German luxury car company
-
మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఏఎంజీ సి63 ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.1.3 కోట్లని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ తెలిపింది. ఏఎంజీ క్లాస్‌లో భారత్‌లో తాము అందిస్తున్న పదో మోడల్ ఇదని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో లభించే ఈ 4.0 లీటర్ వీ8 బై-టర్బో ఇంజిన్ కారు ఇంతకు ముందటి మోడళ్లతో పోల్చితే 32 శాతం అధిక మైలేజీనిస్తుందని వివరించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో అందుకుంటుందని తెలిపారు. పెర్ఫామెన్స్ కార్ల సెగ్మెంట్లో ఈ కారుతో తమ స్థానం పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. -
మెర్సిడెస్ నుంచి మూడు లగ్జరీ కార్లు
న్యూఢిల్లీ : అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ... జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు మూడు కొత్త కార్లను మార్కెట్లో ఆవిష్కరించింది. ఎస్ 500 కూపే, ఏఎంజీ ఎస్ 63 కూపే, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ కార్లను వినియోగదారుల కోసం మార్కెట్లోకి తీసుకొచ్చింది. వీటి ధర రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల (ఢిల్లీ ఎక్స్ షోరూం) మధ్యలో ఉంది. ఎస్500 కూపే ధర రూ.2 కోట్లుగా, ఏఎంజీ ఎస్ 63 కూపే ధర రూ.2.60 కోట్లుగా, ఏఎంజీ జీ 63 ‘క్రేజీ కలర్’ ఎడిషన్ ధర రూ.2.17 కోట్లుగా ఉంది. 2015లో 15 మోడళ్లను భారత మార్కెట్లో ఆవిష్కరించాలనే ‘15 లో 15’ వ్యూహంలో భాగంగానే ఈ కార్లను మార్కెట్లోకి తె చ్చినట్లు కంపెనీ పేర్కొంది. అలాగే కంపెనీ వినియోగదారుల కోసం ‘డిజైనో’ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా నచ్చిన ప్రత్యేక రంగు, హై క్వాలిటీ ఇంటీరియర్స్ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు వంటి తదితర ఆప్షన్లను అందిస్తోంది. -
బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎస్యూవీ.. కొత్త వేరియంట్
ధర రూ.59.9 లక్షలు న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ తన స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్(ఎస్యూవీ)మోడల్ ఎక్స్3లో కొత్త వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్ పేరుతో అందిస్తున్న ఈ కొత్త వేరియంట్ ధర రూ.59.9 లక్షలని(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) కంపెనీ పేర్కొంది. 3-లీటర్ ఆరు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో అందిస్తున్న ఈ కారును చెన్నై ప్లాంట్‌లోనే అసెంబుల్ చేశామని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ చెప్పారు. డ్రైవింగ్ పరిస్థితులకు తగ్గట్లుగా ఎంచుకోవడానికి వీలయ్యేవిధంగా వివిధ మోడ్ల్స్తో కూడిన బీఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ స్విచ్ వంటి వినూత్నమైన ఫీచర్లు ఈ కారులో ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం బీఎండబ్ల్యూ ఎక్స్ల్స్3లో రెండు వేరియంట్లు (తాజాగా అందిస్తున్న బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్‌డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్, బీఎండబ్ల్యూ ఎక్స్3 డ్రైవ్ 20డి) అందిస్తున్నామని వాన్ పేర్కొన్నారు. -
ఆడి క్యూ3 ఎస్యూవీ.. కొత్త వేరియంట్లు
ధరలు రూ. 29-38 లక్షల రేంజ్లో న్యూఢిల్లీ : జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ క్యూ3లో మూడు కొత్త వేరియంట్లను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త కార్లను 1968 సీసీ డీజిల్ ఇంజిన్‌తో రూపొందించామని ఆడి ఇండియా హెడ్ జోయ్ కింగ్ చెప్పారు. వీటిల్లో బేస్ వేరియంట్ ధర రూ.28.99 లక్షలని, మిడ్ వెర్షన్ ధర రూ.33.99 లక్షలని, టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ.37.50 లక్షలని(మూడు ఎక్స్ షోరూమ్ ధరలు, ఢిల్లీ) అని పేర్కొన్నారు. ఈ కొత్త వేరియంట్లతో భారత లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో తమ అగ్రస్థానం మరింత పటిష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో తమ కార్ల విక్రయాలు 15 శాతం వృద్ధితో 3,139కు చేరాయని వివరించారు. మెర్సిడెస్ బెంజ్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవడానికి ఆడి కంపెనీ ఈ ఏడాది పది మోడళ్లను మార్కెట్లోకి తేవాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఇప్పటికే ఆర్ఎస్ 6 అవాంట్ కారు(ధర రూ.1.35 కోట్లు), ఆర్8ఎల్ఎంఎక్స్, ఆడి టీటీ కూపే,ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ కార్లను విడుదల చేసింది. -
బీఎండబ్ల్యూ గ్రాన్ టురిస్మో స్పోర్ట్ లైన్.. కొత్త వేరియంట్
ధర రూ. 39.9 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ 3 సిరీస్ గ్రాన్ ట్యురిస్మో స్పోర్ట్ లైన్ కారులో అప్డేటెడ్ వేరియంట్‌ను మంగళవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ వేరియంట్ పరిచయ ధర రూ.39.90 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ ఫిలిప్ వాన్ చెప్పారు. ఈ కొత్త వేరియంట్లో డ్రైవింగ్ పరిస్థితులను బట్టి వివిధ మోడ్ల డ్రైవింగ్‌ను ఎంచుకునే బీఎండబ్ల్యూ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ స్విచ్ వంటి ఫీచర్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో 12కు పైగా మోడళ్లను విక్రయిస్తున్నామని, వీటిల్లో ఎనిమిదింటిని చెన్నై ప్లాంట్‌లోనే అసెంబుల్ చేస్తున్నామని వివరించారు. 2007 నుంచి భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటివరకూ రూ.490 కోట్లు పెట్టుబడులు పెట్టింది. -
గ్రెనేడ్ల దాడిని తట్టుకునే బెంజ్ కారు
⇒ మెర్సిడెస్-బెంజ్ ఎస్ 600 గార్డ్ ⇒ ధర రూ.8.9 కోట్లు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్, ఎస్ 600 గార్డ్ మోడల్లో అప్డేటెడ్ వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. రైఫిల్స్ దాడిని, గ్రెనేడ్, ఇతర పేలుడు పదార్ధాల దాడులను తట్టుకోగలిగే కారు ధరలు రూ.8.9 కోట్ల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది. అత్యున్నత స్థాయి అధికారులు, పారిశ్రామిక వేత్తలు లాంటి హై ప్రొఫైల్ కస్టమర్ల కోసం దీనిని రూపొందించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. భారత్‌లో ఇప్పటికే ఇలాంటి రక్షణ కవచాన్ని కల్పించే గార్డ్ పోర్ట్‌ఫోలియో కార్లు.. ఈ-గార్డ్, ఎం-గార్డ్లను అందిస్తున్నామన్నారు. ఎస్ 600 గార్డ్ కారు కోసం ఇప్పటికే కొన్ని ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. కారు ప్రత్యేకతలు...: అత్యున్నత రక్షణ ఫీచర్లతో ఈ కారును అందిస్తున్నామని గార్డ్ పోర్ట్‌ఫోలియో సేల్స్ అధిపతి మార్కస్ రుబెన్బర్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన కారు ఇదని పేర్కొన్నారు. శక్తివంతమైన వీ12 ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారులో ఏర్మాటిక్ సస్పెన్షన్, ఇంటెలిజెంట్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఆటోమేటిక్ యాక్టివేషన్‌తో కూడిన ఫైర్ ఎక్స్టింగిషర్ సిస్టమ్ వంటి ఫీచర్లున్నాయి. 350 లీటర్ల బూట్ స్పేస్, ఎనర్గైజింగ్ మస్సాజ్ ఫంక్షన్, నైట్ వ్యూ అసిస్ట్ ప్లస్, ఎల్ఈడీ ఇంటెలిజెంట్ లైట్ సిస్టమ్, 7జీ-ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వంటి ఆకర్షణలున్నాయి. వెనక సీట్లను అవసరమైనప్పుడు మొబైల్ ఆఫీస్‌గా మార్చుకోవచ్చు. టైర్లు డ్యామేజీ అయినప్పటికీ, 80 కిమీ దూరం ప్రయాణించవచ్చు. 4 లేదా 5 సీట్ల వేరియంట్లలో లభ్యం. -
ఆడి ఆర్ఎస్ 7 @ రూ.1.40 కోట్లు
ముంబై: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి సూపర్ స్పోర్ట్స్ ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్ మోడల్లో తాజా వెర్షన్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ కారు ధర రూ.1.40 కోట్లు(ఎక్స్ షోరూమ్, ముంబై, ఢిల్లీ). గత ఏడాది మార్కెట్లోకి తెచ్చిన ఆడి ఆర్ఎస్ 7 స్పోర్ట్‌బ్యాక్‌కు మంచి స్పందన లభించిందని, ఈ తాజా వెర్షన్లో 4 లీటర్ల వీ8 ఇంజిన్(ట్విన్ టర్బో వీ8 4.0)ను అమర్చామని కంపెనీ తెలిపింది. హైబ్రిడ్ అల్యూమినియం డిజైన్‌తో ఈ కారును రూపొందించామని ఫలితంగా ఉక్కుతో తయారు చేసే కారు కంటే ఇది 15 శాతం బరువు తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఈ కారులో ఆడి మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ప్రత్యేక ఆకర్షణ అని వివరించారు. 100 కిమీ.కు 9.8 లీటర్ల ఇంధనం ఖర్చవుతుందని వివరించింది. -
ఆడి స్పోర్ట్స్ టీటీ.. కొత్త వేరియంట్
ధర రూ.60.34 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన స్పోర్ట్స్ కారు ఆడి టీటీలో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.60.34 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు. వచ్చే 5 నెలల్లో ఐదు కొత్త కార్లను భారత లగ్జరీ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని, దాంట్లో భాగంగా మొదటిగా ఈ కారును అందిస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమన పరిస్థితులున్నప్పటికీ, మంచి అమ్మకాలు సాధించామని జో కింగ్ చెప్పారు. 2013-14లో 10.126గా ఉన్న కార్ల విక్రయాలు 2014-15లో 12% వృద్ధితో 11,292కు పెరిగాయని పేర్కొన్నారు. భారత లగ్జరీ మార్కెట్లో తమ అగ్రస్థానాన్ని నిలుపుకున్నామని చెప్పారు. -
మార్చిలో ఆడి రికార్డ్ అమ్మకాలు
హైదరాబాద్: జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ, ఆడి ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో కార్లను విక్రయించింది.గత ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది మార్చి అమ్మకాలు 4.4 శాతం వృద్ధితో 1,77,950కు పెరిగాయని ఆడి కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తమ కంపెనీ చరిత్రలోనే ఒక్క నెలలో ఇంత అధిక సంఖ్యలో వాహనాలు విక్రయించడం ఇదే మొదటిసారని కంపెనీ డెరైక్టర్(సేల్స్ అండ్ మార్కెటింగ్) ల్యూకా డి మియో పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో తమ కార్ల విక్రయాలు 6 శాతం వృద్ధితో 4,38,250కు చేరాయని వివరించారు. వీటిల్లో ఏ3 కార్లు 44 శాతం, ఆడి క్యూ3 10 శాతం, ఆడి ఏ6 కార్ల వాటా 8 శాతమని తెలిపారు. అన్ని దేశాల్లో తమ కార్ల విక్రయాలు జోరుగా ఉన్నాయని పేర్కొన్నారు. వరుసగా 63 నెలల్లో తమ అమ్మకాలు వృద్ధిబాటలోనే ఉన్నాయని వివరించారు. -
మెర్సిడెస్ సీ-క్లాస్‌లో రెండు డీజిల్ వేరియంట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్.. సీ-క్లాస్ సెడాన్ మోడల్లో రెండు కొత్త వేరియంట్ల (డీజిల్) ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ‘సీ 220 సీడీఐ స్టైల్’ వేరియంట్ ధర రూ. 39.9 లక్షలు, ‘సీ 220 సీడీఐ అవాంట్గార్డె’ వేరియంట్ ధర రూ.42.9 లక్ష లుగా ఉంటుందని మెర్సిడెస్ పేర్కొంది. అలాగే సీ- క్లాస్ పెట్రోల్ కార్ల దేశీ ఉత్పత్తిని తమ చకన్ ప్లాంటులో ప్రారంభిస్తామని మెర్సిడెస్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఈబర్హార్డ్ కెర్న్ చెప్పారు. భారత్‌లో సీ 200 అవాంట్గార్డె పెట్రోల్ కార్ల ఉత్పత్తిని మూడు నెలలలోగా ప్రారంభిస్తామని తెలిపారు. -
మెర్సిడెస్-బెంజ్... సీఎల్ఏ క్లాస్ సెడాన్
ధర రూ. 31.5-35.9 లక్షలు న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ సీఎల్ఏ క్లాస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.31.5-35.9 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) అని మెర్సిడెస్-బెంజ్ ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. డీజిల్, పెట్రోల్ వేరియంట్లలో ఈ కారు లభిస్తుందని వివరించారు. ఈ కారు మంచి అమ్మకాలు సాధిస్తుందని నమ్మకం ఉందని, అందుకే భారత్‌లోనే ఈకారును ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో భారత్‌లో తమ అమ్మకాలు 50 శాతానికి పైగా వృద్ధి సాధించాయని, ఈ స్థాయి వృద్ధి మరే దేశంలోనూ లేదని వివరించారు. 2014లో 10,201 కార్లను విక్రయించామని, ఈ ఏడాది కూడా చెప్పుకోదగ్గ అమ్మకాలు సాధిస్తామని, విక్రయాల్లో రెండంకెల వృద్ధి అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది 10 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చామని, ఈ ఏడాది 15 కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తామని కెర్న్ వెల్లడించారు.