ఆడి క్యూ3 ఎస్‌యూవీ.. కొత్త వేరియంట్లు
ధరలు రూ. 29-38 లక్షల రేంజ్‌లో
న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యూ3లో మూడు కొత్త వేరియంట్లను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త కార్లను 1968 సీసీ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ చెప్పారు. వీటిల్లో బేస్ వేరియంట్ ధర రూ.28.99 లక్షలని, మిడ్ వెర్షన్ ధర రూ.33.99 లక్షలని, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.37.50 లక్షలని(మూడు ఎక్స్ షోరూమ్ ధరలు, ఢిల్లీ) అని పేర్కొన్నారు.
ఈ కొత్త వేరియంట్లతో భారత లగ్జరీ కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో తమ కార్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో 3,139కు చేరాయని వివరించారు. మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఆడి కంపెనీ ఈ ఏడాది పది మోడళ్లను మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఆర్‌ఎస్ 6 అవాంట్ కారు(ధర రూ.1.35 కోట్లు), ఆర్8ఎల్‌ఎంఎక్స్, ఆడి టీటీ కూపే,ఆర్‌ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కార్లను విడుదల చేసింది.