ఆడి నయా వర్షన్‌ అదరహో | Audi Launches New Version Of S5 Sedan Model | Sakshi
Sakshi News home page

ఆడి నయా వర్షన్‌ అదరహో

Published Mon, Mar 22 2021 1:34 PM | Last Updated on Mon, Mar 22 2021 1:51 PM

Audi Launches New Version Of S5 Sedan Model - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి భారత విపణిలోకి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్  సెడాన్‌ కొత్త వర్షన్‌ను సోమవారం లాంచ్‌ చేసింది. భారత్‌లో ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్‌ను  2017 లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఎస్‌5  నయా మోడల్  అప్‌డేటెడ్ వర్షన్‌గా రానుంది. దీని ధర రూ. 79.06 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌). ఈ కారు మరింత ఆకర్షణీయమైన  ఔటర్ డిజైనే  కాకుండా,  అప్‌డేట్ చేసిన క్యాబిన్‌తో రానుంది. కార్‌ ఎక్స్‌టీరియర్‌ విషయానికి వస్తే , ప్రస్తుత డిజైన్‌  స్పోర్టి లూక్‌తో రానుంది.  ట్వీక్డ్ ఫ్రంట్ ఎండ్‌ను కలిగి ఉంది, అంతేకాకుండా  షార్ప్‌గా  కనిపించే ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో పాటుగా , డే టైమ్‌ రన్నింగ్‌ లైట్లతో( డిఆర్‌ఎల్‌) అమర్చారు. క్వాడ్-టిప్ 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను కలిగి ఉంది.

కారు ఇంటిరియల్స్‌లో భాగంగా 10 అంగుళాల టచ్‌ స్క్రీన్‌ రానుంది. కారుకు 354 హార్స్‌పవర్‌ను అందించగల 3.0-లీటర్ ట్విన్-టర్బో, వి 6 పెట్రోల్ ఇంజన్ తో పాటు వస్తోంది. దీంతో కారుకు  500 ఏన్‌ఎమ్‌ గరిష్ట టార్క్ ను అందిస్తోంది. స్పీడ్‌ ట్రాన్స్మిషన్‌లో భాగంగా  8-స్పీడ్ టిప్ట్రోనిక్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంది. ఈ కారు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.8 సెకన్లలో అందుకుంటుంది. ఆడి ఎస్ 5 స్పోర్ట్‌బ్యాక్ టాప్ స్పీడ్ 250 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ కారులో  డైనమిక్, కంఫర్ట్, ఎఫిషియెన్సీ, ఆటో, ఇండివిజువల్‌తో సహా ఐదు డ్రైవింగ్ మోడ్‌లను ఏర్పాటు చేశారు. మెర్సిడెస్-ఎఎమ్‌జి సి 43, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి 43 ఎఎమ్‌జి, బీఎం‌డబ్ల్యూ ఎం 340 ఐ వంటి ఇతర లగ్జరీ కార్లతో ఆడి ఎస్ 5  పోటీపడనుంది.



(చదవండి: బెంట్లీ లగ్జరీ కారు నయా వర్షన్‌.. రేటు ఎంతంటే? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement