Audi India
-
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
ఆడి కార్ల అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి గడిచిన తొమ్మిది నెలల్లో రికార్డు స్థాయిలో కార్లను విక్రయించింది. వార్షిక ప్రాతిపదికన ఈ జనవరి –సెప్టెంబర్ మధ్య 88% వృద్ధితో మొత్తం 5,530 కార్లను అమ్మినట్లు కంపెనీ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంలో 2,947 కార్లను డెలివరీ చేసింది. క్యూ8 ఈ–ట్రాన్, క్యూ8 స్పోర్ట్‌బ్యాక్ ఈ–ట్రాన్, క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్లతో పాటు ఏ4, ఏ6, క్యూ5 మోడళ్లకు కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభించినట్లు తెలిపింది. ‘‘ఎస్‌యూవీల విభాగపు అమ్మకాల వృద్ధి 187% నమోదైంది. రానున్న పండుగ సీజన్ కారణంగా నెలకొనే డిమాండ్‌తో ఈ ఏడాది మొత్తం విక్రయాల వృద్ధిని కొనసాగిస్తాము’’ అని ఆడి ఇండియా అధినేత బల్బీర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బలమైన డిమాండ్, లగ్జరీ కార్ల మార్కెట్ విస్తరణతో పాటు మెరుగైన ఆర్థిక స్థితిగతులు కార్ల అమ్మకాల పెరుగుదలకు కారణమయ్యాయని బల్బీర్ సింగ్ వివరించారు. -
ఆడి క్యూ8 స్పెషల్ ఎడిషన్, ధర చూస్తే..!
Audi Q8 special edition: పండుగల సీజన్ సందర్భంగా లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి ఇండియా స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. తాజాగా క్యూ8లో స్పెషల్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ. 1,18,46,000 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మైథోస్ బ్లాక్, గ్లేషియర్ వైట్, డేటోనా గ్రే రంగుల్లో ఇవి లభిస్తాయి. పరిమిత సంఖ్యలోనే ఈ ఎస్‌యూవీల విక్రయాలు ఉంటాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. (10 శాతం జీఎస్టీ?ఇక డీజిల్ కార్లకు చెక్? నితిన్ గడ్కరీ క్లారిటీ) 3.0-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ మోటార్‌ను పొందుతుంది ఇది కేవలం 5.9 సెకన్లలో సున్నా నుండి 100kmph వరకు వేగవంతం చేస్తుంది మరియు గరిష్టంగా 250kmph వేగాన్ని అందుకోగలదు. ఎక్ట్సీరియర్‌లో, S-లైన్ ఎక్స్టీరియర్ ప్యాకేజీ , బ్లాక్ స్టైలింగ్ ప్యాకేజీతో Q8 స్పెషల్ ఎడిషన్‌ను రూపొందించింది. క్యాబిన్ 'ఏరో-అకౌస్టిక్స్'ని కలిగి ఉన్న అధిక-నాణ్యత క్యాబిన్‌తో, 4 జోన్ ఏసీ, ప్రీమియం సౌండ్ సిస్టమ్, 21 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఇంటీరియర్స్ మొదలైన ప్రత్యేకతలు ఈ ఎస్‌యూవీలో ఉన్నట్లు ధిల్లాన్ తెలిపారు. తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఇది విశిష్టమైన ఎస్యూవీ అని ఆయన పేర్కొన్నారు. -
దూసుకెళ్తున్న ఆడి కార్లు.. డబుల్ డిజిట్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా ఈ ఏడాది రెండంకెల బలమైన వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేస్తోంది. ‘2023 జనవరి–జూన్‌లో 97 శాతం వృద్ధితో 3,500 యూనిట్లు విక్రయించాం. ఎస్‌యూవీలు 200 శాతం, స్పోర్ట్స్ కార్ల విభాగం 127 శాతం అధిక అమ్మకాలను సాధించాయి. దేశవ్యాప్తంగా ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో ప్యాసింజర్ వాహన పరిశ్రమ వృద్ధి 20 శాతం మాత్రమే. జూలైలోనూ మెరుగైన విక్రయాలు నమోదు చేశాం’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. కాగా, కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్ ఎస్యూవీ క్యూ8 ఈ–ట్రాన్ విడుదల చేసింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.1.14 కోట్ల నుంచి ప్రారంభం. 50, 55 ట్రిమ్స్‌లో లభిస్తుంది. ట్రిమ్నుబట్టి ఒకసారి చార్జింగ్‌తో 491–600 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 55 ట్రిమ్ గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 5.5 సెకన్లలో అందుకుంటుంది. -
జోరుగా ఆడి కార్ల విక్రయాలు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇండియా మార్చి త్రైమాసికంలో 1,950 యూనిట్లను విక్రయించింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో విక్రయాలు 862 యూనిట్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో 16 మోడళ్లు వచ్చి చేరాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. బలమైన ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నామని, తమ మొత్తం విక్రయాల్లో ఎస్యూవీ వాటా 60%గా ఉన్నట్టు చెప్పారు. కొత్తగా విడుదల చేసిన క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌కు దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ కనిపిస్తున్నట్టు తెలిపారు. మంచి వృద్ధి మార్గంలో ఉన్నామని, 2023లోనూ బలమైన పనితీరు చూపిస్తామనే నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రీఓన్డ్ (అప్పటికే మరొకరు వినియోగించిన) కార్ల వ్యాపారాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 ప్రీఓన్డ్ కార్ల ఔట్లెట్లను ఆడి నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివరికి వీటి సంఖ్యను 25కు చేరుస్తామని దిల్లాన్ తెలిపారు. -
తొమ్మిది నెలల్లో 2,947 కార్లు: ఆడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న ఆడి ఇండియా ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 2,947 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29 శాతం వృద్ధి. ఏ8, క్యూ7 మోడళ్లు ఈ వృద్ధిని నడిపించాయని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ–ట్రాన్ శ్రేణి, ఏ4, ఏ6, క్యూ5, ఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ శ్రేణి మోడళ్లకు సైతం డిమాండ్ ఉందని వెల్లడించింది. ప్రీ–ఓన్డ్ కార్ల వ్యాపారం అయిన ఆడి అప్రూవ్డ్ ప్లస్ 73 శాతం వృద్ధి నమోదు చేసిందని తెలిపింది. సెమీకండక్టర్ల కొరతతోపాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా సమస్యలు ఉన్నప్పటికీ బలమైన వృద్ధి సాధించడం బ్రాండ్, విస్తృత ఉత్పత్తులపట్ల కస్టమర్ల ఉత్సాహాన్ని పునరుద్ఘాటిస్తుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. స్థిర డిమాండ్ నేపథ్యంలో ప్రస్తుత పండుగల సీజన్లో మెరుగైన వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఆడి అప్రూవ్డ్ ప్లస్ కేంద్రాలు ప్రస్తుతం 18 ఉన్నాయి. డిసెంబర్ నాటికి మరో నాలుగు జోడించనున్నారు. -
‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మోడల్స్‌పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి. కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. -
మెర్సిడెస్ బెంజ్ ప్రియులకు షాక్..!
ప్రముఖ జర్మనీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కారు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి తన మొత్తం మోడల్ కార్ల ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు నేడు సంస్థ తెలిపింది. ఇన్ పుట్ ఖర్చుల పెరుగుదలే ఇందుకు ప్రధాన కారణం అని కంపెనీ పేర్కొంది. కారు మోడల్ బట్టి రూ.50,000 నుంచి రూ.5 లక్షల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు సంస్థ తెలిపింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. "మెర్సిడెస్ బెంజ్ వినియోగదారులకు సాటిలేని అనుభూతిని అందించడం కోసం అత్యంత అధునాతన సాంకేతికతను అందిస్తున్నాము. అయితే, వ్యాపారాన్ని స్థిరంగా నడపడానికి ఇన్ పుట్, కార్యాచరణ ఖర్చులలో నిరంతర పెరుగుదలను భర్తీ చేయడానికి ధరల దిద్దుబాటు అవసరం" అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండి & సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఆడి ఇండియా ఏప్రిల్ 1 నుంచి 3 శాతం వరకు తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. (చదవండి: హ్యాకర్ల దెబ్బకు వణికిపోతున్న రష్యా.. వెబ్సైట్లు డౌన్.!) -
ఎలక్ట్రిక్ కార్లపై సుంకం తగ్గించండి: ఆడి కంపెనీ
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ "ఆడి" భారతదేశంలో దిగుమతి చేసుకున్న కార్లపై అధిక పన్ను విధించడం అనేది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లను అడ్డుకోవడం అని పేర్కొంది. అలాగే, సుంకాల పరంగా కొంత ఉపశమనం కలిగిస్తే మరిన్ని వాహనాలను విక్రయించడానికి, స్థానిక తయారీ కోసం దేశంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి సహాయపడుతుందని సంస్థ పేర్కొంది. పీటీఐతో ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. దేశంలోకి దిగుమతి చేసుకున్న మొదటి సెట్ ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీ విక్రయించినట్లు పేర్కొన్నారు.(చదవండి: నిరుద్యోగులకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీపికబురు!) "దేశంలోకి తీసుకువచ్చిన మొదటి ఈ-ట్రాన్లు అన్నీ అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు. భారత దేశంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి సిద్దంగా ఉన్నారు. అందుకే, భవిష్యత్ లో ఇలాంటి కార్లను మరిన్ని తీసుకొనిరావడానికి మేము సిద్దంగా ఉన్నాము" అని ఆయన పేర్కొన్నాడు. "ఇంపోర్ట్ డ్యూటీ తక్కువగా ఉంటే బహుశా మేము దేశంలో ఎక్కువ ఎలక్ట్రిక్ కార్లను విక్రయించవచ్చు" అని ధిల్లాన్ చెప్పాడు. "దిగుమతి సుంకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వానికి మా అభ్యర్థన, 3-5 ఏళ్ల వరకు కొంత ఉపశమనం ఇస్తే, స్థానికంగా కార్లను తయారు చేయడానికి దేశంలో మరింత పెట్టుబడి పెట్టడానికి మా ప్రధాన కార్యాలయాన్ని ఒప్పించడానికి మాకు సహాయపడుతుంది" అని అన్నారు. -
ఆడి నయా వర్షన్ అదరహో
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత విపణిలోకి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ సెడాన్ కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్ చేసింది. భారత్‌లో ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్‌ను 2017 లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్5 నయా మోడల్ అప్డేటెడ్ వర్షన్‌గా రానుంది. దీని ధర రూ. 79.06 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఈ కారు మరింత ఆకర్షణీయమైన ఔటర్ డిజైనే కాకుండా, అప్డేట్ చేసిన క్యాబిన్‌తో రానుంది. కార్ ఎక్స్టీరియర్ విషయానికి వస్తే , ప్రస్తుత డిజైన్ స్పోర్టి లూక్‌తో రానుంది. ట్వీక్డ్ ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది, అంతేకాకుండా షార్ప్‌గా కనిపించే ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటుగా , డే టైమ్ రన్నింగ్ లైట్లతో( డిఆర్ఎల్) అమర్చారు. క్వాడ్-టిప్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది. కారు ఇంటిరియల్స్లో భాగంగా 10 అంగుళాల టచ్ స్క్రీన్ రానుంది. కారుకు 354 హార్స్‌పవర్‌ను అందించగల 3.0-లీటర్ ట్విన్-టర్బో, వి 6 పెట్రోల్ ఇంజన్ తో పాటు వస్తోంది. దీంతో కారుకు 500 ఏన్ఎమ్ గరిష్ట టార్క్ ను అందిస్తోంది. స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌లో భాగంగా 8-స్పీడ్ టిప్ట్రోనిక్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకుంటుంది. ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ టాప్ స్పీడ్ 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కారులో డైనమిక్, కంఫర్ట్, ఎఫిషియెన్సీ, ఆటో, ఇండివిజువల్‌తో సహా ఐదు డ్రైవింగ్ మోడ్‌లను ఏర్పాటు చేశారు. మెర్సిడెస్-ఎఎమ్‌జి సి 43, మెర్సిడెస్ బెంజ్ జిఎల్సి 43 ఎఎమ్‌జి, బీఎండబ్ల్యూ ఎం 340 ఐ వంటి ఇతర లగ్జరీ కార్లతో ఆడి ఎస్ 5 పోటీపడనుంది. (చదవండి: బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్.. రేటు ఎంతంటే? ) -
ఆటో.. రీస్టార్ట్..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి ఉద్దేశించిన లాక్డౌన్ దెబ్బతో మూతబడిన వ్యాపార కార్యకలాపాలను ఆటోమొబైల్ సంస్థలు క్రమంగా పునఃప్రారంభిస్తున్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్, మహీంద్రా, హోండా కార్స్ మొదలైన వాటి బాటలోనే మరికొన్ని సంస్థలు కూడా షోరూమ్‌లు తెరవడంతో పాటు ఆన్లైన్లో అమ్మకాలు చేపడుతున్నాయి. తాజాగా ఆడి ఇండియా, రెనో తదితర కంపెనీలు ఈ జాబితాలో చేరాయి. ఆడి ఇండియా: కస్టమర్లు ఇంటి నుంచి కదలకుండానే వాహన కొనుగోలు, సర్వీసింగ్ వంటి సేవలు పొందేందుకు వీలుగా ఆన్లైన్ సేల్స్, సర్వీస్ కార్యకలాపాలు ప్రారంభించింది. రెనో: ఫ్రాన్స్ ఆటోమొబైల్ దిగ్గజం రెనో భారత్‌లో తమ కార్పొరేట్ ఆఫీస్‌ను, కొన్ని డీలర్‌షిప్‌లు.. సర్వీస్ సెంటర్లను పునఃప్రారంభించింది. కొత్త భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా 194 షోరూమ్స్, వర్క్‌షాప్‌లను తిరిగి తెరిచినట్లు రెనో ఇండియా కార్యకలాపాల విభాగం సీఈవో వెంకట్రామ్ మామిళ్లపల్లె తెలిపారు. బజాజ్ ఆటో: మూడో ఫేజ్ లాక్డౌన్ నిబంధనల సడలింపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌లు, సర్వీస్ సెంటర్లను మే 4 నుంచి క్రమంగా తెరుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. హీరో: పంజాబ్, బీహార్‌లోని ప్లాంట్లను పునఃప్రారంభించినట్లు హీరో సైకిల్స్ వెల్లడించింది. మొత్తం సామర్థ్యంలో 30 శాతం మేర ఉత్పత్తి మొదలుపెట్టినట్లు వివరించింది. అలాగే స్వల్ప సిబ్బందితో కార్పొరేట్ ఆఫీస్‌ను కూడా తెరిచినట్లు సీఎండీ పంకజ్ ఎం ముంజల్ చెప్పారు. -
ఆడి కార్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ దారు ఆడి తన కార్ల ధరలపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు వెల్లడించింది. తన పాపులర్ మోడల్ కార్లపై మూడునుంచి పదిలక్షల దాకా తగ్గింపును అందిస్తున్నట్టు సోమవారం ప్రకటించింది. మార్కెట్లో సవాళ్లను అధిగమించేందుకు భారతదేశంలో ఎంపిక చేసిన మోడళ్లపై పరిమిత కాలానికి కస్టమర్ బెనిఫిట్ స్కీంను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆడి క్యూ3 తో పాటు, ప్రముఖ మోడల్స్ ఏ3, ఏ4, ఏ6 సెడాన్ల కార్ల కొనుగోళ్లపై రూ.2.7 లక్షల నుంచి రూ .10 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చని తెలిపింది. జూన్ వరకు ఈ తగ్గింపు ధరలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. దిగుమతి సుంకాలు , ప్రతికూలమైన పన్నులు తదితర కారణాలు కారును సొంతంచేసుకోవాలని కలలు కనే కస్టమర్‌కు ప్రతిబంధకం కాకూడదని తాము భావిస్తున్నామని ఆడి ఇండియా ప్రెసిడెంట్ రాహిల్ అన్సారీ చెప్పారు. ఈ పథకం కింద 2018లో కొనుగోలు చేసి 2019లో వినియోగదారులు చెల్లింపులు చేయవచ్చని తెలిపింది. మార్కెట్లో తాము ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి వ్యూహంలో భాగంగాగానే ఆ ఆఫర్ అని చెప్పింది. అంతేకాదు ఎంపిక చేసిన మోడల్‌కార్లపై ఆడి ఛాయిస్ పథకం కింద 57శాతం బై బ్యాక్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నట్టు వెల్లడించింది. 2016లో 7,720 యూనిట్లు విక్రయించగా, 2017 నాటికి 2 శాతం వృద్ధితో 7,876 యూనిట్లు విక్రయించామని ఆదివారం ప్రకటించింది. అయితే గత సంవత్సరం మే, జూన్ అమ్మకాలు మందగించడం, జీఎస్టీ సందర్భంగా విలాసవంతమైన కార్లపై భారీగా డిస్కౌంట్ల ఫలితంగా పుంజుకున్న అమ్మకాల నేపథ్యంలో ఆడి ఇండియా ఈ ఏడాది కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. 2018-19 బడ్జెట్లో, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్వదేశీ ఉత్పత్తులకు ప్రోత్సాహమిచ్చే దిశగా దిగుమతి సుంకాన్నిపెంచారు. సీకేడీ కార్లపై 10నుంచి 15 శాతం సుంకం పెంచగా మోటారు వాహనాలు, మోటారు కార్లు, మోటారు సైకిల్స్‌కు చెందిన విడిభాగాలపై 7.5నుంచి 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీని పెంచిన సంగతి తెలిసిందే. -
ఆడి ధరలు తగ్గాయ్..
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి ఇండియా’ తాజాగా తన వాహన ధరలను రూ.10 లక్షల దాకా తగ్గించింది. డీలర్ల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. వాహన ధరల తగ్గింపు రూ.50,000– రూ.10 లక్షల శ్రేణిలో ఉంది. కాగా ఈ ధరల తగ్గింపు జూన్ వరకు అందుబాటులో ఉండనుంది.