న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్‌పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది.
మొత్తం మోడల్స్‌పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి.
కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment