Audi Q8 special edition: పండుగల సీజన్ సందర్భంగా లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. తాజాగా క్యూ8లో స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,18,46,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మైథోస్ బ్లాక్, గ్లేషియర్ వైట్, డేటోనా గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. పరిమిత సంఖ్యలోనే ఈ ఎస్‌యూవీల విక్రయాలు ఉంటాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ)
3.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్‌ను పొందుతుంది ఇది కేవలం 5.9 సెకన్లలో సున్నా నుండి 100kmph వరకు వేగవంతం చేస్తుంది మరియు గరిష్టంగా 250kmph వేగాన్ని అందుకోగలదు. ఎక్ట్సీరియర్‌లో, S-లైన్ ఎక్స్టీరియర్ ప్యాకేజీ , బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో Q8 స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించింది.
క్యాబిన్ 'ఏరో-అకౌస్టిక్స్'ని కలిగి ఉన్న అధిక-నాణ్యత క్యాబిన్‌తో, 4 జోన్ ఏసీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, 21 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్ మొదలైన ప్రత్యేకతలు ఈ ఎస్‌యూవీలో ఉన్నట్లు ధిల్లాన్ తెలిపారు. తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఇది విశిష్టమైన ఎస్యూవీ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment