Mercedes-Benz
-
మెర్సిడెస్ కొత్త మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ భారత్‌లో మరో రెండు టాప్ ఎండ్ మోడళ్లను గురువారం విడుదల చేసింది. వీటిలో ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే, సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ ఉన్నాయి. వీటి గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఎక్స్‌షోరూంలో ప్రారంభ ధర రూ.1.10 కోట్లు. ఏఎంజీ జీఎల్సీ 43 4మేటిక్ కూపే మోడల్‌కు 1,991 సీసీ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్, ఏఎంజీ స్పీడ్íÙఫ్ట్ ఎంసీటీ 9జీ ట్రాన్స్మిషన్ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 4.8 సెకన్లలో అందుకుంటుంది. సీఎల్ఈ 300 క్యాబ్రియోలెట్ ఏఎంజీ లైన్ మోడల్ 1,999 సీసీ ఇన్లైన్–4 టర్బోచార్జ్డ్ ఇంజన్ ఏర్పాటు ఉంది. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని 6.6 సెకన్లలో చేరుకుంటుంది. కాగా, 2023–24లో మెర్సిడెస్ బెంజ్ ఇండియా దేశీయంగా 18,123 యూనిట్లు విక్రయించింది. 2024 జనవరి–జూన్‌లో 9 శాతం వృద్ధితో 9,262 యూనిట్లు రోడ్డెక్కాయి. 2024లో రెండంకెల వృద్ధి సాధిస్తామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. మైబాహ్ ఎలక్ట్రిక్ కారు సెప్టెంబరులో భారత్‌లో అడుగు పెడుతుందని వెల్లడించారు. -
మెర్సిడెస్ బెంజ్ రికార్డు విక్రయాలు..
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ గత ఆర్థిక సంవత్సరంలో నెలవారీ, త్రైమాసికాలవారీ, పూర్తి సంవత్సరంవారీగా రికార్డు అమ్మకాలు నమోదు చేసింది. జనవరి–మార్చి త్రైమాసికంలో అత్యధికంగా 5,412 వాహనాలను విక్రయించింది. గత మార్చి త్రైమాసికంలో నమోదైన 4,697 యూనిట్లతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఇక ఆర్థిక సంవత్సరం వారీగా అమ్మకాలు 10 శాతం పెరిగి 16,497 యూనిట్ల నుంచి 18,123 యూనిట్లకు చేరాయి. నెలవారీ అమ్మకాలకు సంబంధించి మార్చిలో అత్యధిక స్థాయిలో విక్రయించినట్లు సంస్థ ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. 30 ఏళ్ల క్రితం భారత్‌లో తాము కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి ఇవి అత్యుత్తమ గణాంకాలని వివరించారు. 2024లో 9 కొత్త వాహనాలను ఆవిష్కరిస్తున్నట్లు, వీటిలో 3 బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు ఉండనున్నట్లు చెప్పారు. -
ఖరీదైన కారు కొన్న ఆర్ఆర్ఆర్ సింగర్.. ఎన్ని కోట్లంటే?
సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ యానిమల్. రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్లో రిలీజైన యానిమల్ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రీ కీలక పాత్రలో కనిపించింది. అయితే ఈ చిత్రంలోని పెహేలే భీ మే, కబీర్ సింగ్ కైసే హువా అనే పాటలను ఆలపించారు ప్రముఖ సింగర్ విశాల్ మిశ్రా. తాజాగా అతను ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆధునాతన సౌకర్యాలున్న లగ్జరీ మెర్సిడెస్-బెంజ్ మేబ్యాక్ కారును సొంతం చేసుకున్నారు. ఈ కారు ధర దాదాపు రూ.3.50 కోట్ల రూపాయలుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. సింగర్ విశాల్ గతంలో యోధా , సత్యప్రేమ్ కి కథ, చోర్ నికల్ కే భాగే, ఆర్ఆర్ఆర్ హిందీ వెర్షన్ నాటు నాటు సాంగ్ పాడారు. ప్రస్తుతం అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో నటించిన రాబోయే చిత్రం బడే మియాన్ చోటే మియాన్లో పాటలను ఆలపించారు. ఈ చిత్రంలో మానుషి చిల్లర్, అలయ ఎఫ్, సోనాక్షి సిన్హా, రోనిత్ బోస్ రాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది ఏప్రిల్ 11, 2024న థియేటర్లలో రిలీజ్ కానుంది. View this post on Instagram A post shared by Vishal Mishra (@vishalmishraofficial) -
మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరల పెంపు
న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ జనవరి ఒకటి నుంచి కొన్ని మోడళ్ల ధరలను 2% వరకు పెంచనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఇన్పుట్ వ్యయాలు, కమోడిటీ ధరలు, రవాణా సరఫరా ఖర్చులు అధికమవడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కారణంగా కార్ల ధరలు పెంచుతున్నట్లు కంపెనీ తెలిపింది. సీ–క్లాస్ కారుపై రూ.60,000 నుంచి, టాప్ ఎండ్ మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్680పై రూ.3.4 లక్షల వరకు పెంపుదల ఉంటుంది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఏ–క్లాస్ సెడాన్ నుంచి ఎస్యూవీ జీ63 ఏజీఎం వరకు వివిధ మోడళ్ల కార్లను రూ.46 లక్షలు – రూ.3.4 కోట్ల ధరల శ్రేణిలో విక్రయిస్తుంది. -
కార్ల ధరలకు రెక్కలు!
ముంబై: ద్రవ్యోల్బణం, కమోడిటీ ధరలు పెరగడంతో వ్యయ ఒత్తిళ్లు అధికమవుతున్నందున ఆటో కంపెనీలు తమ వాహన ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయి. మారుతీ సుజుకీ, మహీంద్రా–మహీంద్రా, ఆడి ఇండియా, టాటా మోటార్స్ అండ్ మెర్సిడస్ బెంజ్ సంస్థలు తమ కార్ల ధరల్ని వచ్చే ఏడాది జనవరి నుంచి పెంచుతున్నట్లు ప్రకటించాయి. నిర్వహణ, ముడి సరుకుల వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ధరలు పెంచాలకుంటున్నామని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ధరల పెంపు ఎంతమేర అనేది మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదని, కొన్ని మోడళ్లపై ధరల పెంపు గణనీయంగా ఉండొచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ వాహన ధరలు 2.4% మేర పెరిగాయి. ► జనవరి 1 నుంచి వాహన ధరలు పెంచుతామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ధరల పెంపు ఎంతమేర ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. ►పెంపు జాబితాలో టాటా మోటార్స్ సైతం చేరింది. వచ్చే ఏడాది తొలి నెల నుంచి ప్యాసింజర్, ఎలక్ట్రిక్ వాహన ధరల్ని పెంచే యోచనలో ఉన్నట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు. ఎంతమేర అనేది మాత్రం వెల్లడించలేదు. ► జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా కూడా వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలు పెంచేందుకు సమాయత్తమవుతోంది. సప్లై చైన్ సంబంధిత ఇన్పుట్, నిర్వహణ వ్యయాలు పెరిగిన నేపథ్యంలో వాహన ధరలను రెండు శాతం మేర పెంచుతున్నట్లు తెలిపింది. ‘‘సంస్థతో పాటు డీలర్ల మనుగడ కోసం పెంపు నిర్ణయం తప్పలేదు. కస్టమర్లపై ధరల భారం వీలైనంత తక్కువగా ఉండేలా చూస్తాము’’ అని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ దిల్లాన్ తెలిపారు. -
మెర్సిడెస్ నుంచి మరో 4 మోడళ్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఈ ఏడాది భారత మార్కెట్లో మరో 4 మోడళ్లను పరిచయం చేస్తోంది. 2023లో ఇప్పటికే ఆరు మోడళ్లు రోడ్డెక్కాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. కొత్త జీఎల్‌సీని హైదరాబాద్ మార్కెట్లో గురువారం విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది మొత్తం 10 మోడళ్లను తీసుకు రావాలని నిర్ణయించామన్నారు. ‘వచ్చే 12–18 నెలల్లో 3–4 ఎలక్ట్రిక్ మోడళ్లు ప్రవేశపెడతాం. కొత్త జీఎల్సీ దేశవ్యాప్తంగా 1,500 బుకింగ్స్ నమోదయ్యాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకంగా 200 ఉన్నాయి. జనవరి–జూన్‌లో అన్ని మోడళ్లు కలిపి 8,500 యూనిట్లు విక్రయించాం. జూలై–డిసెంబర్లో రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం’ అని వివరించారు. -
లగ్జరీ కార్ల సేల్స్ బీభత్సం.. ఏ వెహికల్‌ను ఎక్కువగా కొన్నారంటే
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల పరిశ్రమ భారత్‌లో కొత్త పుంతలు తొక్కుతోంది. అమ్మకాల పరంగా ఈ ఏడాది ఆల్ టైమ్ హై దిశగా పరిశ్రమ దూసుకెళుతోంది. లగ్జరీ కార్ల విక్రయాల్లో దేశంలో తొలి మూడు స్థానాల్లో ఉన్న జర్మనీ సంస్థలు మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ , ఆడి 2023 జనవరి–జూన్ కాలంలో రికార్డు స్థాయిలో వ్యాపారం చేశాయి. ఈ ఏడాది తొలి అర్ధ భాగంలో మెర్సిడెస్ బెంజ్ దేశవ్యాప్తంగా అత్యధికంగా 8,528 యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 శాతం అధికం. బీఎండబ్ల్యూ గ్రూప్ అత్యధికంగా 5,867 యూ నిట్ల అమ్మకాలను సాధించింది. ఇందులో 391 మి నీ బ్రాండ్ కార్లున్నాయి. గతేడాదితో పోలిస్తే బీఎండబ్లు్య గ్రూప్ 5 శాతం వృద్ధి సాధించింది. ఆడి నుంచి 3,474 యూనిట్ల కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లా యి. 2022 జనవరి–జూన్‌తో పోలిస్తే 97% ఎక్కువ. సుమారు 47,000 యూనిట్లు.. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి–జూన్‌లో సుమారు 21,000 యూనిట్ల లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. తొలి అర్ధ భాగంతో పోలిస్తే జూలై–డిసెంబర్ పీరియడ్ మెరుగ్గా ఉంటుందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. 2023లో భారత్‌లో సుమారు 46,000–47,000 యూనిట్ల లగ్జరీ కార్లు అమ్ముడవుతాయన్న అంచనాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటి వరకు భారత్‌లో అత్యధికంగా 2018లో సుమారు 40,000 యూనిట్ల లగ్జరీ కార్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని చెప్పారు. ‘లగ్జరీ విభాగం 2019లో అప్పటి ఆర్థిక పరిస్థితుల కారణంగా నష్టపోయింది. మహమ్మారి రాకతో 2020 నుంచి వృద్ధికి ఆటంకం కలిగింది. 2023 పునరుజ్జీవన సంవత్సరం. ప్రతి కంపెనీ వృద్ధి సాధిస్తోంది. ఏదో ఒక కంపెనీ మరో సంస్థ కంటే బలంగా ఎదుగుతోంది. ఇదే వాస్తవికత. ఇది కొనసాగుతూ ఉంటుంది’ అని తెలిపారు. రికార్డులు బ్రేక్ అవుతాయి.. ఈ ఏడాది రెండవ అర్ధ భాగంలో రికార్డులు బద్దలు అవుతాయని బీఎండబ్లు్య గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా తెలిపారు. ‘2023 జనవరి–జూన్ కంటే జూలై–డిసెంబర్ మెరుగ్గా ఉంటుంది. సరఫరా సాధారణ స్థితికి వస్తుంది. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉంటే బీఎండబ్లు్యకు 2023 రికార్డు సంవత్సరం అవుతుంది. డిమాండ్, ఉత్పత్తులు బలంగా ఉన్నాయి. ఎక్స్5 రాక కలిసి వస్తోంది. కస్టమర్ల నుంచి స్పందన బాగుంది. కొత్త మోడళ్ల రాక, ఇప్పటికే ఉన్న కార్లతోపాటు బలమైన భారత ఆర్థిక వ్యవస్థ పరిశ్రమ వృద్ధికి దోహదం చేస్తోంది. సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. ప్రజల ఆర్జన పెరుగుతోంది. ప్రస్తుతం కొన్ని పాశ్చాత్య దేశాల మాదిరిగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను మనం ఎదుర్కోవడం లేదు. మాకు ఇక్కడ ఇది ఇప్పటికీ సహేతుక స్థాయి. భారత ఆర్థిక వ్యవస్థలో బలమైన పునాది ఉంది. ఇది వృద్ధికి అవకాశం ఇస్తుంది’ అని వివరించారు. 2030 నాటికి రెండింతలు.. స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు కూడా బలమైన వృద్ధిని నమోదు చేయడం వంటి ఇతర అంశాలు, మెరుగైన బోనస్‌లు, చెల్లింపులు ఉన్నాయి. చాలా కంపెనీలు కూడా కార్లను కొనుగోలు చేస్తున్నాయి అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తెలిపారు. ‘ప్రస్తుతం పరిశ్రమ బలంగా ఊపందుకుంటోంది. వినియోగదార్లు లగ్జరీ కార్ల వైపు చాలా స్పృహతో మళ్లుతున్నారు. కాబట్టి డిమాండ్ కొనసాగుతోంది’ అని సంతోష్ చెప్పారు. మొత్తం కార్ల విభాగం మాత్రమే కాకుండా లగ్జరీ సెగ్మెంట్ కూడా వృద్ధి చెందుతుందని నమ్ముతున్నామని బల్బీర్ సింగ్ థిల్లాన్ తెలిపారు. ‘మధ్య, దీర్ఘకాలిక వృద్ధి కథనం చెక్కుచెదరకుండా ఉంది. మొత్తం కార్ల విభాగంలో ప్రస్తుతం లగ్జరీ విభాగం వాటా కేవలం 1 శాతం మాత్రమే. 2030 నాటికి ఇది 2 శాతానికి చేరుతుంది. పరిశ్రమ సరైన దిశలో పయనిస్తోంది’ అని తెలిపారు. -
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు, ధర అక్షరాల రూ. 1,117 కోట్లు
ఓ బ్రిడ్జిని కట్టేందుకు రూ. వెయ్యి కోట్లు కావాలి. పేద్ద లగ్జరీ హోటల్ కట్టాలంటే రూ. వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాలి. చిన్న పథకం అమలు చేయాలన్నారూ. వెయ్యి కోట్లయితే కావాలి. అయితే కొన్ని కొన్నిసార్లు కారు కొనాలన్నారూ. వెయ్యి కోట్లుండాలండోయ్. మీరు సరిగానే చదివారు. ఇటీవలి వేలంలో ఓ పాత కాలం బెంజ్ కారు అక్షరాలా రూ. వెయ్యి కోట్లపైనే పలికింది. 1955 నాటి 300 ఎస్ఎల్ఆర్ మర్సిడీజ్ బెంజ్ (ఉహ్లెన్‌హాట్) కారును మే 5న ఆర్ఎమ్ సదబీజ్ సంస్థ వేలం వేస్తే ఒకాయన రూ. 1,117 కోట్లు పెట్టి కొన్నాడు. తద్వారా ఈ కారును ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును చేశాడు. గతంలోని రూ.500 కోట్ల రికార్డు (1963 నాటి ఫెరారీ 250 జీటీవో)ను తిరగరాశాడు. జర్మనీలోని స్టట్‌గాట్‌లో ఉన్న మర్సిడీజ్ మ్యూజి యంలో ఈ వేలమూ రహస్యంగానే జరిగింది.. కొన్నాయన పేరూ రహస్యంగానే ఉంది. రెండంటే రెండే కార్లు 300 ఎస్ఎల్ఆర్ కార్లను మర్సిడీజ్ బెంజ్ కంపెనీ రెండంటే రెండే తయారు చేసింది. రెండూ కూడా కంపెనీ దగ్గరే ఉన్నాయి. కంపెనీతో ఈ మాస్టర్ పీస్‌ను వేలం వేయించేందుకు 18 నెలలు పెద్ద లాబీయింగే జరిగిందట. ఎట్టకేలకు కంపెనీ ఒప్పుకోవడం, రహస్యంగా వేలం వేయడం చకచకా జరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కార్లను సేకరించే హాబీ ఉన్న వారు, కారును పెద్ద మొత్తం ధర పెట్టి కొనే వాళ్లలో 10 మందిని ఈ వేలం కోసం ఎంపిక చేశారట. వీరందరినీ ప్రైవేట్ జెట్‌లో వేలంకు తీసుకెళ్లారట. వేలం కోసం స్టట్గాట్లోని మ్యూజియంను వారం పాటు మూసేశారట. కారును కొనేవాళ్లు కొన్నేళ్ల వరకు దాన్ని అమ్మకుండా, ప్రత్యేక కార్యక్రమాల్లో ఈ కారును ప్రదర్శనకు తీసుకొచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నారట. డబ్బుతో స్కాలర్షిప్లు వేలంలో వచ్చిన డబ్బుతో ప్రపంచవ్యాప్త మర్సిడీజ్ బెంజ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టు కంపెనీ చెప్పింది. పర్యావరణం, డీకార్బనైజేషన్పై పరిశోధన చేసే యువతకు స్కాలర్‌షిప్‌గా ఈ డబ్బును అందిస్తామని తెలిపింది. కంపెనీ దగ్గర ఉన్న రెండో కారును స్టట్గాట్ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఇంతకీ ఈ కారు పేరులో ఉహ్లెన్‌హాట్ ఎందుకు ఉందనుకుంటున్నారు? అప్పటి మెర్సెడెస్ టెస్ట్ డిపార్ట్మెంట్ హెడ్, కారు సృష్టికర్త రుడాల్ఫ్ ఉహ్లెన్‌హాట్ వీటిల్లో ఓ కారును కంపెనీ కారుగా వాడారు. అందుకే ఈ కార్లను ఉహ్లెన్‌హాట్ కార్లు అని పిలుస్తున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ ఈ కారు ప్రత్యేకతలేంటి? ►1955లో రెండంటే రెండే కార్లను తయారు చేశారు. చూడటానికి రేసింగ్ కారులా ఉంటాయి. వీటికి పైకి తెరుచుకునే గల్వింగ్ డోర్లు ఉన్నాయి. బాడీని అల్యూమినియంతో చేశారు. ►మూడు లీటర్ల స్ట్రైట్ 8 సిలిండర్ ఇంజిన్‌తో నడుస్తాయి. ►అత్యధిక వేగం గంటకు 286 కిలోమీటర్లు. బరువు 1,117 కిలోలు. ►పొడవు 4.3 మీటర్లు, వెడల్పు 1.74 మీటర్లు, ఎత్తు 1.21 మీటర్లు. ►300 ఎస్ఎల్ఆర్ బెంజ్.. రెండు ప్రపంచ చాంపియన్‌షిప్ కార్ రేసులను గెలిచింది. సరాసరి గంటకు 157 కిలోమీటర్ల వేగంతో 1,600 కిలోమీటర్ల దూరాన్ని కారు చేరుకుంది. -
ఎలక్ట్రిక్ కారుపై అదిరిపోయే బంపరాఫర్, రూ.7లక్షల భారీ డిస్కౌంట్!
భారతీయులకు శుభవార్త. ప్రముఖ జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ దేశీయ మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్‌పై బంపరాఫర్ ప్రకటించింది. మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ ఎలక్ట్రిక్ వెహికల్ ఎస్‌యూవీని కొనుగోలు చేసిన కస్టమర్లకు సుమారు రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. మెర్సిడెజ్ బెంజ్ సంపన్నులను టార్గెట్ చేస్తూ 2020 అక్టోబర్ నెలలో ఇండియన్ మార్కెట్లో ఎక్స్ షోరూమ్ ధర రూ.99.3లక్షలతో మెర్సిడెజ్ బెంజ్ఈక్యూసీని విడుదల చేసింది. అయితే ఆ తర్వాత మ్యానిఫ్యాక్చరింగ్, ట్రాన్స్ పోర్ట్ కాస్ట్ పెరగడంతో రెండు సార్లు ఆ వెహికల్ ధరల్ని పెంచింది. దీంతో బెంజ్ కారు ధర రూ.1.06కి చేరింది. తాజాగా ఆ కారుపై రూ.7లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. అందుకు కారణంగా దేశీయ మార్కెట్లో ఈ కారు తరహా ఫీచర్లతో బీఈవీ ఎస్యూవీ వెహికల్స్ విడుదలయ్యాయి. ఆ వెహికల్స్ దెబ్బతో మెర్సిడెజ్ బెంజ్ ఈక్యూసీ వెహికల్స్ సేల్స్ తగ్గాయి. అందుకే ఆ పోటీ తట్టుకొని సేల్స్ జరిపేలా భారీ డిస్కౌంట్ ఇస్తూ ఈ కీలకం నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ ఎంతంటే? 80కేడ్ల్యూహెచ్ బ్యాటరీ, 20.8-19.7కేడబ్ల్యూహెచ్/100కేఎం..402.3బీపీహెచ్ ఉండగా మ్యాక్స్ పవర్ 760ఎన్ఎంతో పీక్ టార్క్ అందిస్తుంది. స్పీడ్ 5.1 సెకండ్స్లో 0 నుంచి 100కిలోమీటర్ల వేగంతో వెళ్లగా టాప్ స్పీడ్ గంటకు 180కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇక ఈ కారును సింగిల్ ఛార్జ్‌తో 471కిలోమీటర్లు వరకు ప్రయాణం చేయోచ్చు. అంతేకాదు ఈ కారులో మూడు ఛార్జింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయని మెర్సిడెంజ్ బెంజ్ ప్రతినిధులు చెబుతున్నారు అందులో హోమ్ ఛార్జింగ్, ఏసీ వాల్ అవుట్లెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యాలున్నాయి. 50కేడ్ల్యూహెచ్ టైప్ కార్ ఫుల్ ఛార్జింగ్ 90నిమిషాల్లో ఎక్కుతుంది.హోమ్ ఛార్జింగ్ యూనిట్ 2.4కేడ్ల్యూహెచ్ ఫుల్ చార్జింగ్ పెట్టేందుకు 21 గంటలు పడుతుండగా..7.4కేడ్ల్యూహెచ్ ఏసీ వాల్ ఛార్జర్ సైతం ఫుల్ ఛార్జింగ్ పెట్టేందుకు 21గంటల సమయం పడుతుంది. ఇక లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న ఈ కారుపై అపరిమితంగా సర్వీసింగ్‌తో పాటు రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో 5ఏళ్ల వారంటీని..ఈక్యూసీ బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీని అందిస్తున్నట్లు జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెజ్ బెంజ్ తెలిపింది. చదవండి: సంచలనం! ఎలన్ మస్క్‌కు ఎదురు దెబ్బ..ఈ ఎలక్ట్రిక్ కార్ రేంజ్ వెయ్యి కిలోమీటర్లు! -
ఐదేళ్లలో తొలిసారిగా..! మెర్సిడెజ్ బెంజ్ స్థానం ఆ కంపెనీ కైవసం..!
2021గాను ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్‌కు అనూహ్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాదిలో వాహనాల విక్రయాల సంఖ్య గణనీయంగా పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మెర్సిడెజ్ బెంజ్‌కు ఉన్న క్రేజ్‌ను 2021గాను బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. గత ఏడాదిగాను లగ్జరీ కార్ల కేటాగిరీలో అత్యధికంగా అమ్ముడైన కార్ల బ్రాండ్‌గా బీఎండబ్ల్యూ నిలిచింది. తగ్గిన అమ్మకాలు..! ఐదేళ్ల తరువాత తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అమ్ముడైన ప్రీమియం లగ్జరీ కార్లలో బెంజ్ మొదటిస్థానాన్ని కోల్పోయింది. 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.05 మిలియన్ వాహనాలను మెర్సిడెజ్ బెంజ్ విక్రయించినట్లు తెలుస్తోంది. అదే ఏడాదిగాను సుమారు రికార్డు స్థాయిలో 2.2 మిలియన్ వాహనాల అమ్మకాలను బీఎండబ్ల్యూ జరిపింది. ప్రీమియం కార్లలో మెర్సిడెజ్-బెంజ్ స్థానాన్ని బీఎండబ్ల్యూ సొంతం చేసుకుంది. మరోవైపు అనూహ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో మెర్సిడెజ్ బెంజ్ 90 శాతం మేర అధికంగా అమ్మకాలను జరపడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా బెంజ్ సుమారు 99,301 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. యూరప్‌లో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో మెర్సిడెజ్ బెంజ్ ఈ ఏడాదిగాను అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ఇది దాదాపు 11.2 శాతంగా ఉంది. ఇదిలా ఉండగా అమెరికాలో విక్రయాల్లో అతి తక్కువ వృద్ధిని మెర్సిడెస్-బెంజ్ సాధించింది. 2021గాను అమెరికాలో 0.4 శాతం పెరుగుదలను నమోదుచేసింది. బీఎండబ్ల్యూ అమ్మకాల్లో భారత్‌లో భేష్..! 2021 భారత్‌లో బీఎండబ్ల్యూ గణనీయమైన అమ్మకాలను జరిపింది. గత ఏడాదిలో మొత్తంగా 8,876 కార్లను భారత్‌లో విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా టూవీలర్ వాహనాల్లో 5,191 యూనిట్లను విక్రయించినట్లు బీఎండబ్ల్యూ వెల్లడించింది. టూవీలర్ వాహనాల అమ్మకాల్లో ఏకంగా 35 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. చదవండి: రేసింగ్ స్పోర్ట్స్ బైక్స్‌లో సంచలనం..! అందులోనూ ఎలక్ట్రిక్ బైక్..! ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 235 కి.మీ..! -
ప్రపంచంలోని తొలి ఆటోమొబైల్ కంపెనీగా రికార్డు సృష్టించిన మెర్సిడెస్ బెంజ్..!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరో అరుదైన ఘనతను సాధించింది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌కు ఆమోదం పొందిన కంపెనీగా మెర్సిడెస్ బెంజ్ నిలిచింది. ఈ అరుదైన ఘనతను సాధించిన తొలి ఆటోమోటివ్ కంపెనీగా బెంజ్ అవతరించింది. లెవెల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సాంకేతికత ప్రమాణాలను సెట్ చేసే ఐక్యరాజ్యసమితి నియంత్రణ సంస్థ UN-R157 ఆమోదం తెలిపింది. 2022 ప్రథమార్థంలో మెర్సిడెస్ బెంజ్ ఎస్- క్లాస్, ఈక్యూఎస్ మోడల్స్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. లెవల్ 3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను ‘డ్రైవ్ పైలట్’గా పేరుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ వ్యవస్థతో వాహనదారులు ఆటోమేటెడ్ మోడ్‌లో 60 kmph వేగంతో డ్రైవ్ చేయగలరు. సురక్షితమైన ఆటోనామస్ డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకుగాను అదనపు సెన్సార్లను డ్రైవ్ పైలట్‌లో మెర్సిడెస్ బెంజ్ అమర్చింది. వీటిలో లైడర్, వెనుక విండోలో కెమెరా, అత్యవసర వాహనాల నుంచి బ్లూ లైట్లు, ఇతర ప్రత్యేక సిగ్నల్‌లను గుర్తించడానికి రూపొందించబడిన మైక్రోఫోన్స్‌ను ఏర్పాటుచేశారు. అసాధారణమైన పరిస్థితులో ట్రాఫిక్‌ను గుర్తించడానికి డిజిటల్ హెచ్డీ మ్యాప్‌ను కూడా అందుబాటులో ఉంచారు. జర్మనీలో డ్రైవ్ పైలట్ రెడీ..! ఇప్పటికే జర్మనీలో 13,191 కి.మీ హైవేలపై డ్రైవ్ పైలట్‌ను అందిస్తున్నట్లు బెంజ్ పేర్కొంది. యూఎస్ఏ , చైనా వంటి దేశాలలో డ్రైవ్ పైలట్ సిస్టమ్ విస్తృతమైన టెస్ట్ డ్రైవ్‌లను కూడా నిర్వహిస్తోన్నట్లు వెల్లడిచింది. లెవల్-3 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ అంటే..! పలు దిగ్గజ కంపెనీలు ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్‌ను రూపొందిస్తున్నాయి. కాగా ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్స్‌లో టెస్లా ముందుంది. టెస్లా కేవలం లెవల్-2 ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. లెవల్ 2 ఆటోనామస్ కార్లను నడుపుతున్న వాహనదారులు కచ్చితంగా డ్రైవింగ్ వీల్‌పై చేతులను ఉంచుతూ ఉండాలి. ఒక వేళ అలా చేయకపోతే ఆటోనామస్ డ్రైవింగ్ సిస్టమ్ వాహనదారుడిని హెచ్చరిస్తుంది. కాగా ప్రస్తుతం మెర్సిడెస్-బెంజ్ డెవలప్ చేసిన లెవల్-3 డ్రైవ్ పైలట్‌తో వాహనదారుడు డ్రైవింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు. చదవండి: వాహన విక్రయాలకు చిప్ సెగ -
ఎలక్ట్రిక్ వాహనాల్లో సంచలనం..! ఒక్కసారి ఛార్జ్‌తో 1000 కిమీ ప్రయాణం..!
ఎలక్ట్రిక్ కార్లలో రారాజు అంటే కచ్చితంగా టెస్లా పేరే చెప్పొచ్చు...! రానున్న రోజుల్లో టెస్లా స్థానాన్ని చేజిక్కించుకునేందుకు పలు ఆటోమొబైల్ కంపెనీలు సిద్దమైనాయి. టెస్లాకు గట్టిపోటీ ఇవ్వాలంటే కార్ల రేంజ్ చాలా ముఖ్యమైనది. ఆయా కంపెనీలు రూపొందిస్తోన్న ఈవీ కార్లల్లో రేంజ్ ఎక్కువగా ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలను చేస్తున్నాయి. రేంజ్‌ను ముఖ్యంగా భావించిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఈవీ కార్ల ఉత్పత్తిలో ఒక ముందడుగు వేసింది. ఒక్కసారి ఛార్జ్‌తో ఏకంగా 1000 కిమీ ప్రయాణం...! ఎలక్ట్రిక్ కార్ల రేంజ్ విషయంలో మెర్సిడెజ్ బెంజ్ సంచలన విజయాన్ని నమోదుచేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జ్‌తో ఏకంగా 1000కిమీ మేర ప్రయాణం సాగించే ఈవీ కారును వచ్చే ఏడాది జనవరి 3 మెర్సిడెజ్ ఆవిష్కరించనుంది. మెర్సిడెజ్ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కాన్సెప్ట్ కారుకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈవీ కార్లలో ఎరోడైనమిక్స్ ఫీచర్‌తో, అత్యధిక వేగంగా వెళ్లే కారుగా విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ నిలుస్తోందని కంపెనీ సీవోవో మార్కస్ స్కాఫర్ వెల్లడించారు.మెర్సిడెజ్లోని ఈక్యూఎస్ కానెస్ట్కారు కంటే తక్కువ డ్రాగ్ కోఫిషియంట్ ఈక్యూఎక్స్ఎక్స్ కల్గి ఉంటుందని మార్కస్ పేర్కొన్నారు. చదవండి: ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్! -
ఇక టెస్లా పని అయిపోయినట్లే.. రంగంలోకి మెర్సిడెస్ బెంజ్!
Mercedes-Benz EQS 450+ Electric Car: ఇప్పటి వరకు ప్రపంచంలో ఎలక్ట్రిక్ కారు అనగానే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చే కంపెనీ టెస్లా. ఎందుకంటే, టెస్లా కారును ఒకసారి ఛార్జ్ చేస్తే చాలా దూరం ప్రయాణిస్తుంది. అలాగే, ఈ కారులో అత్యధునిక సదుపాయాలు కూడా ఉంటాయి. అందుకే, ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడవుతున్న కార్లలో టెస్లా కార్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే, టెస్లా కంపెనీకి చెక్ పెట్టేందుకు ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ రంగంలోకి దిగింది. మెర్సిడెస్ బెంజ్ తన ఫ్యాన్సీ ఎలక్ట్రిక్ ఎస్యువి, సెడాన్ కార్లను మార్కెట్లోకి తీసుకొని రావడం ద్వారా టెస్లా చెక్ చెప్పాలని చూస్తుంది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ మెర్సిడెస్ కొత్త ఫ్లాగ్ షిప్ ఎలక్ట్రిక్ కారు ఈక్యూఎస్ ప్రారంభ పరీక్షలలో ఎలోన్ మస్క్ టెస్లా కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చింది. 2022 మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ ఎడ్మండ్స్ చేసిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్టులో422 మైళ్లు ప్రయాణించింది. టెస్లా ఉత్తమ మోడల్ కంటే దాదాపు 20 మైళ్ళు ఎక్కువ దూరం ప్రయాణించింది. మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 450+ కారును ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 770 కిమీ వెళ్లనున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ కారు ధర $102,310(రూ.76,07,899) లుగా ఉంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 0-100 కిలోమీటర్ల వేగాన్ని 5.9 సెకన్లలో అందుకుంటుంది.ఈ కారుకు ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ వద్ద 10-80 శాతం చేరుకోవడానికి 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. దీనిలో 107.8 kWh బ్యాటరీ సామర్ధ్యం గల ఇంజిన్ ఉంది. (చదవండి: అమెరికాను దాటి ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశంగా చైనా..) -
మెర్సిడెస్ బెంజ్ నుంచి కొత్త మోడల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న మెర్సిడెస్ బెంజ్ సరికొత్త ‘ఏఎంజీ జీఎల్ఈ 63 ఎస్ 4మేటిక్ ప్లస్ కూపే’ కారును ప్రవేశపెట్టింది. ఏఎంజీ శ్రేణిలో ఇది 12వ మోడల్. ధర ఎక్స్‌షోరూంలో రూ.2.07 కోట్లు. 4 లీటర్ ఇంజన్, 612 హెచ్‌పీ పవర్, అదనంగా 22 హెచ్‌పీ అందించే 48 వోల్ట్ హైబ్రిడ్ సిస్టమ్ పొందుపరిచారు. 3.8 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం గంటకు 280 కిలోమీటర్లు. అన్ని వైపులా ఎయిర్‌బ్యాగ్స్, బ్లైండ్ స్పాట్ అసిస్ట్, యాక్టివ్ బ్రేక్ అసిస్ట్, 3 స్టేజ్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం వంటి హంగులు ఉన్నాయి. -
మెర్సిడెస్ బెంజ్ న్యూ మోడల్ : ప్రత్యేకత ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ బుధవారం తన ఎస్యూవీ విభాగంలో ‘‘2021 జీఎల్సీ’’ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.57.40 లక్షలుగా ఉండే ఈ కారు రెండు వేరియంట్లలో లభిస్తుంది. జీఎల్సీ 200 పెట్రోల్ వేరియంట్ ధర రూ.57.40 లక్షలుండగా, జీఎల్సీ 200డి డీజిల్ వేరియంట్ ధర రూ. 63.15 లక్షలుగా ఉంది. అలెక్సా హోమ్, గూగుల్ హోమ్, 360 డిగ్రీ కెమెరా, నావిగేషన్ సిస్టమ్‌తో పాటు పార్కింగ్ లొకేషన్లు కనుకొనే ‘‘మెర్సిడెస్ మీ కనెక్ట్’’ అనే అధునాతన ఫీచర్లు కలిగిన యాప్‌ను పొందుపరిచారు. రిమోట్ సాయంతో ఇంజిన్‌ను ప్రారంభించే సదుపాయం ఉంది. ఇందులో ఫ్రంట్ సీట్లను మసాజ్ ఫంక్షన్‌తో తయారు చేశారు. మెర్సిడెస్ బెంజ్ భారత ఉత్పత్తుల లైన్అప్లో ఈ తరహా సదుపాయాలను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ‘‘బెంజ్ ఎస్యూవీ విభాగంలో జీఎల్సీ మోడల్ మూలస్తంభంగా నిలిచింది. గతేడాది మా పోర్ట్‌ఫోలియోలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది’’ అని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ ఈ సందర్బంగా తెలిపారు. -
మార్కెట్లోకి మెర్సిడెస్ బెంజ్ కొత్త జీఎల్ఈ ఎల్‌డబ్ల్యూబీ
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన టాప్ ఎండ్ ఎస్యూవీ ‘జీఎల్ఈ లాంగ్ వీల్‌బేస్ (ఎల్‌డబ్ల్యూబీ)’ కారులో కొత్త వేరియంట్లను మంగళవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. జీఎల్ఈ 450 4మ్యాటిక్ ఎల్‌డబ్ల్యూబీ, జీఎల్ఈ 400 డీ 4మ్యాటిక్ ఎల్‌డబ్ల్యూబీ పేర్లతో రెండు వేరియంట్లలో వీటిని విడుదలచేసింది. పెట్రోల్, డీజిల్ ఆప్షన్లలో లభ్యమౌతున్న ఈ నూతన కార్ల ధరల శ్రేణి రూ. 88.80 లక్షలు – రూ. 89.90 లక్షలుగా కంపెనీ ప్రకటించింది. ఇవి కేవలం 5.7 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయని, ఎస్యూవీ విభాగంలో జీఎల్ఈ ఎల్‌డబ్ల్యూబీ కంపెనీకి మూల స్తంభం లాంటిదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ ష్వెంక్ తెలిపారు. -
భారత్‌లోకి మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ బ్రాండ్
పుణే: జర్మనీకి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్.. భారత లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘ఈక్యూ’ని మంగళవారం ఇక్కడ ప్రారంభించింది. నూతన బ్రాండ్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘ఈక్యూసీ’ పేరిట తొలి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్యూవీ భారత మార్కెట్లో విడుదలకానుందని సంస్థ ఎండీ, సీఈఓ మార్టిన్ ష్వెంక్ వెల్లడించారు. ఎలక్ట్రిక్‌కు సంబంధించిన అన్ని వాహనాలను ఇదే బ్రాండ్ నుంచి విడుదలచేయనున్నామని చెప్పారు. -
లాస్ వెగాస్ ‘అవతార్’ షో!
లాస్ వెగాస్: అమెరికాలోని లాస్ వెగాస్‌లో ‘2020 కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)’ అదరగొట్టే ఆవిష్కరణలతో అట్టహాసంగా ప్రారంభమైంది. పలు దిగ్గజ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ సంస్థలు తమ కొంగొత్త ఉత్పత్తులను ఇందులో ప్రదర్శనకు ఉంచాయి. మెర్సిడెస్ బెంజ్ ’ఏఐ’ కాన్సెప్ట్ సూపర్ హిట్ హాలీవుడ్ సినిమా అవతార్ ప్రేరణతో రూపొందించిన ఏవీటీఆర్ కాన్సెప్ట్ కారును మెర్సిడెస్ బెంజ్ ఆవిష్కరించింది. పర్యావరణానికి చేటు చేయని విధంగా మనిషి, యంత్రాలు సమన్వయంతో జీవనం సాగించవచ్చని తెలియజెప్పే రీతిలో ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఈ అటానమస్ వాహనంలో స్టీరింగ్ వీల్, పెడల్స్ వంటివి ఉండవు. సెంటర్ కన్సోల్ ఆధారంగా ఇది పనిచేస్తుంది. బ్యాటరీ సహా ఇందులో అన్ని భాగాలను పూర్తిగా రీసైక్లబుల్ ఉత్పత్తులతో రూపొందించారు. హ్యుందాయ్ ఎయిర్ ట్యాక్సీ దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కొత్తగా రూపొందిస్తున్న ఎయిర్ ట్యాక్సీలను ఎస్–ఏ1 పేరిట ఆవిష్కరించింది. విద్యుత్‌తో నడిచే ఈ ఎయిర్ ట్యాక్సీ గరిష్టంగా గంటకూ 290 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. సుమారు 100 కి.మీ. దూరంలో, అరగంట ప్రయాణం ఉండే ప్రాంతాలకు నడిపే ట్యాక్సీ సర్వీసుల కోసం వీటిని వినియోగించేందుకు హ్యుందాయ్తో ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ ఒప్పందం కుదుర్చుకుంది. శాంసంగ్ ‘డిజిటల్ అవతార్’ దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా కృత్రిమ మేథతో (ఏఐ)తో పనిచేసే ‘డిజిటల్ మనిషి’(డిజిటల్ అవతార్)ని ఆవిష్కరించింది. ఇది అచ్చం మనుషుల్లాగే సంభా షించడం, భావాలను వ్యక్తపర్చడం వంటివి చేయగలదని సంస్థ పేర్కొంది. నియోన్ అనే ఈ టెక్నాలజీతో డిజిటల్ అవతార్లను సృష్టించవచ్చని, డిస్ప్లేలు లేదా వీడియో గేమ్స్‌లో ఉపయోగించవచ్చని శాంసంగ్ తెలిపింది. అవసరానికి తగ్గట్లుగా టీవీ యాంకర్లుగా, సినిమా నటులు, అధికార ప్రతినిధులుగా లేదా స్నేహితులుగానూ వీటిని తీర్చిదిద్దుకోవచ్చని సంస్థ పేర్కొంది. శాంసంగ్ డిజిటల్ మనిషి -
బెంజ్ కంపెనీ ‘అవతార్’ కారు లాంచ్
-
బెంజ్ కంపెనీ నుంచి ‘అవతార్’ కారు
సాక్షి, న్యూఢిల్లీ : జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ కాన్సెప్ట్‌తో తయారుచేసిన ఎలక్ట్రిక్ కార్ డైమ్లర్–బెంజ్‌ను లాస్ వెగాస్‌లో సోమవారం నాడు ప్రారంభమైన కార్ల షోలో ఆవిష్కరించారు. ‘విజన్ అవతార్’గా పిలిచే ఈ కారు పూర్తి పక్కకు తిరగడంతోపాటు డ్రైవర్ స్పర్శకు కూడా స్పందించడం విశేషం. ఇందులో కొత్తరకమైన ఆర్గానిక్ బ్యాటరీని కూడా ఉపయోగించారు. 2009లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్న జేమ్స్ కామెరాన్ ‘విజన్ అవతార్’ కాన్సెప్ట్ కారు ఆవిష్కరణకు రావడం విశేషం. 30 డిగ్రీలు పక్కకు తిరిగేలా నాలుగు కారు చక్రాల ఇరుసులను తయారు చేశారు. దాన్ని ఉన్నచోటు నుంచే కారు పక్కకు తిరగ గలదు. పూర్తి ఎలక్ట్రిక్ కారైన ఇది దాటంతట అదే నడిచే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ‘ఈ కారులో నేను కూర్చొని చూశాను. దీనికి నిజంగా ప్రాణం ఉంది. శ్వాస కూడా తీసుకుంటోంది’ జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యానించారు. ఈ కారుకు నడిపేందుకు చక్రం లేకపోవడం మరో విశేషం. సెంట్రల్ కంట్రోల్ యూనిట్‌ను చేతితో పట్టుకోవడం ద్వారా నడపవచ్చు. చేయి పైకెత్తితే మెనూ సెలక్షన్ కంప్యూటర్ తెర కళ్లముందు కనిపిస్తుంది. వేళ్లతో డైరెక్షన్ ఇస్తూ కారును నడపవచ్చు. ఈ కారు మనిషిలాగా శ్వాస తీసుకున్నట్లు అనిపించడానికి కారణం వెనక భాగాన చేపల మొప్పల్లాగా బాడీ డిజైన్ చేసి ఉండడం. ఇలాంటి కారు ఎప్పటికీ మార్కెట్లోకి వస్తుందో మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం ప్రకటించలేదు. అందుకని ఇప్పుడే ఈ కారు కోసం ఆర్డర్ ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉందని కామెరాన్ వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్ ఎలైట్, ధర ఎంతంటే
సాక్షి, చెన్నై: జర్మన్ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ గురువారం తన కొత్త వి-క్లాస్ ఎలైట్‌ను విడుదల చేసింది. ప్రీమియం లగ్జరీ సెగ్మెంట్‌పై కన్నేసిన బెంజ్ మల్టీ పర్సస్ వెహికల్‌ను తీసుకొచ్చింది. వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ , వి-క్లాస్ ఎక్స్‌క్లూజివ్ కార్లకు అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వి-క్లాస్ ఎలైట్‌ను ఆవిష్కరించింది. స్పెయిన్‌లో రూపొందించిన వి-క్లాస్ ఎలైట్, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ మార్టిన్ ష్వెంక్ చెప్పారు. లగ్జరీ ఎంపీవీ ధర రూ .1.10 కోట్లు (ఎక్స్-షోరూమ్ ఇండియా) గా నిర్ణయించింది. వి-క్లాస్ ప్రొడక్ట్ రేంజ్ వి-క్లాస్ ఎక్స్ప్రెషన్ధర రూ .68.40 లక్షలకు (ఎక్స్-షోరూమ్ ఇండియా), వి -క్లాస్ ఎక్స్‌క్లూజివ్ రూ .81.90 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఇండియా) వీటితో పాటు విక్లాస్ ఎలైట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. అంతేకాదు ప్రతి నెలా కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు కంపెనీ చూస్తోందని ఆయన అన్నారు. లగ్జరీ మార్కెట్ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ 40 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్నారు .మసాజ్ ఫంక్షన్, క్లైమేట్ కంట్రోల్, రిమోట్ సీట్లు సహా, కంట్రోల్డ్ డోర్, 15 స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, వి-క్లాస్ ఎలైట్‌లో ఎజిలిటీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఈ కారులో పొందుపర్చినట్టు చెప్పారు. -
బ్రాండ్ బాబులు!
సాక్షి, హైదరాబాద్: కొత్త బ్రాండు, హైఎండు.. నగరంలోకి వస్తే చాలు.. హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ఎంత ఖర్చయినా చేసేందుకు సిటీలోని సంపన్నులు, యువత వెనుకాడటం లేదు. అందుకే సిటీలోకి ఏ కొత్త మోడల్ కారు వచ్చినా.. బైక్ వచ్చినా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. బుకింగ్‌లు వెల్లువెత్తుతున్నాయి.కొన్ని రోజుల క్రితమే నగరంలో షోరూంలను ప్రారంభించిన ఎంజీ హెక్టార్, కియా కార్లకు పెరిగిన డిమాండ్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. వీటి కోసం నెలలు ముందుగానే బుకింగ్ చేసుకోవాల్సి ఉంది. హైఎండ్ దూకుడు.. హై ఎండ్ కార్లు, బైక్‌ల అమ్మకాలు జోరు మీదున్నాయి. ధర ఎంత ఉన్నా కొనడానికి వాహన ప్రియులు వెనుకాడటంలేదు. 2017 నుంచి 2019 గణాంకాల ప్రకారం.. మెర్సిడెజ్ బెంజ్‌కు చెందిన జీఎల్ఎస్ 350డీ 4 మాటిక్ వాహనాలు 203 రిజిస్టరయ్యాయి. దీని ధర రూ.65 లక్షలకు పైనే ఉంది. అటు బీఎండబ్ల్యూ ఎక్స్ 5 ఎక్స్‌డ్రైవ్ 30డీ డీపీఈ విత్ ఎట్ 55 వాహనాలు 100 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.55లక్షల వరకు ఉంది. వోల్వో ఎక్స్ సీ90 డీ5 వాహనాలు.. 80, బీఎండబ్ల్యూ 520డీ లగ్జరీ డబ్ల్యూ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ 69, వోల్వో ఎక్స్ సీ60 డీ5 వాహనాలు 61 చొప్పున ఈ రెండేళ్లలో అమ్ముడయ్యాయి. గతేడాది హై ఎండ్ కార్ల విక్రయాలు వెయ్యి దాటాయి. ద్విచక్రంలో దీనిదే పైచేయి.. హైఎండ్ ద్విచక్ర వాహనాల్లో హార్లీడేవిడ్సన్ రారాజులా దూసుకుపోతోంది. హార్లీడేవిడ్సన్ ఎక్స్‌జీ 750 వాహనాలు అత్యధికంగా 88 వరకు విక్రయించారు. హార్లిడేవిడ్‌సన్ ఎక్స్‌జీ 750ఏ వాహనాలు 73 వరకు అమ్ముడయ్యాయి. దీని ధర రూ.8.8లక్షల వరకు ఉంది. డీఎస్కే మోటార్ వీల్స్ టీఎన్‌ఏటీ 600 బ్రాండ్, కవాసకి హెవీ ఇండస్ (జపాన్), ఇండియా కవాసకి మోటార్స్‌కు చెందిన నింజా 650 తదితర బైక్‌ల అమ్మకాలు బాగా జరిగాయి. ఆర్టీఏ లెక్కల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.10 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన బైక్‌లు 426 ఉండగా, రూ.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లు 5,061 రిజిస్టరయ్యాయి. అటు రెగ్యులర్ బైక్‌లు, కార్ల అమ్మకాలు గత కొద్ది రోజులుగా 15 శాతం నుంచి 20 శాతం వరకు తగ్గినట్లు నగరంలోని పలువురు ప్రముఖ షోరూమ్ డీలర్లు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా వచ్చిన మార్పుల్లో భాగంగానే హైదరాబాద్‌లోనూ రెగ్యులర్ మోడళ్ల అమ్మకాలు మందగించాయని చెప్పారు. కాగా, 2020 ఏప్రిల్ నుంచి బీఎస్ –6 మోడల్ మార్కెట్లోకి రానున్న దృష్ట్యా చాలామంది వినియోగదారులు కార్ల కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. -
బీఎస్–6 వాహనాల క్యూ!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో బీఎస్–6 ప్రమాణాల అమలు గడువు దగ్గర పడుతుండటంతో వాహన కంపెనీలు కొత్త మోడళ్ల ఆవిష్కరణలను వేగవంతం చేశాయి. ఒకదాని వెంట ఒకటి బీఎస్–6 వేరియంట్లను సిద్ధం చేస్తున్నాయి. వాహన కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించే భారత్ స్టేజ్–6 ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త టెక్నాలజీ కోసం ఆటోమొబైల్ సంస్థలు రూ.70– 80 వేల కోట్లను వెచ్చిస్తున్నాయి. మరోవైపు బీఎస్–4తో పోలిస్తే బీఎస్–6 వాహనం మోడల్‌నుబట్టి 15 శాతం వరకు ఖరీదు కానుంది. ద్విచక్ర వాహన కంపెనీ హోండా బీఎస్–6 వేరియంట్ యాక్టివా–125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. స్కూటర్స్ విభాగంలో ఇదే తొలి బీఎస్–6 వాహనం. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ ఐస్మార్ట్ బైక్ బీఎస్–6 ధ్రువీకరణ దక్కించుకుంది. ఐషర్ ప్రో 2000 సిరీస్ లైట్ డ్యూటీ ట్రక్‌ను విడుదల చేసింది. లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ నాలుగు వేరియంట్లలో లాంగ్ వీల్ బేస్ ఈ–క్లాస్ సెడాన్‌తోపాటు ఎస్–క్లాస్ 350డీ మోడల్‌ను ప్రవేశపెట్టింది. టయోటా కిర్లోస్కర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాను విడుదల చేసింది. బీఎస్–6తో మూడు నాలుగు నెలల్లో పెట్రోల్, డీజిల్ వెహికిల్స్‌ను ప్రవేశపెడతామని మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్ గోయెంకా చెప్పారు. మారుతి సుజుకి ఇండియా బాలెనో, ఆల్టో మోడళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఇతర మోడళ్లను ప్రస్తుతం పరీక్షిస్తోంది. డెడ్‌లైన్‌లోగా అన్ని మోడళ్లను బీఎస్–6 ప్రమాణాలతో ప్రవేశపెడతామని బజాజ్ ఆటో తెలిపింది. మోపెడ్స్ విభాగంలో ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టీవీఎస్.. బీఎస్–6 వేరియంట్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించింది. భారత్ స్టేజ్ ప్రమాణాలు.. భారత్‌లో బీఎస్–1 ప్రమాణాలు 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చాయి. 2005లో బీఎస్–2, బీఎస్–3 2010లో వచ్చాయి. ఇప్పుడున్న బీఎస్–4 ప్రమాణాలు 2017 ఏప్రిల్‌లో మొదలయ్యాయి. దేశంలో కాలుష్యం అంతకంతకూ పెరుగుతుండడంతో బీఎస్–5కు బదులుగా బీఎస్–6 ప్రమాణాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీఎస్–4 వాహనం 50 పీపీఎం (పార్ట్స్ పర్ మిల్లియన్) సల్ఫర్‌ను విడుదల చేస్తే, బీఎస్–6 వెహికల్ విషయంలో ఇది 10 పీపీఎం ఉంటుంది. డీజిల్ కార్లలో నైట్రోజన్ ఆక్సైడ్స్ 70 శాతం వరకు తగ్గితే, పెట్రోల్ కార్లలో 25 శాతం తగ్గుతుంది. బీఎస్–4 కోసం ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన తయారీ సంస్థలు అతి తక్కువ కాలంలోనే నూతన టెక్నాలజీ కోసం పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. భారీ పెట్టుబడులతో... భారత్ స్టేజ్–6 ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలను అభివృద్ధి చేసేందుకు, విడిభాగాలను స్థానికంగా తయారు చేసేందుకై ప్యాసింజర్ వెహికల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీలు రూ.35,000– 40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు ఇక్రా వెల్లడించింది. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థల నుంచి రూ.15,000 కోట్ల వరకు పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మొత్తంగా వాహన పరిశ్రమ రూ.70–80 వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ చెబుతోంది. బీఎస్–6 గ్రేడ్ ఫ్యూయెల్స్ కోసం ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రూ.28,000 కోట్లు ఖర్చు చేస్తున్నాయి. బీఎస్–6 నూతన సాంకేతిక పరిజ్ఞానం కోసం రూ.1,000 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్టు మహీంద్రా ప్రకటించింది. హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా రూ.800 కోట్లు వెచ్చిస్తోంది. 2019–20లో విస్తరణ నిధులు రూ.1,500 కోట్లు ఉండొచ్చని హీరో మోటోకార్ప్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పనున్న కొత్త ప్లాంటుతోపాటు బీఎస్–6 అప్‌గ్రెడేషన్‌కు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు కంపెనీ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. ఫోర్స్ మోటార్స్ రూ.250 కోట్లు వెచ్చిస్తోంది. వచ్చే మూడేళ్లకుగాను యమహా ఇండియా రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. -
మెర్సిడెస్ బెంజ్ కూడా పెంచేసింది
సాక్షి, న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్‌మేకర్ మెర్సిడెస్ బెంజ్ కూడా తన వాహనాలపై పెంచుతున్నట్టు గురువారం ఒక ప్రకటనలో ప్రకటించింది. అంతర్జాతీయ రాజకీయ కారణాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం,పెరుగుతున్నఇన్‌పుట్ ఖర్చులు, విదేశీ మారకవిలువ తమపై గణనీయమైన ఒత్తిడిని పెంచిందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలోనే తమ వాహనాలపై 4శాతం మేర ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. పెంచిన ధరలను సెప్టెంబరునుంచి అమలు చేయనున్నట్టు వెల్లడించింది. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ రోలాండ్ ఫోల్గర్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల్లో రూపాయి విలువ వేగంగా తగ్గుముఖం పట్టిడంతో ధరలను పెంచక తప్పడంలేదని పేర్కొన్నారు. గత ఎనిమిది నెలల్లో యూరోకు వ్యతిరేకంగా రూపాయి 5 శాతం పైగా నష్టపోయింది. కాగా మారుతి సుజుకి ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటర్స్, హోండా కార్స్ ఇండియా వంటి ఇతర కంపెనీలు ఇప్పటికే ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే. -
మెర్సిడెస్ ‘ఏఎంజీ ఈ–63 ఎస్’లో కొత్త వెర్షన్
గ్రేటర్ నోయిడా: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘మెర్సిడెస్–బెంజ్’ తాజాగా తన ‘ఏఎంజీ ఈ–63 ఎస్’ సెడాన్ కారులో కొత్త వెర్షన్ ‘ఏఎంజీ ఈ–63 ఎస్ 4 మేటిక్ ప్లస్’ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ప్రారంభ ధర రూ.1.05 కోట్లు. తాజా కొత్త వెర్షన్‌తో కలుపుకొని కంపెనీ దేశంలో మొత్తంగా 14 ఏఎంజీ మోడళ్లను విక్రయిస్తోంది. ‘కస్టమర్ల నుంచి ఏఎంజీ మోడళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ ఏడాదిలో మరిన్ని ఏఎంజీ మోడళ్లను, ఇతర కార్లను మార్కెట్లోకి తీసుకువస్తాం’ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో రోనాల్డ్ ఫోల్గర్ తెలిపారు. ‘ఏఎంజీ ఈ–63 ఎస్ 4 మేటిక్ ప్లస్’లో 4 లీటర్ ట్విన్టర్బో వీ8 ఇంజిన్‌ను అమర్చామని, ఇది 0–100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.4 సెకన్లలో అందుకుంటుందని పేర్కొన్నారు.