ఆడి స్పోర్ట్స్ టీటీ.. కొత్త వేరియంట్
ధర రూ.60.34 లక్షలు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన స్పోర్ట్స్ కారు ఆడి టీటీలో కొత్త వేరియంట్‌ను గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ.60.34 లక్షల(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)ని ఆడి ఇండియా హెడ్ జో కింగ్ తెలిపారు. వచ్చే 5 నెలల్లో ఐదు కొత్త కార్లను భారత లగ్జరీ మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నామని, దాంట్లో భాగంగా మొదటిగా ఈ కారును అందిస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మందగమన పరిస్థితులున్నప్పటికీ, మంచి అమ్మకాలు సాధించామని జో కింగ్ చెప్పారు.
2013-14లో 10.126గా ఉన్న కార్ల విక్రయాలు 2014-15లో 12% వృద్ధితో 11,292కు పెరిగాయని పేర్కొన్నారు. భారత లగ్జరీ మార్కెట్లో తమ అగ్రస్థానాన్ని నిలుపుకున్నామని చెప్పారు.