Audi Q3 SUV
-
‘ఆడి’ లవర్స్‌కు అలర్ట్: నెక్ట్స్ మంత్ నుంచి
న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది. వచ్చే నెల నుంచి కార్ల ధరలను 2.4 శాతం పెంచనుంది. ఇన్పుట్, సప్లై చైన్ ఖర్చులు పెరగడం వల్ల ధరల పెంపు నిర్ణయం తీసుకున్నామని సంస్థ వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని ఆడి ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం మోడల్స్‌పై ధరలను వచ్చే నెలలో 2.4 శాతం వరకు పెంచనున్నట్లు ఆడి ఇండియా తాజాగా తెలిపింది. ఉత్పత్తి ఖర్చుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పేర్కొన్నారు. దీని ప్రకారం సెప్టెంబర్ 20 తర్వాత ఆడి కారు కొనుగోలు చేయాలంటే కనీసం రూ.84 వేలు ఎక్కువ ఖర్చుపెట్టాలి. కాగా ఆడి ఇండియా పెట్రోల్ మోడల్స్ A4, A6, A8 L, Q5, Q7, Q8, S5 స్పోర్ట్‌బ్యాక్, RS 5 స్పోర్ట్‌బ్యాక్ , RS Q8 మోడల్ కార్లను విక్రయిస్తోంది. ఇ-ట్రాన్ బ్రాండ్ క్రింద ఎలక్ట్రిక్ వెహికల్ పోర్ట్‌ఫోలియోలో ఇ-ట్రాన్ 50, ఇ-ట్రాన్ 55, ఇ-ట్రాన్ స్పోర్ట్‌బ్యాక్ 55, ఇ-ట్రాన్ జీటీ, ఆర్ఎస్ ఇ-ట్రాన్ జీటీ ఉన్నాయి. కంపెనీ ఇటీవల భారతదేశంలో లగ్జరీ కారు క్యూ3కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్‌లను ప్రారంభించింది. -
2023 ఆడి క్యూ3 బుకింగ్స్ షురూ, తొలి కస్టమర్లకు ఆఫర్లు
సాక్షి, ముంబై: లగ్జరీకార్ల సంస్థ ఆడి 2023 ఆడి క్యూ3ని పరిచయం చేసింది. లగ్జరీ ఎస్యూవీ ఆడి క్యూ3ని ముందస్తు బుకింగ్ కోసం అందుబాటులో ఉంచింది. రూ. 2 లక్షలు చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అయితేముందుగా బుక్ చేసిన కస్టమర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. (75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్ , బిగ్ ఇన్వెస్టర్‌గా అదానీ) వినూత్న డిజైన్,బెస్ల్ఇన్ క్లాస్ ఎమినిటీస్‌తో తమ బెస్ట్-సెల్లింగ్ మోడల్ కొత్త ఆడి క్యూ3ని దక్కించుకునేందుకు అద్భుత అవకాశమని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ వెల్లడించారు. వినియోగదారులు www.audi.inలో లేదా 'myAudi కనెక్ట్' యాప్ ద్వారా కారును ఆన్లైన్లో కాన్ఫిగర్ చేసి, ఆర్డర్ చేయవచ్చు. 2023 ఆడి క్యూ 3 2 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం ప్లస్ అండ్, టెక్నాలజీ, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను జోడించింది. (Moto G62 5G:మోటో కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్, స్పెషల్ ఎట్రాక్షన్ ఏంటంటే?) అలాగే, మొదటి 500 మంది కస్టమర్లు 2+3 సంవత్సరాల పాటు పొడిగించిన వారంటీతోపాటు 3 సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు ఉచిత సర్వీస్ ప్యాకేజీలాంటి ప్రయోజనాలు అందిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆడి కస్టమర్లకు ప్రత్యేక లాయల్టీ ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పార్కింగ్ ఎయిడ్ ప్లస్ రియర్ వ్యూ కెమెరాతో, స్పీడ్ లిమిటర్‌తో కూడిన క్రూయిజ్ కంట్రోల్ సిస్టమ్, ఎక్స్టీరియర్ మిర్రర్స్, పవర్-అడ్జస్టబుల్, హీటెడ్, పవర్ ఫోల్డింగ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ ఇంటర్ఫేస్,6-స్పీకర్ ఆడియో సిస్టమ్ అందిస్తోంది. 2023 ఆడి క్యూ3లో 2.0-లీటర్ ఫోర్-సిలిండర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ 190 పిఎస్, 320 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 7.3 సెకన్లలో గంటలకు వంద కిలోమీటర్లు వేగం పుంజుకుంటుంది. ప్రీమియమ్ ప్లస్ వేరియంట్లో 18-అంగుళాల 5 ఆర్మ్ స్టైల్ అల్లాయ్ వీల్స్, LED రియర్ కాంబినేషన్ ల్యాంప్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లు, పనోరమిక్ గ్లాస్ సన్‌రూఫ్, హై గ్లాస్ స్టైలింగ్ ప్యాకేజీ, 4-వే లంబార్ సపోర్ట్‌తో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. -
ఆడి క్యూ3 ఎస్యూవీ.. కొత్త వేరియంట్లు
ధరలు రూ. 29-38 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యూ3లో మూడు కొత్త వేరియంట్లను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త కార్లను 1968 సీసీ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ చెప్పారు. వీటిల్లో బేస్ వేరియంట్ ధర రూ.28.99 లక్షలని, మిడ్ వెర్షన్ ధర రూ.33.99 లక్షలని, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.37.50 లక్షలని(మూడు ఎక్స్ షోరూమ్ ధరలు, ఢిల్లీ) అని పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్లతో భారత లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో తమ కార్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో 3,139కు చేరాయని వివరించారు. మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఆడి కంపెనీ ఈ ఏడాది పది మోడళ్లను మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఆర్ఎస్ 6 అవాంట్ కారు(ధర రూ.1.35 కోట్లు), ఆర్8ఎల్ఎంఎక్స్, ఆడి టీటీ కూపే,ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కార్లను విడుదల చేసింది.