న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల సంస్థ ఆడి ఇండియా మార్చి త్రైమాసికంలో 1,950 యూనిట్లను విక్రయించింది. 2022 మొదటి మూడు నెలల కాలంలో విక్రయాలు 862 యూనిట్లతో పోలిస్తే మూడు రెట్లు పెరిగాయి. తమ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో 16 మోడళ్లు వచ్చి చేరాయని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. బలమైన ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నామని, తమ మొత్తం విక్రయాల్లో ఎస్‌యూవీ వాటా 60%గా ఉన్నట్టు చెప్పారు.
కొత్తగా విడుదల చేసిన క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్‌కు దేశవ్యాప్తంగా బలమైన డిమాండ్ కనిపిస్తున్నట్టు తెలిపారు. మంచి వృద్ధి మార్గంలో ఉన్నామని, 2023లోనూ బలమైన పనితీరు చూపిస్తామనే నమ్మకంతో ఉన్నట్టు పేర్కొన్నారు. ప్రీఓన్డ్ (అప్పటికే మరొకరు వినియోగించిన) కార్ల వ్యాపారాన్ని విస్తరిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 22 ప్రీఓన్డ్ కార్ల ఔట్‌లెట్లను ఆడి నిర్వహిస్తోంది. ఈ ఏడాది చివరికి వీటి సంఖ్యను 25కు చేరుస్తామని దిల్లాన్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment