మోడల్‌ను ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్, రియర్ హెడ్‌రెస్ట్‌ వంటి సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్‌ చేశారు. ఇక కార్‌ ఇంటీరియర్‌ విషయానికి వస్తే 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు, వీటికి టూస్టెప్‌ రిక్లైన్ ఫంక్షన్ ఇచ్చారు. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రయాణికులకు భద్రత కల్పిస్తాయి. డే అండ్‌ నైట్‌ అడ్జస్టబుల్ ఇన్‌సైడ్‌ రియర్‌ వ్యూ మిర్రర్‌, ప్యాసింజర్లు అందరికీ త్రీ-పాయింట్ సీట్ బెల్ట్, ఈఎస్‌సీ,  హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక ఇంజిన్‌ గురించి చెప్పుకోవాలంటే ‘వెన్యూ ఈప్లస్‌’ 1.2-లీటర్ ఎన్‌ఏ పెట్రోల్ ఇంజన్‌తో ఐదు-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే.. 82 బీహెచ్‌పీ, 114 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హ్యుందాయ్ వెన్యూలో ఇప్పటికే ఈ, ఎస్‌, ఎస్‌ ప్లస్, ఎస్‌ (O), ఎగ్జిక్యూటివ్, ఎస్‌ (O) ప్లస్, ఎస్‌ఎక్స్‌, నైట్ ఎడిషన్, ఎస్‌ఎక్స్‌ ( O) వేరియంట్లు ఉన్నాయి. కొత్త ఈప్లస్‌ మోడల్‌ కావాలంటే ‘వెన్యూ ఈ’ వేరియంట్‌పై రూ. 29,000 అదనంగా ఖర్చవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement