మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు | Mercedes-Benz launches performance legend AMG C63S for Rs 1.3 crore | Sakshi
Sakshi News home page

మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు

Published Fri, Sep 4 2015 12:28 AM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు

మెర్సిడెస్ బెంజ్ నుంచి రూ.1.3 కోట్ల కారు

న్యూఢిల్లీ: జర్మనీ లగ్జరీ కార్ల కంపెనీ మెర్సిడెస్-బెంజ్ కొత్త లగ్జరీ కారును గురువారం మార్కెట్లోకి తెచ్చింది. ఏఎంజీ సి63 ఎస్ పేరుతో అందిస్తున్న ఈ కారు ధర రూ.1.3 కోట్లని(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ) కంపెనీ తెలిపింది. ఏఎంజీ క్లాస్‌లో భారత్‌లో తాము అందిస్తున్న పదో మోడల్ ఇదని  మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఇబర్‌హర్డ్ కెర్న్ చెప్పారు. ఇంటెలిజెంట్ అసిస్టెన్స్ సిస్టమ్స్‌తో లభించే ఈ 4.0 లీటర్ వీ8 బై-టర్బో ఇంజిన్ కారు ఇంతకు ముందటి మోడళ్లతో పోల్చితే 32 శాతం అధిక మైలేజీనిస్తుందని వివరించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4 సెకన్లలో  అందుకుంటుందని తెలిపారు. పెర్ఫామెన్స్ కార్ల సెగ్మెంట్లో ఈ కారుతో తమ స్థానం పటిష్టమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement