మెర్సిడెస్ సీ-క్లాస్‌లో రెండు డీజిల్ వేరియంట్లు
న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్.. సీ-క్లాస్ సెడాన్ మోడల్‌లో రెండు కొత్త వేరియంట్ల (డీజిల్) ను బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘సీ 220 సీడీఐ స్టైల్’ వేరియంట్ ధర రూ. 39.9 లక్షలు, ‘సీ 220 సీడీఐ అవాంట్‌గార్డె’ వేరియంట్ ధర రూ.42.9 లక్ష లుగా ఉంటుందని మెర్సిడెస్ పేర్కొంది. అలాగే సీ- క్లాస్ పెట్రోల్ కార్ల దేశీ ఉత్పత్తిని తమ చకన్ ప్లాంటులో ప్రారంభిస్తామని మెర్సిడెస్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ ఈబర్‌హార్డ్ కెర్న్ చెప్పారు. భారత్‌లో సీ 200 అవాంట్‌గార్డె పెట్రోల్ కార్ల ఉత్పత్తిని మూడు నెలలలోగా ప్రారంభిస్తామని తెలిపారు.